S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/03/2015 - 06:37

హైదరాబాద్, డిసెంబర్ 2: బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు తెలిపారు. రాజా సింగ్ వ్యాఖ్యలను పరిశీలించేందుకు పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ భూపతి రెడ్డికి పంపించినట్లు ఆయన చెప్పారు. పార్టీ ‘కోర్’ కమిటీ సమావేశమై రాజా సింగ్ వ్యాఖ్యలు, స్థానిక సంస్ధల ఎన్నికల వ్యవహారంపై చర్చించింది.

12/03/2015 - 06:22

నల్లగొండ, డిసెంబర్ 2: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార, విపక్ష పార్టీల గెలుపు ఎత్తుగడలు జోరందుకున్నాయి. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి అధికారికంగా అభ్యర్థులు ఎవరన్నది ఖరారు కాకపోయినప్పటికీ గెలుపు లక్ష్యంగా ఎంపిటీసిలు, జడ్పీటీసిలు, కౌన్సిలర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను మాత్రం అప్పుడే మొదలు పెట్టారు.

12/03/2015 - 06:19

నల్లగొండ టౌన్, డిసెంబర్ 2 : ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరలో అఖిలపక్షంతో భేటి అయి కేంద్రంతో చర్చిస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

12/03/2015 - 06:18

నిజామాబాద్, డిసెంబర్ 2: మహబూబ్‌నగర్ బాటలోనే నిజామాబాద్‌ను సైతం నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దారు. గత కొన్ని నెలల నుండి పోలీస్, రెవెన్యూ శాఖల తోడ్పాటుతో ఎక్సైజ్ అధికారులు విరివిగా దాడులు నిర్వహిస్తూ నాటుసారా, గుడుంబా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపారు. పలువురిపై పి.డి యాక్టులు కూడా నమోదు చేస్తూ, పెద్ద ఎత్తున బైండోవర్లు చేశారు.

12/03/2015 - 03:44

హైదరాబాద్, డిసెంబర్ 2: కృష్ణా జలాలల్లో తెలంగాణ వాటా తేలేదాక శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై నియంత్రణను కృష్ణా నది యాజమాన్య మండలి (కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు-కెఆర్‌ఎంబి) పరిధిలోకి తీసుకోవద్దని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి, కెఆర్‌ఎంబికి వేర్వేరుగా లేఖలు రాసింది.

12/02/2015 - 11:38

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి 12 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకొనేందుకు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 27న పోలింగ్, 30న కౌంటింగ్ నిర్వహిస్తారు. నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది.

12/02/2015 - 11:37

మహబూబ్‌నగర్: ఇరవై మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడగా ఓ వ్యక్తి మరణించాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ - దుప్పల్లి మధ్య బుధవారం తెల్లవారుజామున ఆటో బోల్తాపడింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

12/02/2015 - 11:36

మెదక్: సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సును బుధవారం ఉదయం లారీ ఢీకొంది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.

12/02/2015 - 08:00

హైదరాబాద్, డిసెంబర్ 1: రోజురోజుకి సరికొత్త మార్పులతో అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం సిద్ధమైంది.

12/02/2015 - 07:59

సంగారెడ్డి, డిసెంబర్ 1: కంప్యూటర్లలో ఉపయోగిస్తున్న వివిధ రకాల సాఫ్ట్‌వేర్ల పైరసీని నిలువరించడానికి ఆయా కంపెనీల ప్రతినిధులు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తుండటంతో కంప్యూటర్లలో పైరసీ సాఫ్ట్‌వేర్లు ఉపయోగిస్తున్న వా రు హడలెత్తిపోతున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, సిద్దిపేట, మెదక్ తదితర ప్రాంతాల్లో మూడు రోజులుగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

Pages