S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

07/23/2017 - 23:07

మదరాసు మహానగరంలో వుండి వచ్చాడు. నారాయణ ఒక పల్లెటూరులో స్నేహితుని యింట ప్రవాసం చేస్తున్నాడు. సినిమా కోసం చదువు పాడుచేసుకుని, సినిమా పత్రిక ప్రారంభించి సినిమా తీయాలనే ఆర్భాటంలో ఎనిమిది నెలలు గడిపి, ఆస్తి అంతా కరరావుడు చేసుకుని యిక్కడికి చేరాడు. అయినా సినిమా తీయాలనే ఆరాటం ఆగలేదు. ఏ మనిషితో మాట్లాడినా సినిమా కళను గురించి, ప్రయోగాల గురించి ప్రస్తావిస్తూ వుంటాడు.

07/16/2017 - 23:34

పేరు గుర్తొచ్చినప్పుడల్లా
ఈ చిన్ని గుండె
పెద్ద గుండై ఉప్పొంగుతుంది
ఊరు విడిచాననో, నగరీకరణలో తడిచాననో
ముఖం విప్పార్చి, ముఖస్తుతికై
అక్షరసత్యమని వక్కాణించడంలేదు

07/16/2017 - 23:33

మొగ్గగా వున్నప్పుడు
ముద్దులొలుకుతాయి
వికసించేటప్పుడు
గుప్పున పరిమళిస్తాయి
జడలోనో మెడలోనో
మెరిసిన తర్వాత
తళుకులు నలిగిపోతాయి
నేను తెచ్చిన మాలికలు
నీ మెడనిండా వేసుకో
నీవు ఇచ్చిన పువ్వులు
దోసిట్లో పోసుకుంటా
అందరి మధ్యన ఇద్దరం
అత్తరులా అల్లుకుపోదాం

07/16/2017 - 23:33

‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని ఎంతగా అన్నా, వర్తమాన కాలానికిగల ఆకర్షణ తిరుగులేనిది. వర్తమాన కాలంలో ఏది జరిగినా అది మనిషి అనుభూతిని పదిలం చేస్తుంది. పది కాలాలపాటు గుర్తుంచుకొనేలా మలుస్తుంది. సాహిత్య విషయంలో కూడా ఇదే పునరావృతవౌతుంది. మనిషి తన సమకాలంలో ప్రభవిస్తున్న సాహిత్యాన్ని ఎక్కువగా స్వీకరిస్తాడు. ఇందుకు కారణం అతని వర్తమాన కాలానికీ, అనుభవంలో ఉన్న జీవితానికీ మధ్య అంతరం లేకపోవడమే.

07/16/2017 - 23:32

మనమడు తాతతో పొలానికి షికారుగా వెళ్లాడు. ‘‘తాతయ్యా, మన పొలం ఏది?’’ అని అడిగాడు. ‘నీకు కనబడుతున్నదంతా మందేరా!’ అన్నాడు తాత. వంద ఎకరాల ఏకకండ్రిక. తన మనమడికి అవతలి తట్టు కనబడకుండా సముద్రంలా వున్న పొలం చూస్తూ ‘ఇదంతా మందేరా’ అన్నప్పుడు అతని మనస్సు ఆనందంతో నిండింది’’. ఇదీ జోగయ్య తాత కథ.

07/16/2017 - 23:31

రైతుకు భూమితో వున్న అనుబంధం విడదీయరానిది. ప్రకృతి మోసం చేసినా, ప్రభుత్వాలు దాగా చేసినా మంచి రోజులు రాకపోతాయా అని అతని నమ్మకం. అలాంటిది రైతు నమ్ముకున్న భూమిని అతనికి తెలియకుండానే, అతనికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతు వ్యతిరేక విధానాలు ఒకవైపు, మార్కెట్ దోపిడీ ఇంకోవైపు రైతును నిస్సహాయుడిగా మార్చివేశాయి.

07/09/2017 - 23:15

ఎవరండీ వీరు
ప్రజలూ ప్రభుత్వానికి మధ్య
మధ్యవర్తులట

ప్రశ్న కూడా
ప్రభుత్వ వ్యతిరేకం అంటారు
మాటల్లో ప్రతిసారి అధినాయకుని పేరు
ఏడ నిలబడ్డారో చెప్పకే చెబుతారు
ఐనా మధ్యవర్తినని బుకాయింపు

యంత్రాంగంలో భాగం ఈ పావులు
ద్విముఖ రహస్య సంభాషణ నిపుణత్వం
తానే పుట్టించిన అక్షరాల గుడ్లని
అమాంతం ఆమ్లెట్టేసి కానుకవుతున్నారు

07/09/2017 - 23:14

మాటలొచ్చిన ఇనప్పెట్టిలో
దస్తావేజులెందుకుంటాయి
కట్టలు కట్టిన ఆత్మలుంటాయి కాని

రహస్య బిలంలాంటి మా ఇనప్పెట్టి
అరల్లోపలి అరల్లో ఎక్కడో
బొమ్మలేవో వేసుకుంటూ
నా చిన్నప్పటి నేను కూర్చునే ఉంటాను

07/09/2017 - 23:13

అపసవ్య దిశలో అడుగులేస్తున్న సామాజిక జీవితాన్ని ఎత్తిచూపుతూ, అందలి తప్పిదాలను తట్టి చెబుతూ పొరపాట్లను విప్పి చూపిస్తూ సమాజాన్ని సవ్యమైన మార్గంలో పెట్టేందుకు దోహదపడే కళారూపాల్లో ‘‘సాహిత్యం’’ ప్రముఖమైనదిగా పేర్కొనవచ్చును.

07/09/2017 - 23:12

సుమిత్ర ఆ ఊరికి కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల. పెళ్లి ఊరేగింపు సమయంలోనే తన బాల్య స్నేహితురాలిని ‘రుక్మిణి’ని చూస్తుంది. ఆ రుక్మిణిలో వెనకటి చలాకీతనం, చురుకు లోపించినాయని గమనిస్తుంది. దీనికి కారణం ఏమిటో కనుక్కోవాలని తన మనస్సులోనే నిర్థారణ చేసుకుంటుంది.

Pages