S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/30/2016 - 03:58

హైదరాబాద్, నవంబర్ 29: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను ప్రమాద రహిత జోన్‌గా నిర్వహిస్తూ, భద్రత, రైల్వే ఆస్తులు పెంచేందకు కృషి సల్పుతున్న జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తాను రైల్వే బోర్డు చైర్మన్ ఎకె మిట్టల్ అభినందించారు. న్యూఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో దక్షిణ మధ్య రైల్వే భద్రతపై సమీక్షించారు.

11/30/2016 - 03:56

హైదరాబాద్/ బేగంపేట, నవంబర్ 29: అగ్ని సాక్షిగా పెళ్లాడి..నూరేళ్లు తోడుగా ఉంటూ జీవనాన్ని గడపాల్సిన ఓ భర్త కసాయిగా మారాడు. క్షణికావేశంలో విచక్షణా రహితంగా భార్య గొంతు కోసి హతమార్చాడు. మంగళవారం సాయంత్రం ఈ విషాద సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ కాలనీ కవిత(25), ఈశ్వర్ దంపతులు నివాసం ఉంటున్నారు.

11/30/2016 - 03:55

హైదరాబాద్, నవంబర్ 29: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల జిడిపి రెండు శాతం పడిపోతుందని టికాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 57 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు, నగదు రహిత లావాదేవీలు సాధ్యమేనా? అని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రాన్ని ప్రశ్నించారు.

11/30/2016 - 03:54

హైదరాబాద్, నవంబర్ 29: బంగారు అభరణాలు, వజ్రాలు హోల్ సేల్‌గా సరఫరా చేసే వ్యాపారుల నుంచి దీపావళి ధమాకా, బంపర్ ఆఫర్ల పేరుతో సుమారు 50 కిలోల బంగారు ఆభరణాలు తీసుకుని డబ్బులివ్వకుండా బ్యాంకాక్ పారిపోయిన నగల వ్యాపారి బిపిన్ జైన్‌ను చార్మినార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

11/30/2016 - 03:52

హైదరాబాద్, నవంబర్ 29: రైతుల సమస్యలపై టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ నెల 6న చేపట్టిన ‘రైతు పోరు యాత్ర’ బుధవారం (30న) ముగియనున్నది. ఈ నెల 6న భూపాల్‌పల్లి జిల్లా నుంచి మొదలైన రైతు పోరు యాత్ర వైరా, ఖమ్మం, పెద్దపల్లి, సూర్యాపేట, నల్లగొండ మీదుగా సాగింది. ప్రతి రోజూ 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు పాదయాత్ర చేసి గ్రామీణ ప్రజలను, రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు.

11/29/2016 - 07:44

హైదరాబాద్, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దుతో తగ్గిన రాష్ట్రాల ఆదాయాన్ని కేంద్రమే పూడ్చాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. నోట్ల రద్దు తర్వాత ప్రధాన మంత్రిని కలిసి అందజేసిన లేఖలోని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం మీడియాకు విడుదల చేశారు.

11/29/2016 - 06:44

హైదరాబాద్, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దుపై జనం నిరసన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా సోమవారం వివిధ పార్టీలు నిర్వహించిన ‘బంద్’ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, వామపక్షాలు ఎవరికి వారే నిర్వహించడం వల్లే బంద్ విజయవంతం కాలేదు. జంట నగరాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌లో పాల్గొనలేదు. సినిమా హాళ్లు, విద్యా సంస్థలు మూత పడలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.

11/29/2016 - 06:42

జనగామ టౌన్, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం భారీగా పెద్ద నోట్లు దాచుకున్న వారి పాలిట శాపంగా మారింది. తాజాగా జనగాంలో భారీగా నగదు పట్టుబడింది. వాహన తనిఖీల్లో రూ.30లక్షల విలువైన రద్దయిన పెద్ద నోట్లు పట్టుబడినట్లు జనగామ డిసిపి తేజావత్ వెంకన్న సోమవారం సాయంత్రం వెల్లడించారు. స్థానిక ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డబ్బులను తరలిస్తున్న నిందితుడితో పాటు నగదును చూపించారు.

11/29/2016 - 06:41

హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఏడాదిలోగా యుద్ధప్రాతిపదికన నిర్మించిన ప్రభుత్వం, పేదలకోసం ఉద్దేశించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లపథకాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి-జాక్) చైర్మన్ ప్రొఫెసర్ కోందడరాం ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వాస్తవంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ఇప్పటికే ఒక భవనం ఉందన్నారు.

11/29/2016 - 04:54

హైదరాబాద్, నవంబర్ 28: రబీ సాగుకు నీటి విడుదల ప్రణాళికను నీటిపారుదల శాఖ ఖరారు చేసి సోమవారం ప్రకటించింది. ప్రాజెక్టుల వారీగా సాగు చేసే ఆయకట్టు, వాటికి అవసరమైన నీటి కేటాయింపులను నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి ప్రకటించారు. ఈమేరకు అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు.

Pages