S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/01/2015 - 11:43

కరీంనగర్: మద్యం మత్తులో సోదరిని హత్య చేయడమే కాక, అడ్డుకున్న మరో యువకుడిని ఓ తాగుబోతు తీవ్రంగా గాయపరిచిన సంఘటన వేములవాడ మండలం అయ్యోరుపల్లిలో జరిగింది. మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల వల్లే ఆ యువకుడు తన సోదరి రాంబాయిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

12/01/2015 - 11:43

హైదరాబాద్: మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని ప్రసవించిన ఘటనలో మండల విద్యా శాఖాధికారి బసవలింగంను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. బాలిక నిత్యం పాఠశాలకు వస్తున్నా ఆమె గర్భవతి అని గుర్తించలేక పోవడం, బడిలోనే ప్రసవం జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు హెడ్మాస్టర్ తెలియజేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

12/01/2015 - 11:42

సికిందరాబాద్: వంట గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీ దూసుకొచ్చి ఓ బైక్‌ను ఢీకొనడంతో సికిందరాబాద్‌లో మంగళవారం ఉదయం భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో బైక్‌ను నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆనంద్ థియేటర్ వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు స్తంభించిపోయాయి.

11/30/2015 - 11:51

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల నుంచి తమ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోటీ చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో పోటీ చేసే సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు మద్దతు ఇస్తామని వారు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు మిగతా విపక్షాలను కలుపుకొని పోతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

11/30/2015 - 11:45

మెదక్: మద్యం తాగడానికి డబ్బులివ్వలేదని ఆగ్రహించిన ఓ కుమారుడు కన్నతల్లినే గొడ్డలితో నరికి చంపేసిన ఉదంతం సోమవారం ఉదయం అల్లాదుర్గం మండలం ఐ.బి.తండాలో జరిగింది. తలకి తీవ్రంగా గాయమై రక్తస్రావం కావడంతో తల్లి అక్కడికక్కడే మరణించింది.

11/30/2015 - 05:48

హైదరాబాద్, నవంబర్ 29: పోటీ పరీక్షల ఉచిత కోచింగ్ కోసం ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహించిన లెవెల్-1 పరీక్షకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి టి.విష్ణువర్థన్ తెలిపారు.

11/30/2015 - 05:46

హైదరాబాద్, నవంబర్ 29:ఉపయోగంలో లేని బోరు బావులను మూసివేయాలని, ఉపయోగపడే బోరుబావుల చుట్టూ ఫెన్సింగ్ వేయాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బోరుబావులన్నింటిపై సర్వే నిర్వహించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఉపయోగంలో లేని బోరుబావుల పూడ్చివేత, ఉపయోగించే వాటి చుట్టూ పెన్సింగ్ వేయాలని చెప్పారు.

11/30/2015 - 05:45

హైదరాబాద్, నవంబర్ 29: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఘోర పరాజయంతో షాక్‌కు గురైన కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. లోపం ఎక్కడ ఉందో అనే అంశంపై విశే్లషించడానికి ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్ఠానం రాష్ట్రానికి చెందిన ముగ్గురు నాయకులను ఆదేశించింది.

11/30/2015 - 05:44

హైదరాబాద్, నవంబర్ 29 : తెలంగాణలో 15/2015 నోటిఫికేషన్ ద్వారా ఆర్థిక - అకౌంట్స్ విభాగాల్లో అసిస్టెంట్ల నియామకానికి ఈ నెల 29వ తేదీన ఆబ్జెక్టివ్ పద్ధతిలో కంప్యూటర్ ఆన్ లైన్ ఒఎంఆర్ ఆధారితంగా ఎంపిక పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు 84 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 55,239 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశామని చెప్పారు.

11/30/2015 - 05:43

సంగారెడ్డి, నవంబర్ 29: ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించడానికి సాహసోపేతమైన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29ని టిఆర్‌ఎస్ పార్టీ దీక్షా దీవస్‌గా నిర్వహిస్తోందని, ఈ శుభ సందర్భంలోనే తాగునీటి కోసం అలమటిస్తున్న మెదక్ జిల్లా ప్రజలకు ప్రభుత్వ కానుకగా సింగూర్ జలాలను జిల్లాకే సరఫరా చేయాలని నిర్ణయించిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వెల్లడించారు.

Pages