S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

08/27/2016 - 22:49

మనిషి చెట్ల మీద నుంచి దిగి బతకాలని అనుకోవడం ఒక తప్పు అన్నారు. ఇక జీవం సముద్రంలో నుంచి నేల మీదకు రావడమే తప్పు అన్నారు మరి కొందరు - డగ్లస్ ఆడమ్స్
* * *

08/20/2016 - 22:00

నిప్పు జీవంగలది. అది శ్వాసిస్తుంది, అందిన దాన్ని తింటుంది, అసహ్యించుకుంటుంది. మంటను గెలవాలంటే మనమూ దానిలాగే మెలగాలి. దానిలాగే ఎటుపడితే అటు కదలాలి. మండే పదార్థాలు ఉన్నాయని మంటకు తెలియదు. మంట ఉందని మండే పదార్థాలకు తెలియదు. మంట, నిప్పు కలిసి మన ప్రపంచాన్ని మార్చేశాయి. ఒకానొక సినిమాలో ఒకానొక పాత్ర అన్న మాటల ఆధారంగా.
* * *

,
08/12/2016 - 23:07

వెయ్యి గొంతుల మధ్యన కూడా తెలిసిన గొంతు వెంటనే వినిపిస్తుంది. ఇష్టమున్న గొంతు మురిపిస్తుంది. - ఎవరన్నారో తెలియదు.
* * *

08/06/2016 - 22:53

........................................................

07/30/2016 - 22:45

కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్లు నాకు ఒక పెద్ద పని అప్పగించారు. ఆ పని గురించి వాళ్లు చెప్పకుండానే నా మనసులో కొంతకాలంగా ఆలోచనలు సాగుతున్నాయి. అనుమానాలు కూడా సాగుతున్నాయి. పెద్ద సంస్థ వాళ్లు చెప్పినందుకు చిత్తశుద్ధిగా ప్రయత్నం మొదలుపెట్టాను. కొన్ని నెలల పాటు కష్టపడ్డాను. కానీ అప్పజెప్పిన పనిని నిజంగా బాగా చేయాలంటే అందుకు అవసరమయిన సమాచారం నాకు అందదని అనుమానం కాదు కదా, గట్టిగా అర్థమయింది.

07/24/2016 - 02:10

వానలు వస్తాయనుకున్నప్పుడు రావు. రావేమో అనుకున్నప్పుడు వచ్చి ముంచుతాయి. 2016 అనే ఈ సంవత్సరంలో ఏప్రిల్‌లో ఎండలు మండిపోయాయి. మామూలు ఫొటో ఇంత బాగుంటే ఎక్సరే ఫొటో మరెంత బాగుంటుందో అన్నట్టు మే, జూన్‌లలో ఎండలు ఎలాగుంటాయని ఆలోచించి అందరమూ భయపడ్డాము. కానీ అనుకోకుండా మేలో వానలు వచ్చాయి. అడపాదడపా వచ్చిన వానలతో ఎండల తాపం తగ్గింది.

,
07/16/2016 - 22:35

మరో ప్రపంచం పిలిచింది అన్న శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీశ్రీ పుట్టినరోజు, గిట్టిన రోజు గడచిన రెండు మూడు నెలల్లోనే జరిగాయి. ఆయన చెప్పిన మరో ప్రపంచం ఎలాగుంటుందో కానీ రచయితలు, కవులు మాత్రమే బతికేది ఒక ప్రపంచం ఉంది. అది ఒక ప్రపంచం. అంటే అదో ప్రపంచం. అంటే అదొక ప్రపంచం. మొత్తానికి ఆ ప్రపంచంలోకి చాలామంది తొంగి చూడరు. నేనూ అంతో ఇంతో రచయితను కనుక నాకు అందులోకి వీసా దొరుకుతుంది.

07/09/2016 - 22:00

మనిషి ఇది తిండి అని తెలియకుండానే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు తినడం మొదలుపెట్టాడు. తలుచుకుంటే భయం కలుగుతుంది కానీ ఆ ప్రయత్నంలో తినకూడని తిండి పదార్థాలను తిని మొదట్లో ఎంతమంది పోయారో తెలియదు. మొత్తానికి మొదట్లో కూడా తినదగిన, తినదగని పదార్థాల గురించి పరిశీలన, పరిశోధన జరిగింది. సాధారణంగా దుంపలు చప్పగా ఉంటాయి. కాయలు చప్పగా, కొన్ని పుల్లగా ఉంటాయి.

07/02/2016 - 22:45

ప్రకాశం ఇనిస్టిట్యూట్ అని ఒక సంస్థ ఉంది. వాళ్లు ఒక సందర్భంలో సైన్స్ రచనలను గురించి వారంపాటు ఒక వర్క్‌షాప్ నడిపించారు. నేను అప్పుడు ఉద్యోగంలో ఉన్నాను. కనుక ప్రతి నిత్యమూ వెళ్లి అక్కడ పాల్గొనే అవకాశం లేదు. ఆ కార్యక్రమాన్ని ప్రతిపాదించి నడిపించిన పెద్దమనిషికి నామీద మంచి అభిప్రాయమే ఉన్నట్టుంది. ఒకరోజు నా ఉపన్యాసం కూడా ఏర్పాటు చేశారు.

06/26/2016 - 01:36

మనిషికి తన తోటిదే ప్రపంచం. తానున్నందుకే ఈ ప్రపంచం కూడా బాగుందనుకుంటాడు. చివరకు దేవుడిని కూడా తన రూపంలోనే ఊహించుకున్నాడు మనిషి. ఇక తమ గురించి తాము ఆలోచిస్తూ ఉంటే మనుషులకు తాము మాత్రం చాలా మామూలుగా ఉన్నామని, మిగతా వారంతా విచిత్రంగా ఉన్నారని అనిపిస్తుంది. ఆ మిగతా వారు కూడా వారికి మిగతా వారి గురించి అదే మాట అనుకుంటారు. అప్పుడు ఆ మిగతాలో మనం మిగులుతాం.

Pages