S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 03:16

ములుగు/ములుగుటౌన్, డిసెంబర్ 1 : సకల వనరులు కలిగి ఉన్న ములుగును జిల్లాగా ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ అశాస్ర్తియతకు నిదర్శనమని తెలంగాణ జెఎసి చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం పునరుద్ఘాటించారు. ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి, జెఎసి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని మహర్షి కళాశాల మైదానంలో జరిగిన ఆత్మగౌరవ భారీ బహిరంగసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

12/02/2016 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 1:నోట్లరద్దుతో దెబ్బతిన్న రంగాలను ఆదుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. నల్లధనం తొలగిస్తామని కేంద్రం చెబితే ముఖ్యమంత్రి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని చెప్పారు. రైతులపై ఈ ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెద్ద నోట్ల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపైన, కూరగాయలపైన ఎక్కువ ప్రభావం పడిందని చెప్పారు.

12/02/2016 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 1: రోడ్లు, భవనాల శాఖ పురోగతిపై సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు గురువారం శే్వత పత్రం విడుదల చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా తమ శాఖ సాధించిన పురోగతి, ఇంకా సాధించాల్సిన లక్ష్యాలను శే్వతపత్రంలో పేర్కొన్నారు.

12/02/2016 - 03:11

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి నీట్ల రద్దు గండి భారీగా పడింది. గత ఏడాది ఆగమేఘాల మీద సభ్యత్వం తీసుకున్న వారు సైతం ఈ ఏడాది రెన్యువల్ చేసుకోకపోగా, కొత్త సభ్యులను సైతం ఆకర్షించలేకపోయింది. ఉన్న సభ్యులను నచ్చచెప్పి చేర్పిద్దామనుకునేంతలో పులిమీద పుట్రలా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం వచ్చి పడింది.

12/02/2016 - 03:09

హైదరాబాద్, డిసెంబర్ 1: భూమి సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసే ముందు మార్కెట్ విలువను జిల్లా కలెక్టర్లు నిర్ధారించేందుకు తీసుకుంటున్న చర్యలపై వచ్చే మంగళవారం లోపల అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ పిల్‌ను మాజీ ఎమ్మెల్యే ఎ కోదండరెడ్డి దాఖలు చేశారు.

12/02/2016 - 03:08

హైదరాబాద్, డిసెంబర్ 1: అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చి (ఎఎండి) డైరెక్టర్‌గా ఎల్ కె నందా గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ ఎ కె రాయ్ పదవీ విరమణ అనంతరం ఈ పదవిని స్వీకరించిన నందా ప్రస్తుతం హెచ్ ప్లస్ స్థాయి సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.

12/02/2016 - 03:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 1:ఉగ్రవాద దాడుల మధ్య ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్తాన్‌కు భారత్ తెగేసి చెప్పింది.కాశ్మీర్‌లోని నగ్రొటా సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరింత కటువుగా తన స్వరాన్ని పాక్‌కు వినిపించింది.

12/02/2016 - 03:07

హైదరాబాద్, డిసెంబర్ 1: హైదరాబాద్‌లో ఓ ఆదాయపు పన్నుశాఖ అధికారి ఇంటిపై సిబిఐ అధికారులు గురువారం సాయంత్రం మెరుపుదాడులు జరిపారు. నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఐటి శాఖ అధికారి బొడ్డు వెంకటేశ్వరరావు ఇంటితోపాటు ఆయన సమీప బంధువులకు చెందిన నాలుగు ఇళ్లల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపి, ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు.

12/02/2016 - 03:05

హైదరాబాద్, డిసెంబర్ 1: సింగరేణి కాలరీస్‌లోని ఉద్యోగులకు జీతాల చెల్లింపునకు బ్యాంకు మేనేజర్లను సంప్రదించి ఉద్యోగులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి కాలరీస్‌లోని అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు సింగరేణి డైరెక్టర్ జె పవిత్రన్ కుమార్ ఆదేశించారు.

12/02/2016 - 03:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజ్యసభకు వచ్చినా ప్రతిపక్షం మాత్రం పెద్దనోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జరుగుతున్న చర్చను ముందుకు సాగించేందుకు అనుమతించలేదు. నల్లధనానికి ప్రతిపక్షం మద్దతు ఇస్తోందంటూ చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పేంతవరకు సభలో చర్చను సాగనివ్వమంటూ ప్రతిపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి గొడవ చేశారు.

Pages