S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/05/2018 - 02:55

సూర్యాపేట, అక్టోబర్ 4: సూర్యాపేట జిల్లా పరిధిలోని శ్రీరాంసాగర్ రెండవదశ కాల్వలకు మరో రోజులో గోదావరి జలాలు విడుదల అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ ప్రాంత రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్నారు.

10/05/2018 - 02:50

చింతపల్లి, అక్టోబర్ 4: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ముందస్తు ఎన్నికలు తెచ్చిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల్లో ఓటమి తథ్యమని పీసీసీ మేనిఫెస్టో కమిటీ కోకన్వీనర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

10/05/2018 - 03:43

చిన్నశంకరంపేట: రాజకీయాలు మానాలి, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు రావాలని టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కొల్కురి జానమ్మ అంత్యక్రియలకు హాజరైన అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఎంత ముఖ్యమో తెలంగాణ వస్తే నిధులు, నీళ్లు, నియామకాలు వస్తాయని ఆశించిన ప్రజలు తెలంగాణలో ఇవి అమలు కాలేవన్నారు.

10/05/2018 - 02:43

జగిత్యాల, అక్టోబర్ 4: నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబంలోని ఆ నలుగురే గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అగౌరవ పర్చేందుకే ప్రాధాన్యం ఇస్తోందని మాజీ సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు.

10/05/2018 - 02:42

నల్లగొండ, అక్టోబర్ 4: ఆపద్దర్మ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నల్లగొండ ప్రజాశీర్వాద సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి లక్షల్లో జనం హాజరవ్వగా సభ సక్సెస్ టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది.

10/05/2018 - 02:26

మహబూబ్‌నగర్, అక్టోబర్ 4: దొరా.. నీవు మాట తప్పావు, తెలంగాణ ప్రజలు ఇక నీ పరిపాలనను వద్దనుకుంటున్నారు. దొర పాలన.. దోపిడీ పాలన నుంచి విముక్తి చెందాలకుంటున్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎన్నికల స్టార్ క్యాంపెయనర్ మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు.

10/05/2018 - 02:23

చార్మినార్, అక్టోబర్ 4: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి, కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులు, బీసీలను విస్మరించిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. గురువారం రవీంద్రభారతిలో ‘బీసీ విద్యార్థుల యువగర్జన, అఖిలపక్ష సదస్సు’తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగింది.

10/05/2018 - 02:19

హైదరాబాద్, అక్టోబర్ 4: కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్ నేతలు కార్యకర్తలు 24 గంటలు గడవకముందే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. టీపీసీసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో బుధవారం గజ్వేల్, దుబ్బాకకు చెందిన టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇదే నేతలు గురువారం హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో తిరిగి చేరినట్టు ప్రకటించారు.

10/05/2018 - 02:18

హైదరాబాద్, అక్టోబర్ 4: శ్రీరాంసాగర్ స్టేజ్-1, స్టేజ్-2 కింద డోర్నకల్ నియోజకవర్గానికి నీరు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీను హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. డోర్నకల్ తాజా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ గురువారం హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావును కలిసి ఎస్పారెస్సీ నుంచి నీరు విడుదల చేయాలని కోరారు.

10/05/2018 - 02:16

హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు 10 కోట్ల లావాదేవీలు జరిగాయని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. ఇంత పెద్దమొత్తంలో లావాదేవీలు జరపడం ఒక రికార్డుగా ఈ శాఖ వెల్లడించింది. ఈ-పాస్ విధానం వల్ల రేషన్ బియ్యం తీసుకునే ప్రజలకు, ప్రభుత్వానికి ఎంతో ఉపయోగం కలిగిందన్నారు.

Pages