S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 04:42

అనంతపురం, కడప జిల్లాల్లో సోమవారం వడదెబ్బకు ఐదుగురు మృతిచెందారు. కడప జిల్లా నందలూరులో కత్తికట్టు జయరామ్ (43), రైల్వేకోడూరు మండలం బయనపల్లెకు చెందిన కె సుబ్బరాయుడు (65), అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం తబ్జుల గ్రామానికి చెందిన నాగిరెడ్డి (70), ఓబులదేవరచెరువు మండలం తంగేడుకుంట గ్రామానికి చెందిన షేక్‌హుస్సేన్ (11), గోరంట్లకు చెందిన వెంకటేశు (55) వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు.

05/03/2016 - 04:42

మాచర్ల, మే 2: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసగించిన ఘనుడు చంద్రబాబునాయుడని వైయస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరవు ధర్నాలో బాగంగా సోమవారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు.

05/03/2016 - 04:42

కడప/కర్నూలు/అనంతపురం, మే 2: రాయలసీమ జిల్లాల్లో సోమవారం కూడా ఎండల తీవ్రత కొనసాగింది. అయితే ఆదివారం రాత్రి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిశాయి. కడప నగరంలో సోమవారం 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 42.2, నంద్యాలలో 41.8, ఆదోనిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

05/03/2016 - 04:41

రాజమహేంద్రవరం, మే 2: సీలేరు జలాలపై ఆధారపడిన తూర్పు గోదావరి జిల్లాలోని మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో నేటి నుండి ఉత్పత్తి నిలిపివేస్తున్నారు. నీటి కొరత కారణంగా విద్యుదుత్పత్తికి బ్రేకు పడింది. మంగళవారం నుండి 12 రోజులపాటు విద్యుదుత్పత్తి నిలుపుదలచేస్తూ జెన్‌కో అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

05/03/2016 - 04:40

విజయవాడ (ఇంద్రకీలాద్రి), మే 2: ఆగస్టులో రానున్న కృష్ణా నది పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు మొత్తం 415 కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎస్‌ఎస్ సుబ్బారావు తెలిపారు. సోమవారం ఉదయం ఆయన ఇక్కడ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

05/03/2016 - 04:40

తెనాలి, మే 2: గుంటూరు జిల్లా తెనాలిలోని పప్పుల మిల్లుల్లో జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సోమవారం తనిఖీలు నిర్వహించి 220 బస్తాల నిషిద్ధ కెమికల్స్ పౌడర్‌ను సీజ్ చేశారు. జిఎఫ్‌ఓ పూర్ణచంద్రరావు కథనం ప్రకారం.. తెనాలి పరిసర ప్రాంతాల్లోని పప్పుల మిల్లుల్లో ప్రభుత్వం నిషేధించిన సిల్కా, గ్లాసి, సోమ్ రకాల పౌడర్లను పప్పుల నిల్వలకు వాడుతున్నట్లు వారికి సమాచారం అందింది.

05/03/2016 - 04:39

కడప,మే 2: తెలుగుదేశం పార్టీ తీరుపై ఇక ప్రత్యక్ష పోరాటానికి రాయలసీమ బిజెపి నేతలు సిద్ధపడుతున్నారు. సీమలో విలయతాండవం చేస్తున్న కరవును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, తాగునీరు, పశువులకు దాణా కరవై కబేళాలకు తరలిస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదంటూ ఆందోళనకు బిజెపి నేతలు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

05/03/2016 - 04:38

విశాఖపట్నం, మే 2: విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రభుత్వం తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇక్కడ సుమారు 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూముల్లో 3,500 ఎకరాలు రైతులకు చెందినవి కాగా, మరో 1,500 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి.

05/03/2016 - 04:37

కర్నూలు, మే 2: కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరిపై తెలుగుదేశం పార్టీ నేతలు గురి పెట్టారు. వారిలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డిపై భారీ ఎత్తున ఒత్తిడి పెట్టారని, మరో వైపు నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్యతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని అధికార పార్టీలో చర్చ సాగుతోంది.

05/03/2016 - 04:36

విజయవాడ (కార్పొరేషన్), మే 2: నగరంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్న డిజిటల్ డోర్ నెంబర్ ద్వారా విస్తృత ప్రయోజనాలుంటాయని విఎంసి అదనపు కమిషనర్ (జనరల్) పి అరణ్‌బాబు పేర్కొన్నారు.

Pages