S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/10/2020 - 01:40

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను అంతనాలకు అందని విధంగా భారీగా రూ.లక్షా 82 వేల కోట్లుగా ప్రతిపాదించిన ప్రభుత్వం ఈ మేరకు ఆదాయ అంచనాకు చేరుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొనడంతో ఆ ప్రభావం రాష్ట్ర ఆదాయ రాబడులపై కూడా పడిందని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూనే మరోవైపు బడ్జెట్‌లో ప్రతిపాదించిన అంచనాలను అధిగమిస్తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

03/10/2020 - 01:39

హైదరాబాద్: రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల సంగతి ఎందుకు చెప్పడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మాటలకు, టీఆర్‌ఎస్ మేనిఫెస్టోకు, హామీలకు, ప్రస్తుత బడ్జెట్‌కూ ఏ మాత్రం పొంతన లేదని ఆయన పేర్కొన్నారు.

03/10/2020 - 01:37

హైదరాబాద్, మార్చి 9: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణ రంగంతో పాటు వౌలిక వసతుల ఏర్పాటులో దూసుకుపోతున్న ఎల్ అండ్ డీ సంస్థకు ప్రతిష్టాత్మక మూడు జాతీయ వార్డులు దక్కాయని హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. బెంగళూరుకు చెందిన పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి ఈ అవార్డులను ఎల్ అండ్ టీకి చెందిన ఏ సిన్హా అందుకున్నారని ఆయన తెలిపారు.

03/10/2020 - 01:35

హైదరాబాద్, మార్చి 9: శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే విమాన ప్రయాణికులందరికీ థర్మో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 11-12 దేశాల నుండి హైదరాబాద్ వస్తున్న వారికి మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నామని, ఇకనుండి

03/09/2020 - 05:37

ధర్మపురి, మార్చి 8: శివకేశవుల సన్నిధి, భక్తుల పాలిటి పెన్నిధిగా రాష్ట్రంలో పేరెన్నికగన్న హరిహర క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో ఆదివారం భక్తి పారవశ్యం పొంగి పొర్లింది.

03/09/2020 - 05:00

కల్వకుర్తి, మార్చి 8: ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతుంటే కన్నపేగును కాదనుకున్న ఓ తల్లి అర్థరాత్రి ఆడశిశువును ఆసుపత్రి అవరణలో వదిలి వెళ్లిన సంఘటన కల్వకుర్తిలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుప్రతి ప్రహరీగోడ సమీపంలో శనివారం అర్థరాత్రి చంటిబిడ్డ ఏడుపు వినిపించడంతో సిబ్బంది వెళ్లి చూడగా 15 రోజుల వయసున్న ఆడశిశువు కన్పించింది.

03/09/2020 - 04:53

మిర్యాలగూడ టౌన్, మార్చి 8: పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రథమ నిందితుడైన తిరునగరు మారుతీరావు మరణం మీడియా ద్వారానే తెలిసిందని ఆయన కుమార్తె, ప్రణయ్ భార్య అమృత తెలిపింది. ఆదివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రణయ్‌ను హత్య చేసానన్న పశ్చాతాతపంతో మృతి చెంది ఉంటాడని ఆమె అన్నారు. మారుతిరావు ఎలా మరణించారో తనకు తెలియదని, తన భర్త హత్య కేసులో న్యాయం జరుగుతుందని ఆశించానన్నారు.

03/09/2020 - 04:51

మిర్యాలగూడ, మార్చి 8: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన తిరునగరు మారుతీరావు ఆది నుండి వివాదాస్పదుడే... మారుతీరావు తండ్రి కిరోసిన్ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే మారుతీరావు, అతని తమ్ముడు శ్రవణ్ మొదటి నుండి పలు వివాదాలకు కారకులు.

03/09/2020 - 04:50

మిర్యాలగూడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం ఆయన సొంత ఊరైన మిర్యాలగూడలో సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి హైద్రాబాద్‌లోని ఖైరాతాబాద్‌లో ఉన్న ఆర్యవైశ్యభవన్‌లో అద్దెకు తీసుకున్న గదిలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు దూరమైందన్న మనస్థాపం..

03/09/2020 - 04:05

హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో సేద్యం రంగానికి పెద్దపీట వేశారు. ఆర్థిక మంత్రి హరీష్‌రావు ఆదివారం శాసనసభకు సమర్పించిన బడ్జెట్‌లో సేద్యం రంగం గురించి ప్రత్యేకం గా ప్రస్తావించారు. వ్యవసాయం, మార్కెటింగ్, పశుసంవర్థక రంగాలకు కలిపి 25,812 కోట్ల రూపాయలను కేటాయించారు. జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా అనేక పథకా లు, కార్యక్రమాలను ఈ రంగం అభివృద్ధికి చేపట్టామని వెల్లడించారు.

Pages