S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

12/19/2016 - 21:54

ధృవ హిట్టయ్యంది. అందరూ అదే మాట అంటున్నారు. రామ్‌చరణ్‌కు హిట్టుపడిందన్న మీడియా టాక్ కూడా బాగానే వర్కవుట్ చేశారు. కానీ, ఇందులో హీరో స్టామినా ఎంత? అన్న ప్రశ్నకే సమాధానం లేదు. తనీ ఒరువన్ హిట్టుకు రీమేక్ ఒకటైతే, అరవింద్‌స్వామి విలనిజం, గ్రాండియర్ షూట్‌తో సినిమాకు ఆమాత్రం టాక్ వచ్చిందేమోగానీ, చరణ్ టాలెంట్ ఏమాత్రం ఏమీ లేదన్నది నిజం.

12/12/2016 - 21:53

అన్ని సినిమాలు ఒక్కలా ఉండవ్ -అంటూ గతంలో ఓ సినిమాకు టాగ్‌లైన్ పెట్టారు. అది పేలింది. సినిమా ఒకేలావున్నా, అప్పటికది వెరైటీ కనుక రిసీవ్ చేసుకున్నారు. అయతే, ఈ క్యాప్షన్ బేతాళుడికి సరిపోతుంది. విజయ్ ఆంటోనీ సినిమాలన్నీ ఒక్కలా హిట్ కావు అన్న విషయం అర్థమైంది.

12/05/2016 - 21:40

నిఖిల్, హెబ్బాపటేల్, నందితాశే్వత నటించిన ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కథలో కథనంలో వెరైటీగావుంది. ముఖ్యంగా (ఆత్మ)దెయ్యం మనిషిని ప్రేమించడం అద్భుతం. అంతేకాదు మాటలు పర్వాలేదు. సంగీతం శేఖర్‌చంద్ర తనదైన శైలిలో అందించారు. కొద్దిగా అక్కడక్కడా బోర్ సన్నివేశాలున్నా మొత్తానికి యావరేజ్‌గా ఆడి తీరుతుంది.

11/28/2016 - 21:32

గౌతమ్‌మీనన్, నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో నిరాశ పర్చింది. ఎంతో ఆలస్యంగా విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. రొమాన్స్, ప్రేమలతో మొదటి సగం పేలవంగా సాగింది. హీరోయిన్ పెద్ద నెగిటివ్ పాయింట్. రెండో భాగంలో యాక్షన్ సన్నివేశాలతో నింపి బోర్ కొట్టించారు. క్లైమాక్స్‌కు, కథకు ఏం సంబంధం లేదు. ఫొటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి.

11/21/2016 - 21:44

బాలీవుడ్‌లో విజృంభించిన ముదురు శృంగారం, ముద్దులు ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రవేశించాయి. బాలీవుడ్ ముద్దులు కాస్త లైట్‌గానే ఉంటున్నాయి. సదరు హీరోల భార్యల స్పందన ఏమిటో? శివాయ్ చిత్రంలో హీరో గాఢ చుంభన చూసి భార్య కాజల్ నిరసించింది. పెళ్లికాకముందు చిత్రించిన ముద్దుసీనును పెళ్లయ్యాక తొలగించాడు అక్షయ్‌కుమార్. భార్య ప్రతాపానికి జడిసి షారుఖ్ ముద్దులు మానేశాడు.

11/07/2016 - 21:38

గత కొంతకాలంగా తెలుగు పరిశ్రమను హారర్, ఆత్మనేపథ్య కథలు ఆవహింయి. పిచ్చి ముదిరి పెద్ద స్టార్లూ ఇలాంటి కథలపై మోజు పెంచుకున్నారు. దీంతో ఇతర భాషల్లోని హారర్ చిత్రాలు అనువాదాలుగా క్యూకట్టి దాడి చేస్తున్నాయి. ప్రేమకథాచిత్రమ్, త్రిపుర, గీతాంజలి, చిత్రాంగద, చంద్రకళ, శివగామిలాంటి చిత్రాలు విజయం సాధింస్తే, నిన్నగాక మొన్నవచ్చిన అభినేత్రి కూడా ఎంటర్‌టైన్‌చేసింది.

10/31/2016 - 20:55

దర్శకుడు పూరి ఎప్పుడూ స్పెషల్. అతని సినిమాల్లో హీరోలు కొత్తగా కనిపిస్తారు. హైపర్ డైలాగులు, దమ్ముతో విలన్లకు దడపుట్టిస్తారు. ఇదీ అతని మార్క్ మ్యాజిక్. -పూరి సినిమా విడుదలయ్యే ప్రతిసారీ ఆడియన్స్ ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇదే ఆశిస్తున్నారు. కానీ, సినిమా విడుదలయ్యాక అసలు విషయం తెలుస్తుంది. అన్ని సినిమాలూ ఒక్కలా ఉండవ్ అన్నట్టు.. పూరి నుంచి కూడా అన్నిసార్లు హిట్ సినిమాలే రావు.

10/24/2016 - 22:18

చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమమ్’ చిత్రం ప్రేమికులకు ఆనందం కల్గిస్తుంది. ఈ చిత్రంలో లెక్చరర్ పాత్రలో శృతిహాసన్ చూస్తుంటే ప్రేమ నిజంగా స్వర్ణమయంగా కనబడ్తుంది ఆ పాత్రలో. ఈ చిత్రంలో నాగచైతన్య ఆరితేరిన నటుడుగా విక్రమ్ పాత్రలో లీనం అయ్యాడు. అనుపమ పరమేశ్వరన్ నటన క్లాస్‌గా చాలా బావుంది. ఈ చిత్రంలో ఒకే ఒక్క డైలాగ్ మనసును గాయపరుస్తుంది.

10/17/2016 - 20:59

కథ, సినిమా అనుసరణ, నిర్వహణ:
ఎస్ భావన్నారాయణ
కళ: పియన్ మీనన్
ఎడిటింగ్: కెయస్‌ఆర్ దాస్
కెమెరా: హెచ్‌ఎస్ వేణు
స్టంట్స్: మాధవన్
నృత్యం: ఎకె చోప్రా
సంగీతం: కోదండపాణి
మాటలు: జి కృష్ణమూర్తి
దర్శకత్వం: జి విశ్వనాథం
నిర్మాత: వైవి రావు

10/17/2016 - 20:53

హీరో ఇమేజ్ కోసం కమెడియన్ సునీల్ పడుతోన్న కష్టానికి తగిన ఫలితం ఈసారీ అందలేదనిపిస్తోంది. హీరోగా రెండు మూడు హిట్లు తన ఖాతాలో వేసుకున్నా -మర్యాద రామన్నలాంటి హిట్లు సునీల్ టాలెంట్ కంటే రాజవౌళిలాంటి దర్శకుల ద్వారానే అందాయని చెప్పాలి. సునీల్ తనంతట తానుగా సాధించిన హిట్లు ఏమున్నాయని ప్రశ్నించుకుంటే -ఏమీ లేనట్టే. ఇంతకుముందు కృష్ణాష్టమి, ఆ తరువాత జక్కన్న.. ఇప్పుడు తాజాగా ‘ఈడు గోల్డ్ ఎహె’.

Pages