S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/08/2018 - 06:35

* బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు

10/08/2018 - 06:30

కొల్లాపూర్, అక్టోబర్ 7: ‘చాణుక్యుల పాలన నుంచి సురభిరాజుల వరకు వివిధ రాజవంశీయులు కొల్లాపూర్ సంస్థానాన్ని పరిపాలించారు.. ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ కొల్లాపూర్ కీర్తిని ప్రపంచానికి చాటుదాం’ అని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు.

10/08/2018 - 06:29

నిజామాబాద్, అక్టోబర్ 7: ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టిని కేంద్రీకరించడం అనివార్యంగా మారింది. ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సిట్టింగ్‌లకే టిక్కెట్లను ఖరారు చేయగా, కాంగ్రెస్ పార్టీలో మాత్రం అభ్యర్థిత్వాల విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది.

10/08/2018 - 06:29

బోధన్, అక్టోబర్ 7: మంజీరానదిలోని ఇసుక కాసులు కురిపించడమేమో గానీ తెలంగాణ పై మహారాష్ట్ర పెత్తనం నిత్యకృత్యంగా మారింది. ఇందులో ఉన్న ఇసుక నిలువలన్నీ తమవేనంటూ అక్కడి అధికారులు తెలంగాణ అధికారులపై దాదాగిరీ చెలాయిస్తున్నారు.

10/08/2018 - 06:27

హైదరాబాద్, అక్టోబర్ 7: రానున్న శాసనసభ ఎన్నికల్లో బీసీలకు 65 శాతం అసెంబ్లీ టికెట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో ఈ నెల 28న బీసీ గర్జన సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న బీసీల భారీ సభకు లక్షలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చింది. అయితే హైదరాబాద్‌లో బహిరంగ సభ ఎక్కడ జరపాలన్నది ఇంకా నిర్ణయించలేదు.

10/08/2018 - 06:26

నిజామాబాద్, అక్టోబర్ 7: ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో ఎడారి దేశాల వైపు దృష్టిసారిస్తున్న యువత బలహీనతను ఆసరాగా చేసుకుని నకిలీ ఏజెంట్లు ఎంతో సులువుగా వారిని మోసగిస్తున్నారు. పేరుమోసిన కంపెనీ, పెద్ద మొత్తంలో జీత భత్యాలు, వసతి, బసతో కూడిన ఉద్యోగాలంటూ నమ్మబలుకుతూ, అమాయకుల నుంచి అందిన మేరకు దండుకుంటున్నారు.

10/08/2018 - 02:44

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియమావళిని ధిక్కరిస్తే ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ హెచ్చరించారు. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదివారం సచివాలయంలో శాంతి భద్రతలపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిందన్నారు.

10/08/2018 - 03:45

జీడిమెట్ల: తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్‌ను వాడుకుని కేసీఆర్ రెచ్చగొట్టే కుట్ర పన్నుతున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కనె్వన్షన్ సభ గాజులరామారంలోని మహరాజ గార్డెన్‌లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది.

10/08/2018 - 02:37

హైదరాబాద్, అక్టోబర్ 7: అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు మరో ఆహ్వానం అందింది. అంతర్జాతీయ స్థాయిలో నవంబర్ 6,7 తేదీలలో సింగపూర్‌లో నిర్వహించనున్న న్యూ ఎకానమీక్ ఫోరమ్‌లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం లభించింది. వివిథ దేశాల నుంచి సుమారు మూడు వందల కంపెనీల ముఖ్య కార్య నిర్వాహకులు, వివిధ దేశాల రాజకీయ నాయకులు ఈ సదస్సులో పాల్గొనున్నారు.

10/08/2018 - 02:35

హైదరాబాద్, అక్టోబర్ 7: ముందస్తు ఎన్నికలు, కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల అనుకున్న సమయానికి మధ్యంతర భృతి, కొత్త పీఆర్‌సీ, ఫిట్‌మెంట్ పొందలేకపోయామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఐఆర్, పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ను సాధించుకుని తీరుతామని సంఘం ధీమా వ్యక్తం చేసింది.

Pages