S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

06/25/2017 - 22:08

రాముని కాత్మలో నొక విరాగము కల్గిన మాట, యాని రా
గామిత తీవ్రతల్ జెడి తనంత తన శాంతి వహించు పిమ్మటన్
దా ముది ఱేనికిన్ దశరథ క్షితిజాని కెఱుంగ నయ్యో బో
బ్రామిన భీతియున్ దరతరై మనజేశుండు దండడించుచున్
బ్రహ్మచారి సుతుండు విరాజియైన
జనకుడూహించు సుతు గృహస్థునిబొనర్ప
నా గృహస్థుండె సుతుడు విరాగియైన
దండ్రి వ్యవహారమతనికి దాల్పజేయు’’

06/25/2017 - 22:07

కథానికా చరిత్రలో 1915 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆధునిక కథాద్యులైన గురజాడ వేంకట అప్పారావుగారు మనల్ని విడిచిపోయింది ఆ సంవత్సరంలోనే. తెలుగు ఆధునిక కథ- కథనానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన పాలగుమ్మి పద్మరాజుగారు జన్మించింది ఆ సంవత్సరంలోనే. అంటే పాలగుమ్మి పద్మరాజుగారి శతజయంతి సంవత్సరం గురజాడ వేంకట అప్పారావుగారి శతాబ్ది సంస్మరణ సంవత్సరం!

06/25/2017 - 22:06

కలిసి వున్నన్నాళ్లూ నన్ను కాల్చుకుతిన్నావు. ఆ మహాతల్లి మా అత్తగారు చచ్చి యే లోకాన వున్నదో ఆమె బతికుండగా మాత్రం కొంచెం సుఖపడ్డాను. ఆమె పోయింది- నీకు అడ్డులేకుండా పోయింది. నన్ను మనిషిలాగ ఎన్నడైనా చూశావా? ఎన్ని హింసలు పెట్టావు? చివరకు జంతువులాగా కన్నబిడ్డను పొట్టన పెట్టుకున్నావు. అదృష్టవంతుడివి- మంచిదాన్ని గనక వదిలేశాను.

06/25/2017 - 22:10

చెట్టే మనిషి ఊపిరి
మనిషి కావాలి చెట్టు కాపరి
మొక్కకు జల వనరుల జవసత్వమందించు
విరుల హొయలతో వనకన్య దర్శనమిచ్చు
చెట్టుకు చేయూతనిచ్చి సంరక్షించు
హరిత వనాలలో హాయిగా విహరించవచ్చు
మొక్కలను చిదిమి వృక్షాలను నరికితే
మానవ మనుగడ ప్రశ్నార్థకమే
నగరాలు ఎడారులైతే నిలువనీడ కరువే
తులసి తీర్థానికీ తపించి ‘పోవడమే’
ప్రతిఫలాపేక్ష నాశించని ప్రకృతి

06/25/2017 - 22:03

రాజమండ్రిలోని నేదునూరి గంగాధరం గ్రంథాలయంలోని సమావేశ మందిరంలో జూలై 2వ తేదీ సా. 5.30 ని.లకు రవికాంత్ సంపాదకులుగా ‘‘అడుగుజాడ’’ సినారె ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ జరుగుతుంది. ముఖ్యఅతిధి మరియు ఆవిష్కర్తగా జయధీర్ తిరుమలరావు, ఆత్మీయ అతిథిగా సన్నిధానం నరసింహశర్మ, ప్రధాన వక్త - గూటం స్వామి పాల్గొంటారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

06/18/2017 - 22:21

హరహమూ, అనుక్షణమూ భవ్య కవితావేశంతో తెలుగు నేలను తన కవిత్వ ప్రవాహంతో ప్లావితం చేసిన గొప్ప కవి సి.నారాయణరెడ్డి. ఆయన అస్తమయం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక శకానికి చరమగీతం పాడింది. దాశరథి, నారాయణరెడ్డి అన్నదమ్ముల వలె తెలుగు సాహిత్య రంగంలోకి ప్రవేశించినప్పటికి అది భావకవిత్వం తొలగిపోయి ప్రగతివాద కవిత్వం పెంపొందించుకుంటున్న కాలం. అది మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కాలం కూడా.

06/18/2017 - 22:17

తేజోవంతమైన దీపంలా ముఖం
నిట్టనిలువు ఎండ సోకని దేహం
చిరు ఉద్వేగాల కంపనానికి
చెమ్మగిల్లి గుండె చెరువై
ఊగిపోయే ఊరిపోయే
ఆర్ద్రమయ్యే కళ్ళు
ఊకలు విసిరికొడితే చాలు
కందిపోయే కమిలిపోయే చర్మం

వర్షం కడిగిన పచ్చని చెట్టులా
స్వచ్ఛ స్పటిక నిగారింపు
రోజంతా తాజాతనం
పక్కన కూర్చుంటే చందన పరిమళం

06/18/2017 - 22:15

కవిసంధ్య కవిత్వ ద్వైమాసిక పత్రిక జూన్, జూలై 2017 సంచిక సినారె స్మారక ప్రత్యేక సంచికగా వెలువడుతుంది. ఈ సంచిక కోసం సినారెతో గల తమ సాహిత్య అనుభవాలను, సినారె సాహిత్యంపై వ్యాసాలను, కవితలను ఆహ్వానిస్తున్నట్లు కవిసంధ్య సంపాదకుడు డా. శిఖామణి ఒక ప్రకటనలో తెలిపారు. పత్రిక సైజు, పుటలను దృష్టిలో పెట్టుకుని సంక్షిప్త రచనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. తమ రచనలను 24-6- 2017లోపు ఎడిటర్, కవిసంధ్య, డోర్ నెం.

06/18/2017 - 22:14

1970లో డా.సి.నారాయణరెడ్డిగారు ప్రచురించిన కావ్యం ‘మంటలూ -మానవుడూ’. ఇది ఆయన రాసిన 30 కవితల సంకలనం. ఇందులోని ప్రతి కవితా అభ్యుదయ పరిమళంతో అలరారుతు సామాజిక మార్పును ఆకాంక్షగా ప్రకటిస్తున్నది. ఈ కావ్యం వచ్చి నాలుగున్నర దశాబ్దాలు గడిచిపోతున్నా ఇందులోని కవితలు సామాజిక స్వభావాన్ని కోల్పోలేదు. ఈ కావ్యంలో కవి విమర్శనాత్మకంగా చిత్రించిన రాజకీయార్ధిక సాంఘికాంశాలు ఏదో ఒక రూపంలో ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.

06/11/2017 - 21:02

రసభావం- అనౌచిత్యమున ప్రవర్తిల్లినచో రసాభాసమవుతుంది. అనౌచిత్యమనగా లోకమర్యాదను అతిక్రమించడం. పెద్దలను గౌరవించడం లోకమర్యాద. అపహాస్యము చేయగూడని గురువులు, పెద్దలు, దేవతలు మున్నగువారిని ఆలంబనం చేసుకుని ప్రవృత్తమైన హాస్యం, రసాభాసమవుతుంది.

Pages