S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

12/31/2016 - 19:31

మత్స్యకన్యల్లా తయారై ఈతకొట్టి సేద తీరుతున్న ఈ ముద్దుగుమ్మలు పర్యాటకులకు పెద్ద ఆకర్షణగా మారారు. ఫ్రాన్స్‌లోని పారిస్ నగరం ఫ్యాషన్ ప్రపంచానికి రాజధాని అని అందరికీ తెలిసిందే. అక్కడ మగువలు క్షణక్షణానికీ దుస్తులు, అలంకరణలతో వినూత్నంగా కనిపించేందుకు ఇష్టపడతారు. ఇదిగో ఆ నగరంలోని ప్రఖ్యాత డిలఆర్క్ సరస్సులో మత్స్యకన్యల్లా దుస్తులు ధరించి ఈతకొట్టి గట్టున సేదదీరుతున్నారు ఈ మగువలు.

12/25/2016 - 00:34

ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే వంటావార్పు, తిండీతిప్పలతో విసుగొచ్చేస్తుంది ఎవరికైనా. ఒక్కోసారి బయట హోటల్స్‌కు వెళ్లి తింటే కాస్తంత ఉత్సాహం వస్తుంది. ఎప్పుడూ హోటల్‌కేనా...ఏదో ఒక్క కొత్తదనం లేకపోతే జీవితం బోర్ కొట్టేస్తుందనేవారూ ఉంటారు. అదిగో..అలాంటివారికోసం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఓ హోటల్‌ను ఏర్పాటు చేశారు.

12/25/2016 - 00:33

అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల..ఏదీ కవితకు అనర్హం కాదన్నాడు మహాకవి. కళాకారులకూ ఆ సూత్రం వర్తిస్తుంది. మట్టితో కొందరు, ఇసుకలో మరికొందరు అద్భుత కళాఖండాలు సృష్టిస్తే ఇంకొందరు దారుతో, రాయితో శిల్పాలు మలుస్తారు. ఆధునిక ప్రపంచంలో మంచుతో కళాఖండాలు సృష్టించడం ఓ ఫ్యాషన్‌గా మారింది. చైనాలోని హర్బిన్ ప్రావిన్స్‌లో ఏటా జనవరిలో అంతర్జాతీయ మంచు శిల్పాల వేడుక, పోటీ నిర్వహిస్తారు.

12/25/2016 - 00:31

శీతాకాలంలో మామూలు చలికే మనం గజగజ వణికిపోతాం. కానీ చైనాలోని సబ్ ఆర్కిటిక్ వాతావరణం ఉండే హిలాంగ్జియన్ ప్రావిన్స్‌లో ఒక్కోసారి ఉష్ణోగ్రత -32 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతూంటుంది. అక్కడి సరిహద్దుల్లో రక్షణ బాధ్యతలు చేపట్టే సైనిక సిబ్బంది జీవితం కత్తిమీద సామే. అక్కడ ప్రకృతే వారికి నిజమైన శత్రువు. ఊలుతో చేసిన ఎన్ని దుస్తులు వేసుకున్నా మంచుతో తడవాల్సిందే.

12/25/2016 - 00:29

ధారాళంగా మంచు కురిసే ప్రాంతాలలో సైబీరియా ఒకటి. శీతాకాలంలో ఆ ప్రాంతం ధవళకాంతులతో మెరిసిపోతుంది. నిరంతరం కురిసే మంచుతో అక్కడి వస్తువులు, కొండలు, చెట్లు, గుట్టలు నిండిపోతాయి. అదిగో అలా మంచుతో కప్పబడిపోయిన ఓ రెండు వాహనాలపై గాలి వీచినప్పుడు తొలగిన మంచుతో ఇలా అందమైన రూపం వచ్చింది. బాగుందికదూ!

12/18/2016 - 00:29

ఫొటో కోసం ఫోజిచ్చినపుడు కెమెరామన్ ఓ సలహా ఇస్తాడు... స్మైల్ ప్లీజ్ అని. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఓ మర్కటానికి కెమెరామన్ అమిత్ షా సలహా ఇవ్వకుండానే ఇలా నవ్వుతూ ఫోజిచ్చింది. ఇండోనేషియాలోని టన్‌కొకొ జాతీయ పార్కులోని ఈ మర్కటాన్ని మచ్చిక చేసుకోవడానికి షా చాలా రోజుల పాటు అక్కడే మకాం వేశాడు. చివరకు కాస్తంత అలవాటయ్యాక ఇదిగో ఇలా నవ్వుతూ ఫోజిచ్చింది. దీని పేరు రాంబో.

12/18/2016 - 00:27

రద్దీ లేని ప్రశాంత వాతావరణంలో... జిలుగు వెలుగులున్నా కాస్తంత చాటు, మసక ఉంటే ప్రేమపక్షులకు పండుగే. ఇదిగో ఏటా జపాన్‌లో అలాంటి వాతావరణంతో, ఎల్‌ఇడి వెలుగుల పండుగ జరుపుతారు. సన్నని గోర్జీల్లాంటి ప్రాంతాల్లో ప్రేమ జంటలు తిరుగాడేందుకు అవకాశం ఇస్తారు. అలా నిర్వహించిన ఎల్‌ఇడి ఎల్యూమినేటెడ్ కాన్‌యాన్ వేడుకలో ముచ్చట్లలో మునిగిపోయిన ఓ జంట ఇది.

12/18/2016 - 00:23

ఎడారి ప్రాంతాల్లో నీళ్లు దొరకవు. సహజ వనరులూ తక్కువగానే ఉంటాయి. విద్యుత్ ఉత్పత్తికి ఇది పెద్ద సమస్య. ఉన్న వాతావరణానే్న వినియోగించుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే మార్గాంతరం. చిలీలోని అటకామా ఎడారిలో అలాంటి ఏర్పాట్లే చేశారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది పంట పొలం కాదు. సోలార్ విద్యుత్ ప్లాంట్. ఓ ఎడారిలో ఇంత భారీ సోలార్ ప్లాంట్ మరెక్కడా లేదంటే నమ్మాల్సిందే.

12/18/2016 - 00:21

ఆ మధ్య రైస్‌బకెట్ ఉద్యమం ప్రపంచాన్ని ఊపేసింది. అలాంటిది కాదుగానీ, ఐస్‌బకెట్ వ్యవహారం అందరినీ ఆకట్టుకుంది. రష్యాలో ఏటా నిర్వహించే పోలార్‌బేర్ డే సందర్భంగా ఓ వేదికపై తమ పిల్లల్ని ఇలా మంచుముక్కల, ఐస్‌నీళ్లతో స్నానం చేయించేశారు వారి తల్లితండ్రులు. ఆ పిల్లలు కూడా అమ్మో చలీ.. అనకుండా ఎంచక్కా ఎంజాయ్ చేశారు.

12/11/2016 - 00:42

ఐస్ ముక్కను నాకుతూ చల్లదనాన్ని తన్మయత్వంతో ఆస్వాదిస్తున్న మర్కటం ముచ్చటగొలుపుతోంది కదూ!. మరోవైపు చేతిలోని ఆహారాన్ని మరో కోతి ఇష్టంగా తింటోంది కదూ! థాయ్‌లాండ్‌లో ఖేమెర శకం, అంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్లనాటి శిథిల ఆలయం ఫ్రాప్రంగ్ శమ్‌యాట్‌లో ఏటా కోతులకు భారీ విందు ఏర్పాటు చేస్తారు. దాదాపు 2వేల కిలోల పళ్లు, ఇతర తినుబండారాలు వాటికోసం అక్కడ ఏర్పాటు చేస్తారు.

Pages