S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/19/2016 - 08:23

హైదరాబాద్, జూన్ 18: వెండి తెరకు తొలి గేయాన్ని రాసిన చందాల కేశవదాసు విగ్రహాలను ఖమ్మం జిల్లా కేంద్రంలో, ఆయన సమాధి ఉన్న నాయకనగూడెంలో ఏర్పాటు చేయాలని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.కేశవదాసు నల్గొండ జిల్లా కోదాడ సమీపంలోని తమ్మరబండ పాలెంలో ప్రతిష్టాత్మకమైన సీతారామచంద్ర దేవాలయం నిర్మించారు.

06/18/2016 - 18:13

హైదరాబాద్: పారిశ్రామికీకరణ కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కారాదని, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆయన శనివారం ఇక్కడ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. తెలంగాణ పారిశ్రామిక విధానం నేడు దేశదేశాల్లో ప్రశంసలు పొందుతోందని, ఎన్నో దేశాలకు చెందినవారు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.

06/18/2016 - 18:12

హైదరాబాద్: మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ల విషయమై ఇచ్చిన హామీలను అమలు చేసేలా తెలంగాణ సర్కారుపై ఒత్తిడి తెస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ తెలిపారు. ఇక్కడ శనివారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలను ఆయన సమీక్షించారు. అన్ని నియోజకవర్గాలకూ పార్టీ ఇన్‌చార్జిలను నియమించాలని, హైదరాబాద్, వరంగల్‌లో కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

06/18/2016 - 18:11

హైదరాబాద్: తెలంగాణలో రాజ్యాంగం ప్రకారం కాకుండా- వాస్తు నమ్మకాలపై ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ శనివారం ఇక్కడ జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆరోపించారు. వాస్తుదోషాలంటూ ప్రజలను మభ్యపెడుతూ తెరాస పాలన సాగుతోందన్నారు. కేంద్రం ఎంతగా ఆదుకుంటున్నా కొందరు తెరాస మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

06/18/2016 - 16:49

హైదరాబాద్: వ్యక్తిగత స్వార్థంతో కొంతమంది నాయకులు ఫిరాయింపులకు పాల్పడుతున్నా పార్టీ కార్యకర్తలు నిరాశపడరాదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శనివారం తనను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని, అంతవరకూ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు.

06/18/2016 - 16:47

హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ ఎబివిపి కార్యకర్తలు శనివారం నాడు నగరంలోని పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళకు దిగారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా డబ్బులు దోచుకుంటున్నాయని, ఫీజులను నియంత్రించకుంటే తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.

06/18/2016 - 16:42

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఉంటున్న సినీ నటి విజయశాంతి ఇంట్లో బంగారు నగలు కాజేసింది పనిమనిషేనని పోలీసుల విచారణలో తేలింది. విజయశాంతి ఇంట్లో గాజులు, వజ్రాలు పొదిగిన చెవిదుద్దులు, ఉంగరం అయిదురోజుల క్రితం మాయమయ్యాయి. ఈ విషయమై విజయశాంతి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టి ‘ఇంటిదొంగ’ను కనిపెట్టారు.

06/18/2016 - 16:41

మెదక్: బలవంతపు భూసేకరణకు కొందరు నాయకులు సహకరిస్తున్నారంటూ మెదక్ జిల్లా ఏడిగెడ్డ కృష్ణాపూర్‌లో రైతులు శనివారం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానిక ఎంపిటిసి సభ్యుడు ప్రతాపరెడ్డికి చెందిన వ్యవసాయ పనిముట్లను రైతులు ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు గ్రామ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

06/18/2016 - 16:41

హైదరాబాద్: సింగూరు వరకూ కొమురెల్లి మల్లన్నసాగర్ జలాశయం నీటిని తరలించేందుకు నివేదికను సిద్ధం చేయాలని తెలంగాణ సర్కారు శనివారం అధికారులను ఆదేశించింది. మల్లన్నసాగర్ జలాశయాన్ని నిర్మించాలని తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులు, తెరాస కార్యకర్తలు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

06/18/2016 - 16:40

హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్‌పల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీనటుడు మోహన్‌బాబు పెద్ద కోడలు (మంచు విష్ణు భార్య) వెరోనిక స్వల్పంగా గాయపడ్డారు. మామిడిపల్లి నుంచి వస్తున్న కారు, వెరోనిక ప్రయాణిస్తున్న కారు పరస్పరం ఢీకొన్నాయి. సమాచారం తెలిసిన వెంటనే మోహన్‌బాబు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.

Pages