S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 05:01

విజయవాడ, డిసెంబర్ 1: రాష్ట్రంలో హెచ్‌ఐవి ఎయిడ్స్ గురించి మొదటిగా ప్రస్తావించింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

12/02/2016 - 05:00

జి.కొండూరు, డిసెంబర్ 1: బంగారం వ్యాపారి హత్య కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. బాకీ తీర్చడం లేదనే కోపంతో స్నేహితులే నమ్మకంగా తీసుకొచ్చి కత్తితో పొడిచి చంపిన వైనం వెలుగు చూసింది. ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును త్వరగా ఛేదించిన సిఐ వెంకటరమణను, ఎస్‌ఐ డి రాజేష్‌ను, ఐడి పార్టీ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

12/02/2016 - 04:59

మచిలీపట్నం, డిసెంబర్ 1: బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూములు ఇవ్వడం లేదనే నెపంతో రైతుల పట్ల ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ధ్వజమెత్తారు. రైతుల నుండి బలవంతంగా భూములను ఎలాగైనా తీసుకునేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

12/02/2016 - 04:58

అవనిగడ్డ, డిసెంబర్ 1: మన దేశం మహోన్నత సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, అలాంటి దేశంలో నైతిక విలువలు దూరం కావటంతో ఎయిడ్స్ వ్యాధి విజృంభిస్తోందని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం దివిసీమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.

12/02/2016 - 04:57

మోపిదేవి, డిసెంబర్ 1: మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మహా కుంబాభిషేక పూర్వక మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుండి స్వామివారికి సుప్రభాత సేవ, గోపూజ, ఆలయ ప్రదక్షిణలు, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, తదితర పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం, నవగ్రహ మండపారాధనలు, సుబ్రహ్మణ్య అనుష్ఠానం నిర్వహించారు.

12/02/2016 - 04:55

నిర్మల్, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను గుర్తించి సామాన్య ప్రజలకు మొబైల్ ఏటి ఎం ద్వారా నగదును అందజేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య అన్నారు. గురువారం పట్టణంలోని పాత బస్టాండ్‌లో మారుతిమెగామార్ట్ యజమాని ఆమెడ దేవెంధర్ సొంత ఖర్చులతో మొబైల్ ఏటి ఎంను ప్రారంభించారు.

12/02/2016 - 04:53

వరంగల్, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దు జరిగి మూడువారాలు గడచిన వరంగల్ నగరంలో కొత్తనోట్ల కోసం ప్రజలకు తిప్పలు తప్పటం లేదు. ఏ బ్యాంకుకు వెళ్లినా డబ్బు లేదంటూ సమాధానం రావటం ఖాతాదారులకు ఇబ్బందికరంగా మారింది. గురువారం ఉదయం ఒకటి రెండు, బ్యాంకుల చెందిన శాఖలలో మినహా చాలా బ్యాంకులలో అందుబాటులో ఉన్నంత వరకు డబ్బు ఖాతాదారులకు అందచేసి ఆ తరువాత నో క్యాష్ అంటు బోర్డులు వేలాడదీసి కౌంటర్లు మూసివేసారు.

12/02/2016 - 04:49

సంగారెడ్డి టౌన్, నవంబర్ 1: గ్రామ స్థాయిలో నగదు రహిత లావాదేవిలను మెరుగుపర్చేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ సూచించారు. పెద్దనోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు.

12/02/2016 - 04:47

డిచ్‌పల్లి రూరల్, డిసెంబర్ 1: ముదిరాజ్ కులస్థులను బిసి-డి నుండి బిసి-ఎ గ్రూపులోకి మార్చేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. ఇందల్వాయి మండల కేంద్రంలో గురువారం ముదిరాజ్ సింహగర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహాన్ని లింగాపూర్ గ్రామంలో ఆయన ఆవిష్కరించారు.

12/02/2016 - 04:45

సూర్యాపేట, డిసెంబర్ 1: జిల్లాకేంద్రంగా మారి న సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్దికి సహకరిస్తానని, వివిధ అభివృద్ది పనులు చేపట్టేందుకు అధిక నిధులు మంజూరీ చేసేందుకు కృషిచేస్తానని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు.

Pages