S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/10/2017 - 04:09

పీలేరు, డిసెంబర్ 9: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తన బద్ధ శత్రువును అధినేత చంద్రబాబు పార్టీలోకి అహ్వానించడం, తనకు కనీస సమాచారం కూడా లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీనాధ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

12/10/2017 - 04:08

విజయవాడ (ఇంద్రకీలాద్రి) డిసెంబర్ 9: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆదిపరాశక్తి, శ్రీ కనక దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం ఉదయం నుండి అమ్మవారి భవానీదీక్షల విరమణ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీక్షల విరమణకు సంబంధించి సుమారు 10కోట్ల రూపాయల వ్యయంతో భవానీలు, భక్తులకు కావాల్సిన సకల ఏర్పాట్లలను దేవస్ధానం ఇవో ఎ సూర్యకుమారి ఆధ్వర్యంలో ఇప్పటికే పూర్తి చేశారు.

12/09/2017 - 03:59

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వానికి 298 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రెవెన్యూ ఖాతాలో లోటును సర్దుబాటు చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించి ఈ మొత్తాన్ని విడుదల చేసింది.

12/09/2017 - 03:58

విజయవాడ, డిసెంబర్ 8: ప్రజా జీవితంలో ఉండే నాయకులు పారదర్శక పాలనలో భాగంగా వారి ఆస్తులు ప్రకటించాలని దేశంలోని మేధావులందరూ పదే పదే కోరుతున్నారని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నాయకుడు వర్ల రామయ్య శుక్రవారం అన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబం గత ఏడేళ్లుగా పార్టీ అగ్రనేత ఆస్తులే కాక కుటుంబ సభ్యులందరి ఆస్తులు ప్రకటిస్తున్నారంటూ శుక్రవారం ఒక ప్రకటనలో వర్ల పేర్కొన్నారు.

12/09/2017 - 03:58

విజయవాడ, డిసెంబర్ 8: తప్పుడు ఎన్నికల ధ్రువీకరణ పత్రాలు, ఫోర్జరీ సంతకాల నేపథ్యంలో అధ్యక్షుడు మత్తి కమలాకరరావును సంఘం నుంచి తొలగించటం మినహాయించి సంఘంలో ఎలాంటి చీలికలు లేవని, 13 జిల్లాల పీఆర్‌టీయు అధ్యక్షులు, కార్యదర్శులందరూ ఏకతాటిపై ఉన్నారని పీఆర్‌టీయు ఎమ్మెల్సీ ఫ్రంట్ ఫ్లోర్‌లీడర్ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు.

12/09/2017 - 03:57

విజయవాడ, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌లో కొనే్నళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని పలువురు ఉద్యోగులు శుక్రవారం విజయవాడలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మొర పెట్టుకున్నారు.

12/09/2017 - 03:34

పోలవరం, డిసెంబర్ 8: జాతీయ జల విద్యుత్ సం స్థ అధికార్ల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాం తాల్లో శుక్రవారం పర్యటించింది. ఢిల్లీ నుండి వచ్చిన బృందం సభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి తొలుత ప్రాజెక్టుకు సంబంధించిన నమూనాలను పరిశీలించారు. అనంతరం డయా ఫ్రం వాల్, స్పిల్‌వే నిర్మాణ ప్రాంతాన్ని, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు.

12/09/2017 - 03:32

ఆత్మకూరు, డిసెంబర్ 8: చిన్నారిని అంగన్‌వాడీ కేంద్రంలో ఉంచి తాళం వేసి వెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరులో శుక్రవారం వెలుగుచూసింది. తలుపువద్దకు వచ్చి ఏడుస్తున్న చిన్నారిని గమనించిన స్థానికులు తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని తాళం పగులగొట్టించి చిన్నారిని బయటకు రప్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

12/09/2017 - 03:30

విశాఖపట్నం, డిసెంబర్ 8: టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకునే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ-క్యాబినెట్‌ను ప్రవేశపెడుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ ఇండియన్ అండ్ డెవలెప్‌మెంట్(ఐఎస్‌టీడీ) విశాఖపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో నగరం లో ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన జాతీ య హెచ్‌ఆర్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

12/09/2017 - 03:29

తిరుపతి, డిసెంబర్ 8: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 130 నకిలీ రూ.500 నోట్లు, 950 నకిలీ బంగారు లక్ష్మీ కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి డీఎస్పీ మునిరామయ్య వెల్లడించారు.

Pages