S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/25/2018 - 05:41

సంగారెడ్డి, జూన్ 24: సంస్థానాలు, జాగీరుదారుల వ్యవస్థ కాలగర్భంలో కలిసిపోయి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఆ గ్రామ ప్రజలు మాత్రం ఇంకా దొరల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోం ది. పాలకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారి సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు.

06/25/2018 - 05:39

నల్లగొండ, జూన్ 24: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయారని, బంగారు తెలంగాణ కేవలం ఆయనకు, కొడుకు, అల్లుడు, కూతురుకే పరిమితమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ దుయ్యబట్టారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకున్న బీజేపీ జన చైతన్య యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు.

06/25/2018 - 05:36

హైదరాబాద్, జూన్ 24: నానాటికి క్షీణిస్తున్న అడవులకు పూర్వవైభవం కల్పించేందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతోంది. అటవీ భూములుగా పేర్కొంటున్న చాలా భూముల్లో అటవీ సంపద కనుమరుగైన కళావిహీనంగా దర్శనమిస్తుండటం సర్వసాధారణంగా మారింది. ఆయా భూములను గుర్తిం చి వాటిని దట్టమైన అడవులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపధ్యంలో ఈ అంశంపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

06/25/2018 - 05:34

ఖమ్మం, జూన్ 24: ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకే వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వారి వేతనాన్ని భారీగా పెంచారు. మూడు నెలలకు ఒకసారి వేతనం చెల్లిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఆరునెలలు గడుస్తున్నా విడుదల చేయకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు వేతనాల కోసం నిరీక్షిస్తున్నారు.

06/24/2018 - 23:59

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి తెలంగాణ పారిశ్రామిక వేత్తల బృందం ఈనెల 26న వెళ్లనుంది. టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు సారధ్యంలో 20 పారిశ్రామిక వాడలకు చెందిన 200 మంది పారిశ్రామిక వేత్తలు ప్రాజెక్టు సందర్శించేందుకు వెళుతున్నారు.

06/24/2018 - 23:58

హైదరాబాద్, జూన్ 24: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు మరోమారు అన్యాయం చేసేందుకు కుట్రలు చేస్తోందని బీసీ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఆదివారం బీసీ భవన్‌లో పంచాయతి ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు.

06/24/2018 - 23:56

హైదరాబాద్, జూన్ 24: మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్‌ను వీడడంతో పార్టీకి ఎలాంటి నష్టం లేదని, పైగా పార్టీ మరింత బలపడిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ దానం నాగేందర్ అన్నారు. తనకు పదవి ఇప్పించానని దానం నాగేందర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తన ముందు దానం ఓ బచ్చా అని వ్యాఖ్యానించారు.

06/24/2018 - 06:55

హైదరాబాద్, జూన్ 23: రాష్ట్రంలో నేరాల నిరోధానికి, నేరస్తుల ఆట కట్టించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సమగ్ర ఫింగర్ ప్రింట్ డేటా బేస్‌ను రూపొందించేందుకు కసరత్తు చేపడుతోంది. వేలిముద్రల ఆధారంగా నేరస్తుల గుర్తింపు, నిర్ధారణ పక్కా శాస్ర్తియ ఆధారంగా ఎంతో ఉపయోగంగా ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర స్ధాయి ఫింగర్ ప్రింట్ బ్యూరోను మరింత విస్తత్రం చేసేందుకు సన్నద్దం అవుతోంది.

06/24/2018 - 06:54

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ‘దోస్త్’ లో గందరగోళంపై ఆంధ్రభూమి వార్తకు అధికారులు స్పందించారు. తొలి దశలో సీట్లు పొందిన వారు, రెండో దశలో సీట్లు పొందిన వారికి సైతం మూడో దశలో సీట్లకు దరఖాస్తు చేసుకునే వీలుకల్పించారు.

06/24/2018 - 06:54

హైదరాబాద్, జూన్ 23: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్ అవకాశవాది అని ఎఐసిసి సభ్యుడు, కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం దానం నాగేందర్‌కు కొత్తేమి కాదని ఆయన శనివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. 2014 ఎన్నికలకు ముందు దానం కాంగ్రెస్‌ను పార్టీ వీడి తెలుగు దేశం పార్టీలో చేరారని ఆయన గుర్తు చేశారు.

Pages