S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

12/11/2016 - 00:39

ఇసుకలో పూడ్చివేసిన ఖడ్గమృగం కాళ్లు, కొమ్ము కన్పిస్తున్నాయి కదూ. నిజానికి ఇది నిజమైన ఖడ్గమృగం కాదు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ సముద్రతీరంలో ఓ కళాకారుడు ఇలా ఓ ఖడ్గమృగం ప్రతిమను ఇసుకలో పూడ్చివేసిన చందాన తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఆ కళాఖండం ఓ పెద్ద ఆకర్షణ.

12/11/2016 - 00:37

ఓ విమాన చక్రంలో విభ్రాంతి కలిగే భంగిమతో కన్పిస్తున్న ఈమె పేరు ఓల్గా మర్చెన్‌కోవా. పాశ్చాత్య నృత్యరీతిలో పెట్టిందిపేరైన ఈమె మంచి మోడల్‌గానూ పేరుపొందింది. లండన్-మాస్కోల మధ్య నడిపే బ్రిటిష్ ఎయిర్‌వేస్ డ్రీమ్‌లైనర్ బోయింగ్ 787-9 తరహా విమాన సర్వీసు ప్రచారం కోసం ఆమె ఇలా పోజిచ్చింది. విమానం ఎక్కకుండానే ఈమె పోజును చూసి చాలామంది గాలిలో తేలిపోయినట్లు ఫీలయ్యారు.

12/04/2016 - 07:18

మొహల్లా వేడుక సందర్భంగా బల్వంత్‌సింగ్ చేసే ‘తాండవం’ చూసేందుకు తండోపతండాలుగా జనం వస్తారు. ఈ వేడుకల్లో ఆయన ‘తలపాగా’ ప్రత్యేక ఆకర్షణ. 800 మీటర్ల వస్త్రంతో ఆయన తలకు చుట్టుకునే పాగా దాదాపు పది కేజీల బరువుంటుందని అంచనా. అంత భారీ తలపాగాతో ఒంటికాలిపై నృత్యం చేస్తూ యాత్రికులను ఆనందింపచేయడం బల్వంత్‌సింగ్ ప్రత్యేకత. ఈ మధ్య అమృతసర్‌లో మొహల్లా వేడుకల్లో ఇలా బల్వంత్‌సింగ్ కనిపించి అలరించాడు.

12/04/2016 - 07:14

ప్రపంచంలో అందరి అంచనాలకు విరుద్ధంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నెగ్గాడు. అయితే అతడి గెలుపు చాలామందికి ఒళ్లుమండిపోయేలా చేసింది. ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేని, తట్టుకోలేని లక్షలాదిమంది అమెరికన్లు ఆందోళనల బాట పట్టారు. అతడి సొంత భవన్ ‘ట్రంప్ టవర్’కు ఆ నిరసనల సెగ తాకింది. ఓ మహిళ ఇలా సంగీత వాద్యంతో పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది.

12/04/2016 - 07:04

సైకిల్ తొక్కడంలో విశేషం ఏముంటుంది? కానీ కైరోలో ఈ వ్యక్తి సైకిల్ సవారీలో ఓ ప్రత్యేకత ఉంది. వెదురుతో చేసిన భారీ ర్యాక్‌లో బన్‌లు పెట్టి, ఆ భారీ రొట్టెల తొట్టెను ఓ చేత్తో బ్యాలన్స్ చేస్తూ సైకిల్‌పై వెళ్లడం అతడి ప్రత్యేకత. వీధుల్లో తిరుగుతూ వాటిని విక్రయిస్తూంటాడు. నూటికి 90 శాతం ఆ రొట్టెల తొట్టె ఎప్పుడూ చేజార్చకపోవడం అతడికి గుర్తింపు తెచ్చింది.

12/03/2016 - 23:50

చైనాలో అందరికీ ట్రంప్ గుర్తొస్తున్నట్లున్నాడు. దేన్ని చూసినా ట్రంపే వారికి కన్పిస్తున్నాడు. ఈ మధ్య హోంగ్జౌ జూలో ని బర్డ్ సఫారీలో కన్పించిన ఓ పక్షిని చూసిన ఓ జర్నలిస్టు అది అచ్చం ట్రంప్‌లా ఉందంటూ ట్రంప్‌కు, దానికి ఉన్న పోలికలను వర్ణిస్తూ కథనాలు ప్రచురించాడు. దీంతో ఇప్పుడు ఆ పక్షిని చూడడానికి జనం క్యూకట్టారు.

12/03/2016 - 23:47

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యకి తపేరు తోఫర్ బ్రోఫై. పార్ట్‌టైమ్ కళాకారుడు. ఇతడి పక్కనే ఉన్న శునకం పేరు రోసెమ్‌బర్గ్. ఆ శునకం అంటే అతడికి ఇష్టం. తోఫర్ అంటే బర్గ్‌కూ అమితమైన ప్రేమ. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలకు చిహ్నం ఈ ఫొటో. ఒకేలా కనిపించేందుకు తరచూ విభిన్నరూపాల్లో దర్శనమిస్తూ వెబ్ మీడియాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు తోఫర్.

12/03/2016 - 23:46

స్వచ్ఛ్భారత్‌లాంటి కార్యక్రమమే బొలీవియాలో ఏళ్లతరబడి నిర్వహిస్తున్నారు. పరిశుభ్రమైన ప్రపంచం కోసం వారు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి కొత్త వస్తువులను ఉత్పత్తి చేయడం, పర్యావరణాన్ని రక్షించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై విద్యార్థులు, చిన్నారులలో అవగాహన, చైతన్యం కలిగించేందుకు ఏటా ‘్ఫక్‌లారిక్ డ్యాన్స్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూంటారు.

11/20/2016 - 00:27

అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకు అనర్హం అన్నాడు మహాకవి. కళకూ అదే గొప్పదనం ఉందంటున్నారు కొందరు. చిలీలోని శాంటియాగోలో ఈ మధ్య నిర్వహించిన ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన అంశం అందుకు ఓ ఉదాహరణ. కోడిగుడ్డు ఆమ్లెట్ వేసేందుకు సిద్ధం చేసినట్లు కన్పించే కళాకృతులను వరుసగా తీర్చిదిద్ది అందరినీ అబ్బురపరిచారు కళాకారులు. ‘జెయింట్ ఫ్రైడ్ ఎగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ కోసం వీటిని తీర్చిదిద్దారన్నమాట.

11/20/2016 - 00:26

ఉత్తర భారత దేశంలో ‘్ఛట్’ పూజ ఓ సంప్రదాయం. నేపాల్ ప్రజలకు ఇది ముఖ్యమైన పండుగ. సూర్యభగవానుడిని ఆరాధించే వేడుక ఇది. సమస్త శుభాలూ కలుగచేయాలని కాంక్షిస్తూ ఇలా సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. నవంబర్ 15 నుంచి మూడు రోజుల పాటు ఈ పూజలు నిర్వహిస్తారు. నేపాల్‌లో మధేశీలకు ఇది అతి ముఖ్యమైన పండగ. ఉత్తరభారత దేశంలోనూ దీనిని పాటిస్తారు.

Pages