S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/22/2018 - 06:07

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణలో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ కొనుగోలుకు పిలిచిన టెండర్లు గురువారంతో ముగిశాయి. మరో రెండు రోజుల్లో టెండర్ బాక్సులను తెరవనున్నారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారం అంతా తెలంగాణ విద్యుత్ కోఆర్డినేషన్ కమిటి పర్యవేక్షణలో ఒప్పందాలు జరగనున్నాయి. విద్యుత్ కొనుగోలు ప్రైవేట్ రంగం నుంచి కాని లేక పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

06/22/2018 - 06:05

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణ రైతులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం గురువారం 500 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రైతుబంధు బీమా కింద ఒక్కో రైతుకు ఐదులక్షల రూపాయల బీమా కల్పిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఒక్కో రైతు పేరుతో 2271.50 రూపాయలు ప్రీమియంగా ఎల్‌ఐసీకి చెల్లించాల్సి ఉంటుంది.

06/22/2018 - 06:04

హైదరాబాద్, జూన్ 21: సిద్ధిపేట జిల్లా కొండపాక పత్రికా విలేఖరి హన్మంతరావు కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. గురువారం ఆయన అధికారికంగా ప్రకటన జారీచేస్తూ, జర్నలిస్టులు ధైర్యంగా ఉండాలన్నారు. సమాజంలో అన్నిరకాల సమస్యలను అవగాహన చేసుకునే శక్తి జర్నలిస్టులకు ఉంటుందని, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు.

06/21/2018 - 05:55

హైనరాబాద్, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం సింగరేణి యాజమాన్యం లక్షా 21వేల మందితో మెగా యోగాడే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈమేరకు యాజమాన్యం సింగరేణిలో పని చేస్తున్న ఉద్యోగ, కార్మిక కుటుంబాలు పాల్గొనేలా అందరికీ వర్తమానం పంపింది. సింగరేణిలో విస్తరించిన 11 పట్టణాల్లో గనులు,స్టేడియంలు, పాఠశాలలు, కళాశాలల్లో పెద్ద ఎత్తున నిర్వహణకు సమాయత్తం అవుతోంది.

06/21/2018 - 05:55

హైదరాబాద్, జూన్ 20: ఏబీవీపీ రాష్టవ్య్రాప్త పాఠశాలల బంద్ విజయవంతం అయ్యిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా 35వేల స్కూళ్లకు పైగా బంద్‌లో పాల్గొన్నాయని దీనికి సహకరించిన తల్లిదండ్రులకు, పాఠశాలల యాజమాన్యాలకు, విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో నిరసన తెలిపారు.

06/21/2018 - 05:54

హైదరాబాద్, జూన్ 20: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నాడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని, ప్రజలు విసిగెత్తిపోయారని అయినా కేసీఆర్ ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

06/21/2018 - 05:52

హైదరాబాద్, జూన్ 20: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బాసర ట్రిపుల్ ఐటి ఆవిర్భవించింది. బోధన- అభ్యసన రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటు అధ్యాపకులకు శిక్షణ, విద్యార్థులకు సంపూర్ణ సౌకర్యాలను కల్పించడంలో బాసర ట్రిపుల్ ఐటి అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుందని వైస్ ఛాన్సలర్ ఇన్‌చార్జి డాక్టర్ ఎ అశోక్ పేర్కొన్నారు.

06/21/2018 - 05:51

హైదరాబాద్, జూన్ 20: రానున్న కాలంలో మైనింగ్‌లో (గనుల్లో) ఆధునిక యంత్రాల వినియోగంపై ఖజకిస్తాన్ (రష్యా)లో ఏర్పాటు చేసిన 25వ ప్రపంచ మైనింగ్ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి సింగరేణి యాజమాన్యానికి ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ఈనెల 22వ తేదీ వరకు ఖజకిస్తాన్‌లో జరుగు ఫ్లీనరీకి సింగరేణి నుంచి సిఎండి శ్రీ్ధర్‌తో పాటు డైరెక్టర్ చంద్రశేఖర్, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కెవి రమణమూర్తి హాజరవుతున్నారు.

06/21/2018 - 05:50

పోలవరం, జూన్ 20: తాను గతంలో ప్రేమించిన యువతి మరో యువకుడిని పెళ్లాడబోతోందనే ఆగ్రహంతో ఆమెను కత్తితో నరికి హత్యచేసి, అనంతరం తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న కిరాతకుడి ఉదంతమిది. సరిగ్గా పెళ్లి జరిగే రోజు తెల్లవారుజామున (బుధవారం) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి...

06/21/2018 - 05:49

లండన్, జూన్ 20: ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో నివసించేవారిలో ఎముకల పెరుగుదల నెమ్మదిస్తుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే జనాభాపై అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయం వెల్లడైందని వారు తెలిపారు. హిమాలయా పర్వత ప్రాంతాలు నివసించడానికి పెద్దగా అనువుగా ఉండవు. పంటల దిగుబడి కూడా చాలా తక్కువ. అందువల్ల ఆహార కొరత సర్వసాధారణం.

Pages