S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/19/2018 - 05:37

హైదరాబాద్, జూన్ 18: కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ సీబీఎస్‌ఈ ద్వారా ప్రతి ఏటా నిర్వహించే సీటెట్ (సెంట్రల్ టీచర్సు ఎలిజిబిలిటీ టెస్టు)ను ఇక మీదట ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ అధ్యయనం చేసింది. ఈ ఏడాది సీటెట్‌ను 20 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు.

06/19/2018 - 05:36

కరీంనగర్ టౌన్, జూన్ 18: ఉమ్మ డి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యంతోనే తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం జరిగిందని, దీనిని తుడిచిపెట్టి రైతులను రాజులుగా మార్చేందుకు కొత్త రాష్ట్రంలో తమ ప్రభుత్వం నడుం బిగించి, వారి శ్రేయస్సు కోసం నిరాటంకంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్ధిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

06/19/2018 - 05:36

హైదరాబాద్, జూన్ 18: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలతో పాటు రాష్టవ్య్రాప్తంగా జరిగే బోనాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సచివాలయలో బోనాల జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

06/19/2018 - 05:35

హైదరాబాద్, జూన్ 18: సాంకేతిక ఆధారిత సేవలతో పోలీస్ శాఖను పరుగులు పెట్టిస్తున్న డిజిపి ఎం.మహేందర్ రెడ్డి ‘కాప్-కనెక్ట్’ పేరుతో తెలంగాణ పోలీస్ వాట్సప్‌ను ఆవిష్కరించారు. ఈ వాట్సప్ ఏర్పాటు కావడం పోలీసు శాఖలోనే విప్లవాత్మక మార్పుగా ఆయన అభివర్ణించారు.

06/19/2018 - 05:41

హైదరాబాద్, జూన్ 18: అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించడంతో సోమవారం నాడు బేగంపేటలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వీహెచ్‌పీ , భజరంగ్‌దళ్ కార్యకర్తలు ముట్టడించనున్నట్టు సమాచారం అందడంతో వందలాది మంది పోలీసులతో పహరా ఏర్పాటు చేశారు.

06/19/2018 - 05:33

హైదరాబాద్, జూన్ 18: పౌరసరఫరాల సంస్థలో నూతంగా బిజినెస్ వింగ్‌ను ఏర్పాటు చేయాలని పాలక మంలడి నిర్ణయించింది. సోమవారం పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో పాలక మండలి సమావేశం జరిగింది. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సంస్థ మేనేజింగద్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

06/19/2018 - 05:32

హైదరాబాద్, జూన్ 18: పసుపు సాగును లాభసాటిగా మారుస్తామని ఎంపీ కవిత అన్నారు. సోమవారం నగరంలో ఇక్కడ సుగంధ ద్రవ్యాల బోర్డు పసుపుపై వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ఆమె మాట్లాడుతూ దశాబ్దాలుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పసుపు రైతులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు.

06/19/2018 - 05:31

హైదరాబాద్, జూన్ 18: వికల్ప కౌన్సిలింగ్ సెంటర్ పనితీరు బాగుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆ సెంటర్ బృందాన్ని ప్రశంసించారు. వీధుల్లో వ్యభిచారులుగా తిరుగుతున్న వారిని, వ్యభిచార గృహాల్లో మగ్గిపోతున్న మహిళలను, సంబంధిత నేరాలకు పాల్పడుతున్న వారిని నిరోధించేందుకు నగర పోలీసు విభాగం ఏర్పాటు చేసిన ‘వికల్ప కౌన్సిలింగ్ సెంటర్’ ప్రజ్వల స్వచ్ఛంధ సంస్థతో కలిసి నిర్వహిస్తున్నారు.

06/19/2018 - 05:31

ఖమ్మం, జూన్ 18: తమ పదవీకాలంలో చివరి ఆరు నెలలు అధికారాలు లేకుండా ఇబ్బందిపడే సర్పంచ్‌లకు ప్రభుత్వం ఊరటనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి పదవీకాలం ముగిసే వరకు చెక్ పవర్‌ను కొనసాగిస్తూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

06/18/2018 - 04:11

హైదరాబాద్, జూన్ 17: మన కోసం, మన హక్కుల కోసం మనమే పోరాడాలని తెలంగాణ విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం రాష్ట్ర కార్యదర్శి బానుప్రకాష్ పిలుపు ఇచ్చారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వల్ల ప్రతిభకు అన్యాయం జరుగుతోందని ఆయన ధ్వజమెత్తారు. కోర్టుల్లో సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాల వైఖరికి నిసనగా ఆదివారం జిహెచ్‌ఎంసి వద్ద సంఘం మహాధర్నా చేపట్టింది.

Pages