S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/15/2019 - 03:21

కరీంనగర్, మార్చి 14: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారిగా కరీంనగర్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్న దృష్ట్యా దేశం చూపంతా కరీంనగర్ వైపే ఉందని, ఇంటింటికి బొట్టుపెట్టి సభకు పిలిచి జయప్రదం చేయడం కోసం నాయకుల నుంచి కార్యకర్తల వరకు సైనికులుగా పనిచేయాలని రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.

03/15/2019 - 03:19

నాగర్‌కర్నూల్, మార్చి 14: వచ్చేనెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని రికార్డు మెజార్టీతో గెలిపించి సీఏం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని ఈ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మంట్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.

03/15/2019 - 03:17

యాదగిరిగుట్ట, మార్చి 14: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గురువారం స్వామివారు జగన్మోహిని అవతార అలంకార సేవలో అశ్వవాహన రూఢుడై భక్తులను పులకింపచేశారు. ఉ. 11 గంటలకు స్వామివారికి జగన్మోహినిగా అలంకార సేవ, రాత్రి 9 గంటలకు ఆశ్వవాహన సేవలను శాస్తయ్రుక్తంగా నిర్వహించారు.

03/15/2019 - 03:15

భూదాన్‌పోచంపల్లి, మార్చి 14: మండలంలోని కనుముక్కుల గ్రామం శ్రీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో క్షీరాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిత్యహోమం, బలిహరణం, తిరువీధి, గరుడవాహనం, నైవేధ్య నివేదన, పూజా కార్యక్రమాలు జరిగాయి.

03/15/2019 - 03:14

సిద్దిపేట, మార్చి 14: సిద్దిపేట జిల్లా కేంద్రంలోనూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్‌లోని చేపల మార్కెట్‌ను భారత ప్రభుత్వ మత్స్యశాఖ, వ్యవసాయశాఖ సంక్షేమ శాఖ కార్యదర్శి రజనీ సేకరి సిబాల్ సందర్శించారు. సిద్దిపేటలో నూతనంగా నిర్మించిన చేపల మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచటంపై చక్కగా ఉందని కితాబునిచ్చారు.

03/15/2019 - 03:13

అచ్చంపేట, మార్చి 14 : శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

03/15/2019 - 03:13

నల్లగొండ, మార్చి 14: సీఎం కేసీఆర్ ప్రభుత్వం పాలన, పథకాల పట్ల తెలంగాణ ప్రజల నుండి లభిస్తున్న ఆదరణతో ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

03/15/2019 - 03:12

హైదరాబాద్, మార్చి 14: మైనారిటీ గురుకుల పాఠశాలలో టిఫిన్ వికటించి 61 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఎక్కడో ఒక చోట తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పాతబస్తీ షాలిబండ చార్మినార్ పరిధిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో గురువారం ఉదయం అల్పాహారం తిన్న 61 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు.

03/15/2019 - 02:11

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణలో తొలి విడతలో ఏప్రిల్ 11న జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 17 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయాలని బీజేపీ గురువారం నాడు నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికీ ఐదు నుండి 10కి పైగా దరఖాస్తులు పరిశీలనకు వచ్చాయి, ఈ దరఖాస్తులు అన్నింటినీ రాష్ట్ర ఎన్నికల కమిటీ గురువారం రోజంతా కూర్చుని స్క్రూటినీ చేసింది , ప్రతి నియోజకవర్గానికీ మూడు మూడు పేర్లు ఖరారు చేశారు.

03/14/2019 - 13:14

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. గట్కా, పాన్ మసాలాలు నిల్వచేసిన గోదాములపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి కోటి రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను, పాన్ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు.

Pages