S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/01/2020 - 04:00

హైదరాబాద్, ఫిబ్రవరి 29: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 6వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 6వ తేదీన గవర్నర్ ప్రసంగం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం ఈ అంశంపై రెండు నుంచి మూడు రోజుల పాటు ఉభయ సభల్లో చర్చ ఉంటుంది.

02/28/2020 - 04:41

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఢిల్లీలో అల్లర్ల వెనుక మత ఛాందసవాదుల ప్రమేయం ఉందని సీపీఐ నేతలు గురువారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో అల్లర్లకు, అల్లకల్లోలానికి కారణమైన హోం మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

02/28/2020 - 04:39

హైదరాబాద్, ఫిబ్రవరి 27: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

02/28/2020 - 04:31

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తల మాదిరి వ్యవహరిస్తున్నారని బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు ఆకుల విజయ ఆరోపించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఖాకీ చొక్కా వదిలి పింక్ షర్టు వేసుకున్నట్టు వ్యవహరిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

02/28/2020 - 04:27

హైదరాబాద్, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో పోలీసు అధికారులు, సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తూ మానవీయ కోణంలో విధులు నిర్వహించాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పఠాన్‌చెరులో బుధవారం కానిస్టేబుల్ చేసిన అనుచిత ప్రవర్తన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసు శాఖకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో గురువారం సాయంత్రం డీజీపీ విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

02/28/2020 - 04:25

హైదరాబాద్, ఫిబ్రవరి 27: పెన్షనర్ల సమస్యలను పట్టించుకుని వాటిని పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా హక్కుల సాధనకై ఐక్యపోరాటానికి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వారు చెప్పారు.

02/28/2020 - 04:24

హైదరాబాద్, ఫిబ్రవరి 27: కంపెనే్సటరీ అఫార్స్టేషన్ (కంపా) ఫండ్ నుండి 2020-21 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 603 కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ రాష్ట్ర పీసీసీఎఫ్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్. శోభ నేతృత్వంలో తెలంగాణ కంపా ఎగ్జిక్యూటివ్ కమిటీ గురువారం ఇక్కడ సమావేశమైంది.

02/28/2020 - 03:58

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తనను రకరకాల కేసులతో వేధించినా, భయపెట్టినా, వెనకాడే ప్రసక్తిలేదని, ప్రజా సమస్యల సాధనకు దేనికైనా సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ నగరంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తే తాను భయపడుతానని కేసీఆర్ అనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి ఉండదన్నారు.

02/28/2020 - 03:57

హైదరాబాద్, ఫిబ్రవరి 27: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతిలో బీసీ హాస్టళ్లు, గురుకులాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు సందర్శించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించారు.

02/28/2020 - 03:56

హైదరాబాద్, ఫిబ్రవరి 27: పటన్‌చేరు సమీపంలోని నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఘటనలో ఆమె తండ్రితో అమానుషంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై సస్పెండ్ వేటు పడింది. పటాన్‌చెరువులో ఆత్మహత్య చేసుకొని మరణించిన ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణి తండ్రి పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీస్ కానిస్టేబుల్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Pages