S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/24/2018 - 06:53

హైదరాబాద్, జూన్ 23: దళితుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందని ఎస్‌సి సంక్షేమ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్‌సి కార్పోరేషన్, అపోలో ఆసుపత్రులు సంయుక్తంగా నిర్వహించిన వృత్తినైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు శనివారం ఆయన సర్ట్ఫికెట్లను అందచేశారు.

06/24/2018 - 06:52

హైదరాబాద్, జూన్ 23: బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించుకునేందుకు రాష్ట్రాస్థాయిలో ఉద్యమించాలని బీసీ సంఘాలు తీర్మానించాయి. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం నగరంలో రాష్టస్థ్రాయి బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమాశం జరిగింది. సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 112 కుల సంఘాల నాయకులు హాజరై మాట్లాడారు.

06/24/2018 - 06:52

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ సంస్కృతి, చరిత్రతో పాటు సామాజిక , ఆర్ధిక, రాజకీయ , కళా రంగాల విశేషాలను నిక్షిప్తం చేసేందుకు తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ పూనుకుంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందే ఆంధ్రా హిస్టరీ కాంగ్రెస్ నుండి విడిపోయి ప్రత్యేకంగా తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఏర్పాటైంది. ఆనాటి నుండి తెలంగాణ ఔన్నత్యాన్ని చాటిచెప్పే సంఘటనలు, ఆధారాలు రికార్డు చేస్తున్నారు.

06/24/2018 - 06:51

హైదరాబాద్, జూన్ 23: మేథావుల భాగస్వామ్యంతో ఎన్నికల ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక తయారీలో భాగంగా ‘సస్టెయనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్’ అనే అంశంపై వివిధ రంగాలకు చెందిన మేధావులతో శనివారం రెడ్ హిల్స్‌లోని ప్యాప్సీ భవన్‌లో ఆ పార్టీ సదస్సు నిర్వహించింది.

06/23/2018 - 06:16

హైదరాబాద్, జూన్ 22: పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. రిజర్వేషన్లను ఖరారు చేసే అధికారాన్ని జిల్లాల్లో కలక్టర్లకు, రాష్ట్రంలో పంచాయతీరాజ్ కమిషనర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలలో 2,02,94,874 మంది జనాభా ఉండగా వీటిలో ఏజెన్సీ గ్రామాలు 1,308 ఉన్నాయి.

06/23/2018 - 06:15

హైదరాబాద్, జూన్ 22: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని తెలంగాణ టిడిపి క్రమశిక్షణా కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ సభ్యుడు బక్కని నర్సింహులు విమర్శించారు.

06/23/2018 - 06:14

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ కోసం 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ వద్ద పంచాయితీకి తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల విద్యుత్ డిస్కంలు సిద్ధం అవుతున్నాయి. చర్చలు విఫలం అయితే మాత్రం ఇరు రాష్ట్రాల ట్రాన్సుకో సంస్థలు నష్టపోతాయని తెలంగాణ విద్యుత్ డిస్కంలు అధికారులు అంటున్నారు.

06/23/2018 - 06:13

హైదరాబాద్, జూన్ 22: తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని రేషన్ డీలర్లు తెగేసి చెప్పేసారు. ప్రభుత్వం తమను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం స్పష్టం చేసింది.

06/23/2018 - 06:12

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాల స్థితిగతులు వారి విద్య, జీవన విధానంపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేయించాలని బీసీ కమిషన్ సూచించింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న పునర్నిర్మాణ పనుల్లో విశ్వవిద్యాలయాలు కూడా పాలుపంచుకోవాలని కమిషన్ కోరింది.

06/23/2018 - 06:11

హైదరాబాద్, జూన్ 22: నేరస్తులను నిర్ధారించడంలో చేతి వేలిముద్రలు చాలా కీలకమని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గతంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందని సమయంలో వేలిముద్రలు నిర్ధారించే సరికి కొన్ని నెలల సమయం పట్టేదని, నేరస్తుడు తప్పించుకుపోయేందుకు అవకాశం ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు క్షణాల్లో వేలిముద్రలతో నేరస్తులను పసిగట్డడం చాలా సులభమైందని అన్నారు.

Pages