S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

05/14/2017 - 21:45

సాహిత్య రంగంలో కలం పెట్టినవాళ్ళకి లేదా కలం పెడుతున్నవాళ్ళకి సాహిత్యంలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండటం కనీసమైన యోగ్యత. ఏ రంగంలో రాణించాలన్నా ఆ రంగంలో కొంత పరిజ్ఞానం అవసరం కాబట్టి దానిని పెంపొందించుకుంటారు. అవగాహన చేసుకుంటారు. కానీ మన రచయితలు, కవులు.. ముఖ్యంగా నేటి తరంవాళ్ళకి ఇవేమీ పట్టవు. ఒక పుస్తకం, ఒక ప్రశంసాపూర్వకమైన ముందుమాట, తన వారిచే సమీక్ష.. ఇంకేముంది? ‘ప్రముఖ’ అనే పదాన్ని తగిలించుకోవచ్చు.

04/30/2017 - 22:46

ఎనిమిది గంటల పనిదినం ఎలాంటిదో ఎరగను నేను
ఉదయం పదవుతూనే పనిలో ప్రవేశిస్తాను
మీరు రాగానే చిరునవ్వుల తివాచీ పరుస్తాను
ఆప్యాయపు టత్తరు చల్లుతాను
ప్రతి అవసరానికి దిక్సూచినవుతాను
ఉదయం మధ్యాహ్నవౌతుంది
సాయంకాలవౌతుంది... రాత్రవుతుంది...
మధ్యలో రెండుసార్లు షావుకారు ఉదారంగా పంచే తేనీరు
ఇంటినుంచి వస్తున్నప్పుడే తెచ్చుకున్న చల్లారిన మెతుకులే

04/30/2017 - 22:45

సాహిత్యమంటే వెలుగు... సాహిత్యమంటే గలగల పారే వాగు. మిలమిల మెరిసే నక్షత్రం. జలజల కురిసె వర్షం. ఒక కెరటం ఒక మెరుపు ఒక ఉరుము. సాహిత్యం నిశ్శబ్దంకాదు. నిశ్శబాదన్ని సృష్టించే అక్షరాలు సాహిత్యం కాదు. సాహిత్యమంటే శబ్దం. ధిక్కరణ, చైతన్యం, పోరాటం... నిరంతర ప్రయాణం... ఆరని మంట...

04/30/2017 - 22:44

మనవాళ్ళు కవిత్వానికి పైత్యానికి సంబంధం ఉందంటారు. పైత్యానికి మందంటూ ఉంది ట. కాని కవిత్వానికి అది లేదట! ఇంగ్లీషు వాళ్ళు కవులను పిచ్చివాళ్ళను ఒక కుండలి (బ్రాకెట్)లో పడేసి గొళ్ళెం పెట్టి తాళం బిగించేరు. నయమే వారు కథలను స్వేచ్ఛగా వదిలేసారు! ‘ఏమి తిని సెపితివి కవితము’ అని తెనాలి రామకృష్ణుడు ప్రశ్న వేసినప్పటి నుంచి కవిత్వం భ్రష్టు పట్టింది అన్న అనుమానం రావడం సహజమే!

04/30/2017 - 22:43

తొందరపడొద్దు
నాటిన విత్తు మట్టితో మాట్లాడింది
తడితో సావాసం చేసింది
గాలిని ఆహ్వానించింది
విత్తు మొలకెత్తుతుంది
ఎటొచ్చీ, అరచేయి అడ్డేస్తావో
గెనంపై కూర్చొని సంరక్షణ చేస్తావో
మంచె పైకెక్కి కాపలా కాస్తావో-

04/30/2017 - 22:42

కాకతీయ కళాదర్శనము
ప్రొ. ముదిగొండ శివప్రసాద్
2/2/647/132బి, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ,
హైదరాబాద్ - 500 013,
పేజీలు: 14+384, వెల: రు.500/-
*
తెలుగు ప్రాంతాలను సుమారు 350 సంవత్సరాలు పరిపాలించిన కాకతీయ రాజుల రాజకీయ సామాజిక సాంస్కృతిక పార్శ్వాలను గురించిన విపులమైన అధ్యయనం.

04/23/2017 - 22:56

శివానంద రామాయణం (బాలకాండ)
రచన: ఆచార్య వి.యల్.యస్.్భమశంకరం
శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంవారి ప్రచురణ:
పేజీలు: 484; వెల: రు.150/-
ప్రాప్తి స్థానం:
తి.తి.దేవస్థానం వారి అన్ని విక్రయశాలలలో...

04/23/2017 - 22:53

తెలుగు వచన రచయితల్లో భాషా శైలీ విషయానికి విశిష్టంగా పేరెన్నికగల మహనీయులు ఇద్దరున్నారు. వారిలో ఒకరు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు, మరొకరు మల్లాది రామకృష్ణశాస్ర్తీగారు. ఇద్దరికిద్దరూ తెలుగు, సంస్కృత భాషా సాహిత్యాల్లో మంచి విద్వాంసులే. తెలుగుకోసం ప్రాణం పెట్టేవారే. గొప్ప శైలీ విన్యాస శిల్ప మర్మజ్ఞులే. తెలుగు జన జీవన సంస్కృతి పరమయిన, సహజోత్పన్న భావ విశేషమయిన వస్తువులను కథానికలుగా మలుచుకొన్నవారే.

04/23/2017 - 22:51

శబ్ద చేతనా స్వరూపాన్ని శిల్పిస్తున్న
అక్షరం మీంచి
ఱెక్కలు చాటిస్తూ ఒక పక్షి లేచింది
క్రియాశక్తికది కీర్తి పతాక
పల్లవిని ఆకాశపుటంచులకు చేర్చింది
పాట మొత్తం పర్సమేఖల మీద పరుచుకుంది
ఆత్మగీత సారాంశపు సరిహద్దుల్ని స్పృశించి
దిగంత రేఖమీద
బింబరూపాల దివాక్షప విశే్లషణని విశదపరుస్తోంది
మంచుబొట్టులో రంగులు కలబోసుకుంటూ

04/23/2017 - 22:49

చల్లని
పాలరాతి స్పర్శానందాన్ని
అనుభవించిన అరికాళ్లు
మండుటెండలో
వేడెక్కిన పెనం లాంటి
ఇనుప నిచ్చెనపై
నడిచిన దినాన
భగ్గుమన్నవి అవే అరికాళ్లు
ఈ శరీర భారాన్ని మోస్తూనే
మాంస మజ్జాగతమైన
కోరికలతో జ్వలించి
బొక్కల బలంపై
ఊరేగే ఈ దేహయాత్ర
అనుభవ వైపరీత్యాల
వొత్తిడిలో
జీవన చరమాంకంలో
మొద్దుబారేవి అవే అరికాళ్లు!

Pages