S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/17/2016 - 18:29

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో లైఫ్‌స్టైల్ యజమాని కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన పరమాన్నం ఇచ్చి 1.33 కోట్లతో ఉడాయించిన నకిలీ బాబా శివకుమార స్వామిని, అతడికి సహకరించిన మరో ఇద్దరి బెంగళూరులో అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. అరెస్టు చేసిన ఆ ముగ్గురినీ మీడియా ముందు హాజరుపరిచారు. పరారైన మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.

06/17/2016 - 18:26

హైదరాబాద్: నష్టాల నుంచి బయటపడని పక్షంలో ఆర్టీసీని మూసివేస్తామని సిఎం కెసిఆర్ అనడం సరికాదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఆర్టీసీని గాడిలో పెట్టడానికి బదులు సిఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికులకు తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.

06/17/2016 - 17:36

కరీంనగర్ : ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నైజీరియన్ దేశస్తుడితోపాటు ఏడుగురు సభ్యుల ముఠాను కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఘరానా మోసాలకు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి రూ.6.70 లక్షల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

06/17/2016 - 16:39

హైదరాబాద్: సరకు రవాణా, ప్రచారం, టూరిజం వంటి రంగాలపై దృష్టి సారించి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచాలని సిఎం కెసిఆర్ సూచించారు. పుణ్యక్షేత్రాలకు, పర్యాటక స్థలాలకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులు నడపాలన్నారు. ఆర్టీసీ బస్సులు, కాంప్లెక్సుల ద్వారా ప్రకటనలు ఇచ్చే సంస్థలను ఆకట్టుకోవాలని, సరకు రవాణాను పెంచాలని అన్నారు.

06/17/2016 - 16:38

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో కంటోనె్మంట్ ఏరియాలో నిర్మించిన ఆస్పత్రిని కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, బండారు దత్తాత్రేయ శుక్రవారం ప్రారంభించారు. తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్, ఎంపీలు విశే్వశ్వర రెడ్డి, మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

06/17/2016 - 16:37

హైదరాబాద్: ప్రాంతీయ రవాణాశాఖ (ఆర్‌టిఎ) అధికారులు శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వంద వాహనాలను సీజ్ చేశారు. 16 ప్రైవేటు బస్సులు, 10 స్కూల్ బస్సులతో పాటు బైక్‌లు, కార్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

06/17/2016 - 16:37

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోనె్మంట్ ప్రాంతంలో తరచూ రోడ్లను మూసివేస్తున్నందున స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయమై శాశ్వత పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు విజ్ఞప్తి చేశారు. కంటోనె్మంట్‌లో ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పారికర్ పాల్గొన్న సందర్భంగా మల్లారెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు.

06/17/2016 - 16:36

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్‌ను సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఫిల్మ్‌నగర్ ఆలయంలో ఈ నెల 18 నుంచి అయిదురోజుల పాటు జరిగే మహాకుంభాభిషేకంలో పాల్గొనవలసిందిగా సిఎంను ఆయన ఆహ్వానించారు.

06/17/2016 - 16:35

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ వ్యాపారవేత్త కుటుంబాన్ని మోసం చేసి 1.33 కోట్ల రూపాయలతో ఉడాయించిన నకిలీ బాబాను అరెస్టు చేసి 1.20 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బాబా శివానందను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. తాజాగా బాబా 1.33 కోట్లు దోచుకోగా 1.20 కోట్లు మాత్రమే అతని నుంచి రికవరీ చేశారు.

06/17/2016 - 13:49

హైదరాబాద్: జీడిమెట్ల ఆంధ్రాబ్యాంకు శాఖలో గురువారం అర్ధరాత్రి చోరీకి ఇద్దరు దుండగులు విఫల యత్నం చేశారు. షట్టర్‌ను తొలగించి బ్యాంకు లోపలికి వచ్చిన వారు స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు యత్నించారు. బ్యాంకు నుంచి వారు వెనుదిరుగుతున్న సమయంలో ఓ ఆగంతకుడు గస్తీ పోలీసులకు చిక్కాడు. దుండగులిద్దరూ నిజామాబాద్ జిల్లాకు చెందినవారని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

Pages