S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

06/22/2017 - 23:27

ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో ఇటీవల జరిగిన తీవ్రవాదుల దాడిలో 22మంది మరణించారు. వీరికి ఓ కళాకారుడు తనదైన రీతిలో నివాళి అర్పించాడు. ప్రఖ్యాత గ్రాఫిటీ కళాకారుడు ‘క్యూబెక్’ మాంచెస్టర్‌లోని ఓ కూడలిలో ఇంటి గోడపై 22 తేనెటీగల బొమ్మలు వేశాడు. వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన మాంచెస్టర్‌లో ప్రతి ఒక్కరిని తేనెటీగతో పోలుస్తారు. అసలు హనీ బీ అన్న పేరు మాంచెస్టర్ వాసులు గర్వంగా చెప్పుకుంటారు.

06/22/2017 - 23:25

ఈ మధ్య వేసవిలో ఎండలు దంచికొట్టాయి. చైనాలోనూ సూర్యుడి ప్రతాపం ఎక్కువగానే ఉంది. దీంతో అక్కడి వాటర్ పార్కులు వివిధ వినూత్న కార్యక్రమాలు నిర్వహించి సందర్శకులను ఆహ్వానించాయి. వూహెన్‌లోని ఓ వాటర్ పార్కులోని కొలనుల్లో ఇలా బంతులు నింపేశారు. వాటివల్ల ఎండ నేరుగా నీటిని తాకదన్నమాట. దీనితో నీళ్లు చల్లగా ఉంటాయి. పైగా చూడటానికి చక్కగాను, ఆడుకోడానికి వీలుగాను ఉందికదూ ఈ బంతుల కొలను.

06/18/2017 - 22:37

బ్యాంకాక్‌లోని కొఖేవ్ జంతు ప్రదర్శన శాలలోని ఓ కొలనులో ఓ ఏనుగు ఈతకొట్టింది. ఆ దృశ్యాన్ని ఓ చిన్నారి ఎంతో ఇష్టంగా తిలకించింది. ఈ ఎనిమిదేళ్ల ఆసియాజాతి ఏనుగు పేరు శాండో. కొఖేవ్ జంతు ప్రదర్శన శాలలో మావటి పర్యవేక్షణలో ఈ ఏనుగు ఈతకొట్టడం ప్రత్యేక ఆకర్షణ.

06/18/2017 - 22:36

బ్రెజిల్‌లో అవినీతి పెచ్చుమీరిపోయింది. సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడిపైనే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార పీఠంపై ఉన్న నాయకులు వైదొలగాలన్న ఆందోళనలు ఊపందుకున్నాయి. అందులో భాగమే ఈ మాస్క్‌లతో నిరసన. అవినీతి నాయకులను గద్దెదించాలని బ్రెజిల్‌లో ఆందోళనకారులు ఇలా మాస్క్‌లు ధరించి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

06/18/2017 - 22:34

స్కాట్లండ్‌లో ఇప్పుడు కళాకారుల పండుగ జరుగుతోంది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన 28 మంది, చైనాకు చెందిన ముగ్గురు కళాకారులు తాము రూపొందించిన కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు.

06/04/2017 - 01:07

స్కాట్‌లాండ్‌లో ప్రఖ్యాత శిల్పి ఆండీ స్కాట్ రూపొందించిన ఈ జోడు గుర్రాలను ‘ది కెల్పీస్’ అని పిలుస్తారు. 100 అడుగుల ఎత్తుతో, ఒక్కోటి 300 టన్నుల ఇనుముతో రూపొందించారు. హెలిక్స్‌లోని కేరన్ నదికి సంబంధించిన ఫోర్త్ అండ్ క్లైడ్ కాలువలపై వీటిని నిర్మించారు. ఈ కాలువలు చుట్టుపక్కల ఉన్న 16 ప్రాంతాలను కలుపుతూంటాయి. ఈ జోడుగుర్రాల శిల్పాలు కాలువలపై ఉంటాయి.

06/04/2017 - 01:05

ఆస్ట్రేలియాలోని సిడ్నీ, ఇతర ప్రాంతాల్లో ఇప్పుడు వెలుగు వేడుక జరుగుతోంది. ఏటా మే చివర్లో నిర్వహించే ‘వివిడ్ సిడ్నీ లైటింగ్ ఫెస్టివల్’కు ప్రపంచ ఖ్యాతి ఉంది. ఈ సందర్భంగా అక్కడ చిన్నాపెద్ద సంస్థలన్నీ విద్యుద్దీపకాంతులు వెదజల్లేలా ఏర్పాట్లు చేసుకుని పండుగ చేసుకుంటారు.

06/04/2017 - 01:04

సాధారణంగా ఏ కోతైనా, ఎంత పెద్దదైనా పది కిలోల బరువుకు మించదు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ కోతి రెండేళ్ల వయసులోనే పది కిలోల బరువుదాటేసింది. ప్రస్తుతం దాని బరువు 15 కిలోల పైమాటే. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ కాలువల మార్కెట్‌లో ఇది తిరుగుతోంది. అక్కడికి వచ్చే పర్యాటకులు ఇచ్చే తినుబండారాలు తినీతిని ఇలా తయారైందన్నమాట. ఇక లాభం లేదనుకున్న అటవీ, పర్యాటక శాఖ అధికారులు దానిని ఓ ప్రత్యేక శిబిరానికి తరలించారు.

05/20/2017 - 20:44

ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ప్రఖ్యాత స్టార్‌వార్ సినిమాలు, టీవీ కార్యక్రమాలు పరిచయమై చాలాకాలం గడచిపోయింది. మే 4న స్టార్‌వార్స్ డేగా పాటించడం పరిపాటైంది. అందులో భాగంగా సింగపూర్‌లో ఇలా విద్యుద్దీపకాంతులు విరజిమ్మే పిల్లర్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.

05/20/2017 - 20:43

ఈ ఫొటోలో కనిపిస్తున్న శునకం పేరు మోలి. లాబ్రడార్ జాతికి చెందినది. జాగ్రత్తగా గమనిస్తే దాని కూనలతోపాటు ఓ రెండు పందిపిల్లలకూ పాలిస్తున్న దృశ్యం గోచరిస్తుంది. తన పిల్లలతోపాటు వాటికీ పాలిచ్చి, ఆడుకోవడం చూసేవారిని అబ్బురపరుస్తోంది. ఆరుపిల్లలు పుట్టిన తరువాత తల్లి మరణించడంతో అనాధలైన వాటిలో రెండింటిని ఈ శునకం వద్దకు చేర్చారు మోలీ సంరక్షకులు కెరెనా స్పియర్, అడమ్ జంబోర్స్కి.

Pages