S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/23/2018 - 06:10

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణలో బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన మహారాష్ట్ర విద్యామంత్రి వినోద్ తావ్డేతో ముంబైలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో బాలికా విద్యకు మహిళా సంక్షేమానికి తీసుకున్న చర్యలను, అమలు చేస్తున్న పథకాలను తావ్డేకు వివరించారు.

06/23/2018 - 06:09

హైదరాబాద్, జూన్ 22: నకిలీ క్లబ్‌ను సృష్టించి వందలాదిమంది అమాయకులను సభ్యత్వం పేరుతో రూ.9 కోట్ల మొత్తాన్ని వసూలు చేసి ఇద్దరిని టాస్క్ఫోర్స్ అరెస్టు చేసింది. ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ ఎస్టేట్స్, అండ్ సర్వీసెస్ పేరుతో నకిలీ సంస్ధను ఏర్పాటు చేసి దానిలో క్లబ్ సభ్వత్వం, హోలిడే మెంబర్ షిప్, హెల్త్ మెంబర్‌షిప్, సిల్వర్ కాయిన్, కాంప్లిమెంటరీ ప్లాట్, రిసార్ట్స్‌లో రాయితీలు వంటి వాటిని ఎరవేసి భారీగా దోచేశారు.

06/23/2018 - 06:08

హైదరాబాద్, జూన్ 22: నాలుగేళ్లుగా ప్రజలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో ఇచ్చిన హామీలను తుంగలొ తొక్కి ఎలా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందో ప్రజలకు వివరించి, టీఆర్‌ఎస్ సర్కార్‌పై యుద్ధం ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు.

06/22/2018 - 06:17

హైదరాబాద్, జూన్ 21: ఈ ఏడాది మిడ్ మానేరు డ్యామ్‌లోకి 25 టిఎంసిల నీరు నింపి 76 వేల ఎకరాలకు నీరందించనున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై గురువారం సచివాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏడాది మిడ్ మానేరులోకి 5 టిఎంసీల నీరు మాత్రమే నింపగలిగామన్నారు.

06/22/2018 - 06:16

హైదరాబాద్, జూన్ 21: మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీట్ల భర్తీ విషయంలో రాష్ట్రం కేంద్ర జాబితాలో చేరినా, నేటికీ అందుకు సంబంధించిన యూజర్ ఐడి, పాస్‌వర్టులు రాకపోవడంతో ఏర్పడిన గందరగోళం సమసిపోయింది.

06/22/2018 - 06:14

హైదరాబాద్, జూన్ 21: దేశంలో స్మార్టు పోలీసింగ్ విధానం రావల్సి ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారం అహిర్ పేర్కొన్నారు. అరెస్టు చేసిన వ్యక్తుల వేలిముద్రలు, ఛాయాచిత్రాలు, కొలతలను చట్టబద్ధమైనవిగా చేసే అధికారం కల్పించేందుకు ఖైదీల గుర్తింపు చట్టం 1920ని సవరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

06/22/2018 - 06:12

హైదరాబాద్, జూన్ 21: టెక్నాలజీ వినియోగంలో ఎంతో ముందంజలో ఉంటూ ఐటీని వినియోగించుకుంటూ అకడమిక్ పరిపాలనా నిర్వహణలో సమూల మార్పులను తీసుకువచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ గురువారం నాడు స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును పొందారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమ్మేళనంలో ఈ అవార్డు అందుకున్నట్టు డాక్టర్ అశోక్ తెలిపారు.

06/22/2018 - 06:11

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణ సాధించుకోవడంతో పాటు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ కోరుకున్నట్టే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, ఇదే ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా జయశంకర్ చరిత్రలో చిరస్మరణీంగా నిలిచిపోతారన్నారు.

06/22/2018 - 06:09

హైదరాబాద్, జూన్ 21: రానున్న నీట్, జెఈఈ పరీక్షలకు తెలంగాణ గురుకుల, మోడల్‌స్కూళ్ల, కేజీబీవీ విద్యార్థులే అధికంగా సీట్లు కైవసం చేసుకునే విధంగా ఇంటర్ ఫస్టియర్ నుండే వారికి కోచింగ్ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.

06/22/2018 - 06:08

హైదరాబాద్, జూన్ 21: హరిత తెలంగాణ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న నాలుగో విడద హరితహారం ఈసారి విద్యాసంస్థలు కేంద్రంగా భారీ ఎత్తున చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు.

Pages