S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

12/15/2015 - 01:28

స్మార్ట్ ఫోన్ల స్క్రీన్‌కు రక్షణ కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఐఫోన్‌లకోసం తాజాగా మార్కెట్లోకి వచ్చిన హైపర్ గ్లాస్ ఇప్పుడో తాజా సంచలనం. ఇంపోర్టెడ్ జపనీస్ గ్లాస్‌తో హై టెక్నాలజీని వినియోగించి రూపొందించిన ఈ హైపర్ గ్లాస్ కేవలం స్క్రీన్ ప్రొటెక్టర్ మాత్రమే కాదు...హైటెక్ సెక్యూరిటీకి కేరాఫ్ అడ్రస్. ఐ ఫోన్ 6 హోమ్ బటన్‌కు ఇరువైపులా హైపర్ గ్లాస్ రెండు టచ్ పాయింట్లను ఇస్తోంది.

12/15/2015 - 01:26

రకరకాల గాడ్జెట్స్ వచ్చేశాయ్. చేతికి వేరబుల్ డివైస్. చేతిలో సెల్‌ఫోన్. కారు తాళాలు. బ్యాగ్‌లో లాప్‌టాప్ లేదా ట్యాబ్. ఇలా మనతోపాటు మనం క్యారీ చేసే గాడ్జెట్స్ చాలానే. కానీ అవి పోతేనే తంటా. అయితే లాపా 2 మన దగ్గర ఉంటే ఇలాంటి గాడ్జెట్స్ ఏవీ పోవన్నమాటే. లాపా 2 ఓ బ్లూటూత్ ఆబ్జెక్ట్ ఫైండర్. బ్లూ టూత్ కనెక్టివిటీ ఉన్న గాడ్జెట్స్‌ను ఇట్టే కనిపెట్టేస్తుంది.

12/15/2015 - 01:25

మోటోరోలా అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చిం ది. ఇంతకాలం వారిని ఊరిస్తూ వచ్చిన మోటో జి టర్బో ఎడిషన్ అమ్మకాలు భారతీయ మార్కెట్లో మొదలయ్యాయి. ఎప్పటిలానే ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే టర్బో ఎడిషన్ అమ్మకాలు జరుగుతున్నాయి. తెలుపు, నలుపు రంగుల్లో ఆకర్షణీయమైన డిజైన్‌లో లభిస్తున్న టర్బో ఎడిషన్ ధర 14,499 రూపాయలు. ఇది వాటర్‌ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కావడం మరో విశేషం.

12/15/2015 - 01:25

సెక్యూరిటీపరంగా టెక్నాలజీ అందిస్తున్న సాయం అంతాఇంతా కాదు. సిసి కెమెరాలు వచ్చాక, నిఘా అనేది సునాయాసమైపోయింది. అయితే ఇళ్లలోనూ, చిన్న చిన్న వ్యాపార సంస్థల్లోనూ వీటి వాడకం కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. క్లెవర్ లూప్‌ను అమర్చుకుంటే ఖర్చు తక్కువ..పనితనం ఎక్కువ. ఇదో స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్. ఇళ్లలోనూ, వ్యాపార సంస్థల్లోనూ, అద్దె ఇళ్ళల్లోనూ కూడా క్లెవర్ లూప్‌ను అమర్చుకోవచ్చు.

12/15/2015 - 01:24

ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎంత తింటున్నామో తెలీకుండా తినేసేవారే ఎక్కువ. ఆనక ఆ కేలరీలు కరిగించేందుకు జిమ్ బాట పడతారు. ఎందుకొచ్చిన ప్రయాస? తినేటప్పుడే ఎన్ని కేలరీలు తీసుకుంటున్నామో తెలిస్తే బాగుంటుంది కదా! ఇలా భావించేవారికోసం మార్కెట్లోకి వచ్చింది- స్మార్ట్ స్లేట్. ఇదో పోర్టబుల్ న్యూట్రిషన్ స్మార్ట్ స్కేల్.

12/15/2015 - 01:23

ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించడం, ఇ కామర్స్ సైట్లలోకి వెళ్లి వస్తువుల్ని కొనుగోలు చేయడం లేదా ఆన్‌లైన్‌లోనే బ్యాంక్ అకౌంట్లను మేనేజ్ చేయడం చిటికెలో పని. అయితే వాటి పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడమే పెద్ద తలనొప్పి. స్మార్ట్ఫోన్‌లో పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడం రిస్క్‌తో కూడుకున్న పని. అయితే ‘ఎవ్విరి కీ’ మీ దగ్గరుంటే పాస్‌వర్డ్‌లను మరచిపోయే ప్రసక్తి ఉండదు.

12/15/2015 - 01:20

వేరబుల్ డివైస్‌లలో ఫిట్‌నెస్ ట్రాకర్లదే హవా. అలాంటి కోవకు చెందిందే జే బర్డ్ రీన్ (Jaybird Reign). మిగతా ట్రాకర్లలా కాకుంఢా ఇందులో అనేక ఫీచర్లున్నాయి. ఉదాహరణకు ఎన్ని గంటలు నిద్ర పోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు జాగింగ్‌కు బయల్దేరాలి, ఎంతసేపు ఎక్సర్‌సైజ్ చేయాలి, ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి..వంటి సకల సమాచారాన్ని అందించే యాక్టివిటీ ట్రాకర్ ఇది. హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ వంటి సమాచారం సంగతి సరేసరి.

12/08/2015 - 00:24

ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో భయాలకు లోనవుతూనే ఉంటారు. వర్థమాన తారలను చూస్తే సూపర్‌స్టార్లకు భయం. యువ నాయకులను చూస్తే వృద్ధ నాయకులకు భయం. తామున్న రంగంలో కొత్త నీరు ప్రవేశించిందంటే అందరికీ భయమే. దానిని ‘ఫేస్’ చేయడం మానేసి నిందారోపణలకు దిగుతారు. లేదా ఎస్కేప్ అవుతుంటారు. అసలు తమకు ఎదురుపడినదేమిటో, దాని మంచి చెడులేమిటో కూడా కనీసం విశే్లషించుకోరు.

12/08/2015 - 00:23

వాషబుల్ ఫోన్ ‘డిగ్నో రఫ్రె’

12/08/2015 - 00:22

మార్కెట్లోకి హోల్డింగ్ సెల్ పేరుతో కొత్తరకం గాడ్జెట్ వచ్చింది. హోల్డింగ్ సెల్ పేరులోనే అంతా ఉంది. ఇది స్మార్ట్ఫోన్‌ను ఉంచే పరికరం. సెల్‌ను దీంట్లో ఉంచే ఆపరేట్ చేసుకోవచ్చు. స్క్రీన్‌ను చూసేందుకు వీలుగా దీనిని కాస్త వంచవచ్చు కూడా. ముఖ్యంగా బెడ్ సైడ్ పెట్టుకుని, సెల్ చూడటం, మాట్లాడటం...హోల్డింగ్ సెల్‌తో ఈజీ. పని అయిపోయాక హోల్డింగ్ సెల్‌ను మడచి పక్కనపెట్టుకోవచ్చు. దీని ధర 19 డాలర్లు.

Pages