S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

09/15/2018 - 17:29

కాలక్షేపం కోసం పాడుకునే గాయకులకూ, పాండిత్యమే ప్రధాన లక్ష్యంగా సాధనా బలంతో రసజ్ఞులను మెప్పించే విద్వాంసులకూ తేడా ఉంటుంది. సంగీతం విద్యగా భావించి సద్గురువుల సామీప్యంలో దేహంలోని శక్తినంతటినీ కరగించి కష్టించి కఠోర సాధనతో సంగీతమే ప్రాణంగా భావించి పాడేవారి ప్రతిభా సామర్థ్యాలు అందరూ గుర్తించలేరు.

09/01/2018 - 18:39

సంగీతం కొందరికి భోగవస్తువు. చేతులూ కాళ్లూ ఆడిస్తూ నోటికొచ్చిన పాటలేవో పాడుతూ నృత్య వినోదాలతో మైమరిచిపోయే వారికి, అదో కాలక్షేప విద్య.
దానికి మరే ఇతర ప్రయోజనమంటూ ఉండదు. సాహిత్యం, సంగీతం శాస్తబ్రద్ధంగా వుండాలనే నియమాలేమీ ఉండవు. ఆ సంగీతం కేవలం ‘్ధ్వని’ ప్రధానమే. అంతే. వాటికి రంగు, రుచి ఏమీ ఉండవు. మనసులోకి ప్రవేశించవు. చెవితో విని వదిలేయటమే.

08/25/2018 - 18:07

నిన్నటియాకలి నేడూ ఉన్నది/ కన్నదినంబె కడ చనెను/ పన్ని నిదుర, మాపటికి నున్నదదె/ యెన్నగ రాతిరి యెందోపోయ’/ ఎన్నడు తెలిశేము ఎచ్చరిక ఎపుడో? అంటాడు, అన్నమయ్య.
ఆకలేస్తుంది. అన్నం తింటాం. ఆ పూటకది సరి. పూట గడిచిందా? మళ్లీ అదే ఆకలి. మళ్లీ తింటాం. ఎంత తిన్నా పరగడుపే. సంగీత జ్ఞానం కూడా ఒక ఆకలి’. ఎన్నిసార్లు ఎంత తిన్నా జిహ్వ రుచులను కోరుతూంటుంది. ఎంత పాడినా, ఏదో కొత్త రకం కోరుతుంది.

08/18/2018 - 21:08

మూడు పదుల వయసు దాటకుండానే ‘సత్సంగత్వే నిస్సంగత్వం’ అన్నాడు మహానుభావుడు ఆదిశంకరుడు. జీవితసారం మొత్తం ఆ మాటలో ఉంది. 1970లో విశాఖపట్నం ఆకాశవాణిలో నేను పనిచేసే రోజుల్లో బొజ్జా కృష్ణశాస్ర్తీ అనే మిత్రుడొకాయన వుండేవాడు. మిన్ను విరిగి మీద పడినా ఎక్కడా చలించేవాడు కాదు. నిబ్బరంగానే ఉండేవాడు. పైకి ఏదో గబగబా మాట్లాడినా అంతరగంలో ఎన్నో గంభీర భావాలుండేవి. దేవులపల్లి వారి పాటలంటే ప్రాణం.

08/11/2018 - 21:22

వినీలాకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల సమూహాన్ని ఒక్కోసారి తేరిపార తదేక దృష్టితో చూడాలనిపిస్తుంది. ఆ పక్షికున్న స్వేచ్ఛ నిజంగా మనిషికి లేదనిపిస్తుంది.

08/04/2018 - 20:45

మనిషి నాలుగు రీతులుగా సమాజంలో బ్రతుకుతూంటాడని శాస్త్రం చెబుతోంది. సహజంగా ఏర్పడే గుణాలు పుట్టుకతోనే వస్తాయి. వాటికి మనిషి కారణం కాదు. మనిషి అలవాటు చేసుకుంటే ఏర్పడే గుణాలు కొన్ని వున్నాయి. ప్రధానంగా దైవభక్తి, దేశభక్తి సహజంగానే పుట్టాలి. ఒకరు చెబితేనే రావు.

07/28/2018 - 18:29

కవులకూ, గాయకులకూ సమాజానికీ కాలాతీతమైన అవినాభావ సంబంధం ఏదో ఉంది. పుట్టుకతోనే కవులుగా జన్మించిన వారున్నారు. నలుగురినీ చూసి కవిత్వం అలవాటు చేసుకున్న కవులున్నారు. భాష మీద పట్టున్నా, సంగీత సాహిత్యాలు రెండూ తెలిసిన కవులూ, గాయకులు సాధారణంగా అరుదుగా వుంటారు. సంగీత హృదయమున్న కవీ, కవి హృదయమున్న గాయకులు మరీ అరుదు.

07/21/2018 - 20:32

ఏం పాడుతున్నారు? ఎలా పాడుతున్నారనే దానిపైనే ‘పాట’ స్థాయి ఆధారపడి ఉంటుంది.
నాభి నుంచి హృదయం, కంఠస్వరాల మీదుగా రసనాడుల మీద నర్తించే మాటలకు నాదం తోడైతే వినబడేది నిత్య శుద్ధ చైతన్యంతో కూడిన పాట.
దట్టమైన మేఘాలావరించి, ఒక్కసారిగా కుంభవృష్టి వర్షం కురిస్తే మరి మబ్బులు కనిపించవు-

07/14/2018 - 21:46

మనిషి ఎందుకు గుడికి వెళ్తాడు? మనసు బాగోలేక. మనసెందుకు బాగోలేదు? మాయదారి బ్రతుకు కాబట్టి. ఇది అనుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా అక్షరాలా నిజం. ‘మాయధారి’ వల్ల మాయదారుల్లో వాటి జల్తారుల్లో మనం ఈ లోకంలో ప్రవేశించాం. మనం మాత్రమే కాదు. కదిలీ కదలని ప్రతి ప్రాణీ అలా వచ్చి చేరిందే. కాకపోతే కాస్తో కూస్తో ఆలోచనా శక్తి వున్న ప్రాణి మాత్రం ఒకొక్కసారి ఆలోచిస్తూంటాడు. నేనెందుకిలా అవుతున్నాను?

07/07/2018 - 23:54

‘గతకాలమె మేలు వచ్చు కాలము కంటెన్’
కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, లలిత శాస్ర్తియ సంగీతం, సినిమా సంగీతం అంటూ రకరకాల బాణీలున్నా, ఎవరికి నచ్చిన సంగీతం వారు వింటారు. ప్రతి జిహ్వకీ ఒక రుచి ఉంటుంది గదా! అలాగే సంగీతంలో కూడా ఉంటుంది. ఒకరికి నచ్చిన పాట అందరికీ నచ్చకపోవచ్చు.
ఇక్కడ వాడైన త్యాగరాజు అక్కడ తమిళనాడులో స్థిరపడి, తెలుగు భాష తెలియని శిష్యుల్ని తయారుచేయటమో వింత.

Pages