S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/18/2016 - 12:31

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న సినీ నటి, మాజీ ఎంపి విజయశాంతి ఇంట్లో నగలను ఎవరో కాజేశారు. బంగారు ఉంగరం, గొలుసు చోరీకి గురైనట్లు ఆమె గుర్తించారు. బాగా తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

06/18/2016 - 12:30

నిజామాబాద్: టీచర్ల అర్హత పరీక్ష (టెట్)లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. బిక్కనూరు మండలం తలమడ్ల వద్ద రైల్వే ట్రాక్‌పై శనివారం ఉదయం ఆ యువతి మృతదేహాన్ని స్థానికులు కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెట్‌లో తప్పడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులు తెలిపారు.

06/18/2016 - 12:29

మహబూబ్‌నగర్: షాద్‌నగర్ వద్ద శనివారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్‌బస్సు కింద ప్రమాదవశాత్తూ పడి రెండేళ్ల నందిని అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతితో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.

06/18/2016 - 12:29

కరీంనగర్: ప్రైవేటు కానె్వంట్లలో తమ పిల్లలను చేర్పించేంది లేదని ఆ సంస్థలకు చెందిన స్కూల్ బస్సులను గ్రామస్థులు అడ్డుకున్న ఘటన ఇది. కరీంనగర్ జిల్లా వెల్దుర్తిలో శనివారం ఉదయం ప్రైవేటు స్కూల్ బస్సులను గ్రామస్థులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. ఈ విషయమై ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేసి ప్రభుత్వ బడిలో 80 మంది పిల్లలను చేర్పించారు.

06/18/2016 - 07:29

హైదరాబాద్/అల్వాల్, జూన్ 17 : మిలటరీ అధికారులు ప్రజలకు శత్రువులు కాదని, వారు దేశ రక్షణ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని, కంటోనె్మంట్‌లో రోడ్ల సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరిష్కరించుకోవాలని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. శుక్రవారం కంటోనె్మంట్‌లోని బొల్లారంలో సుమారు ఐదుకోట్ల రూపాయలతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు.

06/18/2016 - 05:02

హైదరాబాద్, జూన్ 17: ‘అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రానే్న సాధించుకున్నాం. అలాంటిది ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న ఆర్టీసీ వ్యవస్థను గట్టెక్కించడం మనకు అసాధ్యమేమీ కాదు’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు భరోసానిచ్చారు. ‘ఆర్టీసీని కాపాడేది కార్మికులే. వారి సంక్షేమమే మాకు ముఖ్యం, కార్మికులు- యాజమాన్యం వేర్వేరు కాదు. అందరూ కలిసిపోవాలి, ఓ కుటుంబంగా ఆర్టీసీని మెరుగుపర్చాలి.

06/18/2016 - 05:06

హైదరాబాద్, జాన్ 17: ఆర్టీసీని గట్టెక్కించి రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కార్యాచరణను సిఎం కెసిఆర్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నడిపే పల్లె వెలుగు బస్సులు నిండటం లేదు కనుక మినీ బస్సులు నడిపి ఓఆర్ పెంచాలన్నారు. బస్టాండ్లలోని ఖాళీ స్థలాల్లో మినీ థియేటర్ల ఏర్పాట్లకు ముందుకొస్తున్న వారిని ప్రోత్సహించి, అవకాశం ఉన్నచోట ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.

06/18/2016 - 04:55

హైదరాబాద్, జూన్ 17: దొంగబాబా గుట్టు వీడుతోంది. గత నాలుగేళ్లుగా అతడు చేసిన మోసాలను, దగాకోరు పనుల్ని పోలీసులు బయట పెట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ‘లైఫ్‌స్టైల్’ భవన యజమాని మధుసూదన్‌రెడ్డిని నమ్మించి, మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చి రూ.1.33 కోట్లతో ఉడాయించిన వంచకబాబా బుద్దప్పగారిశివ(34)తో పాటు మరో ఇద్దరిని సైదరాబాద్ టాస్క్ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి ఎన్నో విషయాలను కక్కించారు.

06/18/2016 - 04:52

హైదరాబాద్, జూన్ 17: తెలంగాణలో ఉపాధ్యాయుల నియామకానికి అర్హత పరీక్ష టెట్-2016 ఫలితాలను పాఠశాల విద్య సంచాలకుడు జి కిషన్ శుక్రవారం ఉదయం విడుదల చేశారు. పేపర్-1లో 48278 మంది, పేపర్-2లో 63,079 మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్-1లో 22,553 మంది బాలురు, 25,725 మంది బాలికలు అర్హత సాధించారు. పేపర్-2లో 35,215 మంది బాలురు, 27,864 మంది బాలికలు అర్హత సాధించారు.

06/17/2016 - 18:30

హైదరాబాద్: రాజకీయాల్లో రాణించాలంటే ఎవరికైనా ఓర్పు, సహనం అవసరమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇక్కడి మాదాపూర్‌లో శుక్రవారం సాయంత్రం తన గౌరవర్థాం జరిగిన ఆత్మీయసభలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాల్లో పరస్పరం మర్యాదలు పాటించాలన్నారు. పెద్దల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నందునే తాను జీవితంలా ఇంతగా ఎదిగానన్నారు. రాజ్యసభకు నాలుగోసారి ఎన్నికైనందుకు ఆయనను ఘనంగా సత్కరించారు.

Pages