S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/07/2018 - 01:08

హైదరాబాద్, అక్టోబర్ 6: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఆలయ ఉద్యోగులకు 2018-19 సంవత్సరానికి సంబంధించి రెండు, మూడో త్రైమాసికాల కోసం వేతనాలు చెల్లించేందుకు 35.95 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ (ఎండోమెంట్స్) ముఖ్యకార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో శనివారం ఉత్తర్వులు (జీఓ ఆర్‌టి 449) జారీ అయ్యాయి.

10/07/2018 - 01:07

హైదరాబాద్, అక్టోబర్ 6: గురుకులాల టీజీటీ, పీజీటీ పోస్టుల ఎంపికకు నిర్వహించిన పరీక్ష అభ్యర్ధులకు చుక్కలు చూపించింది. కొంత మంది అభ్యర్ధులకు పరీక్ష కేంద్రాలు తప్పుగా ఇవ్వడంతో గందరగోళానికి గురయ్యారు. శనివారం నాడు నిర్వహించిన పేపర్-1కు 83,846 మంది రిజిస్టర్ చేసుకోగా, 56116 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు.

10/07/2018 - 01:07

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని టీటీడీపీ ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి వ్యాఖ్యానించారు. గత మూడు బహిరంగ సభల్లో కేసీర్ మాట్లాడిన తీరు, వాడిన పదజాలం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ నైజం అందరికీ తెలిసిందేనని, అందితే జుట్టు, లేకపోతే కాళ్లు అనే పద్ధతి ఎప్పటి నుండో చూస్తున్నదేనని చెప్పారు.

10/07/2018 - 01:06

హైదరాబాద్, అక్టోబర్ 6: ముందస్తు ఎన్నికల తేదీ (షెడ్యూలు) అన్ని పార్టీల నేతల గుండెల్లో గుబులు పుట్టించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఇసీ) ప్రధాన కమిషనర్ రావత్ తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహిస్తామని శనివారం ప్రకటించారు. తేదీ ప్రకటించడంతోనే అన్నీ పార్టీల నేతలు హుషారుగా తెలుగు క్యాలెండర్‌లు, పంచాంగాలు చూసి నివ్వెరపోయారు. ఎందుకంటే పోలింగ్ రోజున మధ్యాహ్నం వరకూ అమావాస్య ఉంది.

10/06/2018 - 12:34

హైదరాబాద్: నగరంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. గడపగడపకు కాంగ్రెస్ అనే నినాదంతో హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ నేత అంజన్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన నేతృత్వంలో ఖైరతాబాద్‌లో పాదయాత్ర జరిగింది. బడాగణేశ్ సమీపంలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

10/06/2018 - 12:33

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ సర్కిల్ వద్ద రూ.2.50 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గుట్కా ప్యాకెట్లను గుల్బార్గా నుంచి తీసుకవచ్చి విక్రయిస్తున్నారు.

10/06/2018 - 06:26

చండూర్, అక్టోబర్ 5: వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అత్యధిక స్థానాలు గెలిచి తెలంగాణ అసెంబ్లీపై మహాకూటమి జెండా ఎగురేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చండూర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన దివంగత ఎన్‌టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

10/06/2018 - 06:25

సంగారెడ్డి, అక్టోబర్ 5: దిగువన ఉన్న ప్రాజెక్టులు, ఆయకట్టు పరిరక్షణ కోసం సింగూర్ నుంచి వదిలిన నీరు అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గుదిబండలా మారుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్తు సర్వసభ్య సాదారణ సమావేశాన్ని సైతం సింగూర్ నీటి విడుదల కుదిపేసిందంటే నీటి కటకట తీవ్రత ఏమిటో స్పష్టమవుతోంది.

10/06/2018 - 06:23

నల్లగొండ, అక్టోబర్ 5: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ పెట్టి, మూసీ కాల్వలను విస్తరిస్తూ, రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తూ జిల్లాను అన్ని రకాలుగా నాశనం చేస్తున్నది టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆరేనని పీసీసీ మేనిఫెస్టో కమిటీ కోకన్వీనర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

10/06/2018 - 06:05

గజ్వేల్, అక్టోబర్ 5: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే ఇక్కడి నుండి బరిలో నిలువనున్నట్లు ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్పష్టం చేశారు. శుక్రవారం గజ్వేల్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బెజుగామలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గద్దర్ ఆవిష్కరించారు.

Pages