S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/07/2018 - 04:37

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవెలప్‌మెంట్ (ఓఈసీడీ) ధృవీకరణ ద్వారా విత్తనాలను ధృవీకరించడం వల్ల విదేశాలకు తెలంగాణ విత్తనాన్ని ఎగుమతి చేసేందుకు వీలవుతోందని టీఎస్‌ఎస్‌ఓసీఏ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు తెలిపారు. అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి వి. భాస్కర్ గురువారం హైదరాబాద్ వచ్చారు.

09/07/2018 - 04:35

హైదరాబాద్, సెప్టెంబర్ 6: సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ తమ భవిష్యత్‌పై నిర్లక్ష్యం చేస్తున్నారని 108, సర్వశిక్షా అభియాన్‌లో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలు చెప్పుకోవడానకి తెలంగాణ భవనం వద్దకు భారీగా తరలివచ్చిన 108 ఉద్యోగులను అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నించారు. తెలంగాణ భవనంలోకి చొచ్చుకుని పోవడానకి ప్రయత్నించిన 108 ఉద్యోగులపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు.

09/07/2018 - 04:33

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం పనిచేయడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు ఆపద్దర్మంగా కొనసాగతారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కీలక బాధ్యతలు పడ్డాయి. మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి వౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

09/07/2018 - 04:32

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ జన సమితి అధినేత తెలంగాణ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం 19 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించారు.

09/07/2018 - 04:31

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పీడ వీడిందని పేర్కొంటూ ఉస్మానియా యూనివర్శిటీలో ఏబీవీపీ నేతలు హడావుడి చేశారు. ఆర్ట్సు కాలేజీ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. హామీలు ఇచ్చినా, నెరవేర్చకుండా విద్యార్థులను, నిరుద్యోగులను కేసీఆర్ మోసగించారని పేర్కొన్నారు.

09/07/2018 - 04:31

హైదరాబాద్, సెప్టెంబర్ 6: రానున్న మొహర్రం పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు స్నేహపూర్వకంగా ఊరేగింపుల్లో పాల్గొనాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వివిధ కమ్యూనిటీ పెద్దలకు సూచించారు. గురువారం సాలార్జంగ్ మ్యూజియంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్ణయించారు.

09/07/2018 - 04:30

హైదరాబాద్, సెప్టెంబర్ 6: విదేశాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను భారతీయులకు పీఎస్‌బీ అకాడమి (సింగపూర్) అందుబాటులోకి తెచ్చిందని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలియా జాంగ్ పేర్కొన్నారు.

09/07/2018 - 04:29

హైదరాబాద్, సెప్టెంబర్ 6: నాలుగు జిల్లాల్లో నీటిపారుదల శాఖలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (్భసేకరణ) గా పనిచేసేందుకు డిప్యూటీ కలెక్టర్లను నియమించారు. జయశంకర్ భూపాలపల్లికి జి. ప్రభాకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కే. లక్ష్మణ్‌స్వామిని, రాజన్న సిర్సిల్లా జిల్లాలో కనకం స్వర్ణలత, నల్లగొండలో ఏ. ప్రమోదినిని నియమించారు.

09/07/2018 - 04:28

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఆదిలాబాద్ పాత జిల్లాల్లో పాడిపరిశ్రమాభివృద్ధికోసం ప్రభుత్వం 18 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదిలాబాద్‌లో రోజూ 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డెయిరీని కొత్తగా ఏర్పాటు చేస్తారు.

09/07/2018 - 02:02

నల్లగొండ, సెప్టెంబర్ 6: సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్ధు చేసి ముందస్తు ఎన్నికలతో సెల్ఫ్‌గోల్ చేసుకున్నారని, ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి పరాజయం తప్పదని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో ఆయన విలేఖరులతో మాట్లాడుతు సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడం ఆయన ఒంటెద్దు పోకడలకు, ఆహంభావ ధోరణికి నిదర్శనమన్నారు.

Pages