S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

02/25/2017 - 21:28

భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. సంప్రదాయాల ముసుగులో చిక్కుకుపోయిన మహిళల్లో చాలామంది ఓటువేయడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఓ మహిళ మేలిముసుగు ధరించి బయటకు వచ్చి ఎంచక్కా ఓటువేసింది. ముఖానికి ఇలా చీరకొంగు కప్పుకోవడం సంప్రదాయమే కానీ ఓటువేయడం బాధ్యతని నొక్కిచెప్పింది.

02/25/2017 - 21:27

ఇక్కడ గోడమీద కనిపిస్తున్నవి త్రీడి ఎఫెక్టుతో చిత్రించిన బొమ్మలు. 2020 సమ్మర్ ఒలింపిక్స్‌కోసం నిర్మిస్తున్న ఆర్చరీ స్టేడియంలో రక్షణ గోడలపై ఇలా బొమ్మలు వేస్తున్నారు. జపాన్‌లోని టోక్యోలో ఇవి ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వచ్చే ఒలింపిక్స్‌ను జపాన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

02/25/2017 - 21:23

ఈ ఫొటో చూస్తే ఏదో కళాకృతిలా ఉందికదూ! కానీ కాదు. జలకాలాటల దృశ్యమూ కాదు. జాగ్రత్తగా చూస్తే విషయం బోధపడుతుంది. జర్మనీలోని లీప్‌జిగ్‌లో నిర్వహించిన మహిళల లాంగ్‌జంప్ పోటీల్లో పాల్గొన్న లూయిసా బొడెమ్ గెంతినపుడు ఇసుక ఇలా ఎగిరిపడిందన్నమాట. అదో అందమైన దృశ్యంలా కనిపించడంతో ఫొటోగ్రాఫర్ కెమెరాకు పనిచెప్పాడంతే.

02/19/2017 - 04:31

గొరిల్లాలు మనిషికి అతి దగ్గరి జీవులు. మన డిఎన్‌ఎకు వాటి డిఎన్‌ఎలకు తేడా కేవలం రెండు శాతమే. సౌంజ్ఞలు, సంకేతాలను బాగా అర్థం చేసుకోగల గొరిల్లాలు యుక్తవయస్సులో ఉన్నప్పుడు చెట్లపై నివాసాలను ఆకులు, కొమ్మలతో అల్లుకుంటాయి. వయసు పెరిగే కొద్దీ నేలపై గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. ఏ గొరిల్లా అయినా ఒకసారి వాడిని గూడును మరోసారి వాడదు. భద్రత కోసమే అవి అలా చేస్తాయి.

02/19/2017 - 02:40

ఆధునిక ప్రపంచంలో విభిన్న ఆలోచనలకు, సృజనాత్మకతకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మామూలు హోటళ్లలో తింటే ఏం మజా, స్విమ్మింగ్ పూల్‌లో నీటి అడుగున ప్రేయసితో కలసి విందారగిస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచన కొందరికి వచ్చింది. అంతే బెల్జియంలోని బ్రసెల్స్‌లోని ఓ హోటల్ వారు స్విమ్మింగ్ పూల్ అడుగున ఓ కేజ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. గుండ్రటి గాజుగోళాల్లో ఈ విందు ఆరగించవచ్చు.

02/19/2017 - 02:38

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఈ మధ్య చైనీయుల లాంతర్ల ఫెస్టివల్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన విభిన్నమైన రంగుల్లో, రూపాల్లో తయారు చేసిన లాంతర్లు ఇవి. వీటినన్నింటినీ కేవలం చేతులతో మాత్రమే రూపొందించారంటే నమ్మాల్సిందే. చాంద్రమానం ప్రకారం వచ్చే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇలా లాంతర్ల పండుగ నిర్వహించుకోవడం చైనీయుల సంప్రదాయం.

02/11/2017 - 21:55

మనకైతే ఇప్పుడిప్పుడే ఎండలు మొదలవుతున్నాయి కానీ ఆస్ట్రేలియాలో ఇప్పటికే వేసవి ముదిరిపోయింది. మెల్‌బోర్న్‌లో ఇప్పుడు పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. తాపం తట్టుకోలేక ఇదిగో ఇలా జనం జలకాలాడుతున్నారు. నీళ్లలో మునిగి ఇలా తల బయటకు తీసినప్పుడు అతడి తలకట్టు ఇలా కనిపించింది. ఇది మెల్‌బోర్న్ తీరంలో తీసిన చిత్రం.

02/11/2017 - 21:54

ఆధునిక కాలంలో సెల్ఫీలు తీసుకోవడం ఓ సరదా అయిపోయింది. నిజానికి ఈ సరదా కాస్తా వ్యసనం అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. చివరికి బౌద్ధ బిక్షువులకూ సెల్ఫీ ముచ్చట తీర్చుకోవాలనిపించింది. ఇదిగో సిచువాన్‌లో బౌద్ధ బిక్షువులు తమలాంటి ఓ బొమ్మతో సెల్ఫీ తీసుకుని ముచ్చటపడ్డారు.

02/11/2017 - 21:53

ఔను ఇతడిని అంతా మాగ్నెట్ మ్యాన్ అనే పిలుస్తారు. ఎందుకంటే ఇళ్లల్లో ఉండే చాలా వస్తువులు, పరికరాలను అతడి శరీరం ఆకర్షిస్తుంది. కొన్ని రకాల లోహాలను అయస్కాంతం ఆకర్షిస్తుందని అందరికీ తెలుసు. కానీ ఇతడి శరీరం ప్లాస్టిక్ వస్తువులనూ ఆకర్షిస్తోంది. అదే విశేషం. రిమోట్‌లు, ఫోర్కులు, ప్లాస్టిక్ చెంచాలు, పళ్లాలు, పింగాణీ పాత్రలు వంటివి అతడి శరీరంపై ఎక్కడ పెట్టినా అతుక్కుపోయినట్లు ఉంటాయి.

01/28/2017 - 21:24

ఇక్కడ ఓ తలను చేతిలో పెట్టుకున్న మొండెం కనిపిస్తోంది కదూ! ఇది ఏ మ్యాజిక్ షోలోని దృశ్యం కాదు సుమా!. విభిన్నమైన దుస్తులను ప్రదర్శించే కాస్ట్యూమ్స్ షో. కాలిఫోర్నియాలోని శాంతామోనికాలో ఈమధ్యే నిర్వహించిన ఈ ప్రదర్శనకు ప్రఖ్యాత డిజైనర్ టిజెమిల్లర్ ఇలా దర్శనమిచ్చాడు.

Pages