S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/17/2016 - 13:48

హైదరాబాద్: తాను రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని పదవులను చేపట్టినా అందుకు తల్లిలాంటి భారతీయ జనతా పార్టీయే కారణమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భావోద్వేగంతో అన్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికై తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన ఆయనకు శుక్రవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది.

06/17/2016 - 13:48

హైదరాబాద్: పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళ నుంచి ఏడు లక్షల రూపాయల నగదు, నగలను ఆగంతకులు దోచుకున్న ఘటన నేరేడ్‌మెట్ గోకుల్‌నగర్‌లో శుక్రవారం జరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు లాకర్ నుంచి నగదు, నగలు తీసుకుని వస్తుండగా దుండగులు వెంబడించి ఆమె హ్యాండ్‌బ్యాగును లాక్కుని పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆగంతకుల కోసం ఆరా తీస్తున్నారు.

06/17/2016 - 13:47

హైదరాబాద్: సెల్‌ఫోన్ చోరీ చేసిన విషయం చెప్పేస్తారన్న భయంతో ఓ యువకుడు ఇద్దరు పిల్లలను హతమార్చిన ఘటన నగర శివారులోని హయత్‌నగర్‌లో శుక్రవారం వెలుగు చూసింది. సోహాన్ అనే యువకుడు రామ్‌కుమార్‌కు చెందిన సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. ఈ విషయం రామ్‌కుమార్ పిల్లలు ధన్‌రాజ్, ముఖేష్‌లకు తెలిసిపోయింది. దీంతో ఈ ఇద్దరు పిల్లలను బండరాయితో మోది సోహాన్ హత్యచేశాడు.

06/17/2016 - 13:46

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో లాభనష్టాలు, తాజా స్థితిగతులపై సిఎం కెసిఆర్ ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష జరిపారు. నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో రవాణామంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండి రమణారావు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. నష్టాలను అధిగమించలేకుంటే ఆర్టీసీని మూసి వేయడం ఉత్తమమని సిఎం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

06/17/2016 - 12:11

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకునేందుకు ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు నగర శివారులో తనిఖీలను ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం గగన్‌పహాడ్ వద్ద 23 బస్సులను, హయత్‌నగర్, పెద అంబర్‌పేట వద్ద 20 బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.

06/17/2016 - 12:09

హైదరాబాద్: ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమిపూజ జరిగింది. బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాగా, ఖైరతాబాద్‌లో విగ్రహం ఎత్తును తగ్గించాలని పోలీసులు ఒత్తిడి తేవడాన్ని తాము సహించేది లేదని భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ హెచ్చరించింది.

06/17/2016 - 12:08

హైదరాబాద్: తెలంగాణ టెట్- 2016 పరీక్షా ఫలితాలను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. టెట్ పేపర్ 1లో 54.45 శాతం మంది, పేపర్ 2లో 24.04 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

06/17/2016 - 12:08

హైదరాబాద్: స్కూల్ ఆవరణలో బస్సును రివర్స్ చేస్తుండగా దాని కింద ప్రమాదవశాత్తూ పడి నాలుగేళ్ల విద్యార్థి మరణించాడు. ఈ విషాదం చింతల్ వద్ద వివేకానందనగర్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ బస్‌ను రివర్స్ చేస్తుండగా ఎల్‌కెజి విద్యార్థి జశ్వంత్ రెడ్డి దాని కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

06/17/2016 - 12:07

మెదక్: పది రూపాయలను దొంగిలించాడని ఆగ్రహం చెందిన ఓ కన్నతండ్రి తన పదేళ్ల కుమారుడిని గొంతు నులిమి చంపేసిన దారుణ ఘటన మెదక్ జిల్లా సదాశివపేట మండలం గొల్లగూడెంలో శుక్రవారం వెలుగు చూసింది. ఆవేశానికి లోనై కొడుకును చంపిన సత్తెయ్యను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

06/17/2016 - 08:13

హైదరాబాద్, జూన్ 16:అర్హులైన లబ్దిదారులందరికీ జూలై ఆఖరు నాటికి రేషన్ కార్డులు అందజేయనున్నట్టు ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి నిర్దేశిత కోటా ప్రకారం బియ్యం, నిత్యావసర సరుకులు అందేలా చూడాలని అన్నారు. పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇతర అధికారులతో మంత్రి ఈటల గురువారం పౌర సరఫరాల శాఖపై సమావేశం జరిపారు.

Pages