S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

06/04/2016 - 21:27

ఆరుబయట, చల్లగాలి వీస్తూంటే, టీ తోటల్లో యోగా చేయడం ఓ గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు ఈ చిత్రంలో కన్పిస్తున్న అందగత్తెలు. చైనాలోని హంగ్జౌ ప్రాంతంలో ఓ టీవీ కార్యక్రమంకోసం వీరంతా ఓ టీ తోటలో ఇలా యోగా ప్రదర్శన చేశారు.

06/04/2016 - 21:26

ఈ దృశ్యం చూసి...కోతి చేష్టలంటూ తీసి పడేయకండి! చైనాలోని షెన్‌యాంగ్ పట్టణంలోని ఓ సైన్స్ రిసార్ట్‌లో ఇది సందర్శకులకు పెద్ద ఆకర్షణ. ఎందుకంటే అది ఓ చిన్న సైకిల్‌ను చక్కగా తొక్కుతూంటుంది. దానిని చూసేందుకు పెద్దసంఖ్యలో సందర్శకులు ఆ రిసార్టుకు వస్తూంటారు మరి.

06/04/2016 - 21:19

అచ్చం పనసపళ్లలా కన్పించే వీటిని డురియన్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. ఆగ్నేయ ఆసియాలో వీటిని ఎక్కువగా పండిస్తారు. బాగా పండినప్పుడు ఈ పళ్లు కుళ్లిన ఉల్లిపాయల్లా దుర్వాసన వెదజల్లుతాయి. రుచి తియ్యగానే ఉన్నా ఈ వాసన ఎవరూ భరించలేరు. ప్రపంచంలో డురియన్ పళ్ల సాగులో థాయ్‌లాండ్ అగ్రస్థానంలో ఉంది. సింగపూర్ సహా పలు ఆగ్నేయ ఆసియా దేశాల్లో బహిరంగ ప్రాంతాల్లో వీటిని పెంచడం, విక్రయించడం, వినియోగించడం నిషేధించారు.

06/04/2016 - 21:18

పర్యావరణానికి ఎంతో మేలు చేసే ‘డంగ్ బీటిల్స్’ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. జీవులు విసర్జించిన మలాన్ని క్షణాల్లో రీసైకిల్ చేసే ఈ బీటిల్స్ ప్రపంచానికి చేసే మేలుకు వెలకట్టలేం. ఏనుగు విసర్జించిన పేడను తినేందుకు క్షణాల్లో 16వేల డంగ్ బీటిల్స్ చేరిపోతాయి. అవి కేవలం రెండు గంటల్లో ఆ పేడను తరలించేస్తాయి.

06/04/2016 - 21:13

ఆస్ట్రేలియాలో అందరూ ప్రేమగా పెంచుకునే ‘డింగో’ డాగ్స్ మిగతా కుక్కలకు భిన్నంగా ఉంటాయి. ఇవి వేటకు ఉపయోగించే రకం. ఇవి మిగతా కుక్కల్లా అరవడం, మొరగడం చేయవు. తోడేళ్లలా ఇవి ఊళపెడతాయి. కుందేళ్లు, కంగారూలవంటి జంతువులను ఇవి వేటాడి చంపుతాయి. చాలామంది అందుకోసమే వీటిని పెంచుతారు. అయితే వీటి విశృంఖల వైఖరివల్ల చాలా జీవజాతులు అంతరించిపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి ఇవి ఈ దేశపు జంతువులు కావు.

06/04/2016 - 21:11

చూడటానికి అసహ్యంగా కన్పించే ఈ టాస్మేనియన్ డెవిల్స్‌కు వాటి అరుపువల్లే ఆ పేరు వచ్చింది. తీవ్రమైన స్వరంతో, భయంగొలిపేలా అరిచే ఈ జంతువుల పళ్లు చాలా బలంగా ఉంటాయి. లోహపు ఫలకాన్నికూడా కొరికేంత శక్తి వీటికి ఉంది. బతికున్న జంతువులనూ పట్టి పీక్కుతినే ఇవి వెంట్రుకలనూ వదలకుండా ఆరగించేస్తాయి. ఆస్ట్రేలియాలోని టాస్మేనియా దీవుల్లో మాత్రమే కన్పించే ఇవి కొవ్వును తోకల్లో నిల్వ చేసుకుంటాయి.

05/28/2016 - 23:12

పైభాగం కోలగా, దిగువభాగం వెడల్పుగా ఉండే పియర్స్ పళ్లు అందరూ చూసే ఉంటారు. కానీ అన్ని రకాల పియర్స్ అలానే ఉండవు. రూపం, రంగుల్లో చాలా తేడాలున్నాయి. పియర్స్‌లో దాదాపు 3వేల రకాలున్నాయి. క్రీస్తుపూర్వం 1134లోనే చైనాలో వీటిని సాగు చేశారు. స్టోన్‌సెల్స్‌తోకూడిన తెల్లని లేదా క్రీమ్ కలర్ గుజ్జుతో ఈ పండ్లు తేలికగా జీర్ణం అవుతాయి. చిన్నపిల్లలు కూడా తిని అరిగించుకోగలిగే స్థితిలో ఇది ఉంటుంది.

05/23/2016 - 03:12

ప్రకృతిలో అసలుసిసలు నీలిరంగులో కన్పించే అరుదైన ఫలం బ్లూబెర్రి. మన ద్రాక్షపళ్లలా కన్పించే ఈ బ్లూబెర్రీలంటే ఉత్తర అమెరికా వాసులకు పిచ్చి. వారి ఆహారంలో ఇవి ఓ భాగం. అచ్చమైన నీలిరంగుతో, బూడిదపట్టినట్లు కన్పించే ఈ పళ్లలో భారీగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మతిమరుపును పోగొట్టి, జ్ఞాపకశక్తిని పెంచే ఈ పళ్లు క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. వీటి రసం, తొక్కలతో మద్యం తయారు చేస్తారు.

05/23/2016 - 03:10

ఆసియాలో కన్పించే ఈ పక్షులను ‘టెయిలర్ బర్డ్స్’గా పిలుస్తారు. పొడవైన ముక్కు, ఆకర్షణీయమైన రంగులతో కన్పించే ఈ పక్షులు గూళ్లు అల్లుకునే విధానాన్ని బట్టి వాటికి ఆ పేరు వచ్చింది. ఆకులకు రెండు అంచులలో చిన్నచిన్న రంధ్రాలు చేసి పీచు, దారాలు చివరకు సాలెపురుగులు అల్లుకునే ‘సిల్క్’ తీగలతో కుట్టి గూళ్లు తయారు చేసుకుంటాయి. ఇవి చేసే రంధ్రాలు చాలా సన్నగా ఉంటాయి.

05/23/2016 - 03:08

బ్రిటన్‌లో అందరికీ పరిచయమైన ఈ పక్షి పేరు ‘రాబిన్’. అక్కడి ప్రజలకు ఎంతో ఇష్టమైన పక్షులు ఇవి. ఐరోపాతో సహా పలు దేశాల్లో కన్పించినప్పటికీ బ్రిటన్‌లో వీటి సంఖ్య, వీటికి ఆదరణ చాలా ఎక్కువ. బ్రిటన్ జాతీయ పక్షి కూడా అదే. అక్కడి పోస్ట్‌మెన్‌ను రాబిన్ పక్షులతో పోలుస్తారు. ఎందుకంటే వారి డ్రెస్‌కోడ్‌లో ఛాతీపై ఎర్రటి వస్త్రం ధరించడంతో ఆ పక్షులతో పోలుస్తారు.

Pages