S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/08/2016 - 02:49

ఖమ్మం, మే 7: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలతోపాటు పలు అంశాలను ప్రస్తావించారు. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకున్నది.

05/08/2016 - 02:47

హైదరాబాద్, మే 7: కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెరుగుతన్న వైషమ్యాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.

05/07/2016 - 18:04

హైదరాబాద్: ఈ నెల 15న ఎంసెట్ నిర్వహించి అదే రోజున ‘కీ’ విడుదల చేస్తామని, 27న ఫలితాలను ప్రకటిస్తామని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు శనివారం తెలిపారు. ఈనెల 9 నుంచి ఎంసెట్ హాల్‌టిక్కెట్లు పొందవచ్చని, ఎపిలోనూ నాలుగు నగరాల్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. జూన్‌ 20 లోపు మొదటి విడత, రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తామని వివరించారు.

05/07/2016 - 18:00

హైదరాబాద్: భర్త గొంతు నులిమి హత్య చేసిన భార్య ఉదంతం నగరంలోని బోరబండలో శనివారం బయటపడింది. అశోక్ అనే వ్యక్తిని అతని భార్య అంజమ్మ గొంతు నులిమి చంపేసిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. కుటుంబ కలహాలకు విసిగిపోయి ఆమె ఈ అకృత్యానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు.

05/07/2016 - 17:57

హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల, జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై ఆయన శనివారం ఇక్కడ అధికారులతో సమీక్ష జరిపారు. నగరంలోని గన్‌పార్క్‌లో జరిగే కార్యక్రమంలో సిఎం కెసిఆర్ పాల్గొంటారు.

05/07/2016 - 16:07

హైదరాబాద్‌: ఈ నెల 15న తెలంగాణలో ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు టిఎస్ ఎంసెట్ కన్వీనర్ ఎన్.వి.రమణా రావు తెలిపారు. ఇంజినీరింగ్‌కు 276, అగ్రికల్చర్, మెడికల్‌కు 190 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. 2, 46, 522 మంది ఇంజినీరింగ్ పరీక్షను, 1,44,510 మంది అగ్రికల్చర్, 1,02,012 మంది విద్యార్థులు మెడికల్ పరీక్షను రాయనున్నారు.

05/07/2016 - 15:49

హైదరాబాద్‌: రూ.2.21 కోట్ల వ్యయంతో ఆదిలాబాద్‌ జిల్లాలో కోతుల రక్షణ, పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్‌ సమీపంలోని చించోలీ వద్ద దీనిని ఏర్పాటు చేస్తారు.

05/07/2016 - 12:11

హైదరాబాద్: అనూహ్యంగా పెంచేస్తున్న స్కూల్ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బంజారాహిల్స్‌లోని కల్ప పాఠశాల వద్ద శనివారం నాడు తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల ఆగడాలను విద్యాశాఖ అధికారులు నియంత్రించాలని వారు నినాదాలు చేశారు. మూడేళ్ల కాలంలో ఫీజులను వందశాతానికి మించి పెంచడం దారుణమంటున్నారు.

05/07/2016 - 07:23

హైదరాబాద్, మే 6: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ పరాజయం పొందడం కాంగ్రెస్, టిడిపికి అలవాటుగా మారిందని తెలంగాణ మంత్రి కె తారకరామారావు విమర్శించారు. పాలేరు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు వస్తున్న ప్రజాదరణకు భయపడి కాంగ్రెస్ పార్టీ సానుభూతి నాటకాన్ని ఆడుతోందని ఆయన దుయ్యబట్టారు.

05/07/2016 - 05:57

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభాపక్షం తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనమైంది. వైకాపా ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్, పాయం వెంకటేశ్వర్లు ఇటీవల తెరాసలో చేరిన సంగతి తెలిసిందే. తమను తెరాస శాసనాసభపక్షం సభ్యులుగా గుర్తించాలంటూ ముగ్గురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి విజ్ఞప్తి చేశారు.

Pages