S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/12/2017 - 03:48

విజయవాడ, డిసెంబర్ 11: రాష్ట్రంలో రెవిన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)గా పనిచేస్తున్న 3వేల మంది సిబ్బందికి టీఏ, డిఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో 1307, 1308ను జారీ చేసింది. రూ.20 నుంచి రూ.100ల వరకు టీఏ, రూ.100ల నుంచి రూ.300ల వరకు డీఏ పెరుగనుంది.

12/12/2017 - 03:48

విశాఖపట్నం, డిసెంబర్ 11: విమానయానాన్ని అందిరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు. వరల్డ్ బర్డ్‌స్రైక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బర్డ్, వైల్డ్‌లైఫ్ స్ట్రైక్ ప్రివెన్షన్ ఏవియేషన్ సేఫ్టీ అన్న అంశంపై విశాఖలో సోమవారం జరిగిన సౌత్ ఆసియా సదస్సులో ఆయన పాల్గొన్నారు.

12/12/2017 - 03:46

విజయవాడ, డిసెంబర్ 11: పోరాటాలు.. ఉద్యమాలు కాదు.. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కొన్ని దశాబ్దాలుగా వెంటాడుతూ వస్తున్న సమస్యలను అందరికీ ఆమోదయోగ్యమైన.. ఆర్థిక భారం లేకుండా తేలిగ్గా అమలు చేయగలిగిన సమస్యల పరిష్కారం కోసం అందరం కల్సి ఉద్యమించాలి.. ఆపై మార్పును సాధించాలంటూ లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు.

12/12/2017 - 02:58

విజయవాడ, డిసెంబర్ 11: సమాజంలో ఆదరణకు నోచుకోని హిజ్రాలకు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. వెలగపూడి సచివాలయంలో సాధికారమిత్రల నియామకంపై సెర్ప్ అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/12/2017 - 02:54

అమరావతి, డిసెంబర్ 11: కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు కొత్త సారథి రాహుల్‌గాంధీ వెలుగుతీసుకువస్తారా? ఆయన సారథ్యం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనీస గౌరవ స్థానం సంపాదించుకునేందుకు అక్కరకొస్తుందా? వలసబాట పడుతున్న సీనియర్లకు ఆయన నియామకం బ్రేకులు వేస్తాయా?.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న నేపథ్యంలో జరుగుతున్న చర్చ ఇది!

12/12/2017 - 00:25

విజయవాడ, డిసెంబర్ 11: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నిధులు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో భాగంగా రూ.318.22 కోట్లను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జలవనరుల శాఖ సమీక్షలో బిల్లులు పెడితే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పడం తెలిసిందే.

12/12/2017 - 00:24

విజయవాడ, డిసెంబర్ 11: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా రాహుల్‌గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ, నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన 5వ వ్యక్తిగా రాహుల్‌గాంధీ నిలుస్తారన్నారు.

12/12/2017 - 00:24

విజయవాడ, డిసెంబర్ 11: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు (పి.మధుకర్, సాయిజ్యోతి, మమత, జె.జ్యోతి) చైనాలో జరిగిన వరల్డ్ మెమరీ పోటీల్లో పాల్గొని 4వ స్థానంలో నిలిచారు. వీరు సోమవారం మంత్రి నక్కా ఆనందబాబును కలవగా, మంత్రి వారిని అభినందించి, సన్మానించారు.

12/12/2017 - 00:24

విజయవాడ, డిసెంబర్ 11: రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ మంజూరు చేసినందుకు కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీని మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ హబ్‌గా తయారు చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడించారు.

12/12/2017 - 00:23

విజయవాడ, డిసెంబర్ 11: కాపులను బీసీల్లో చేర్చే అంశం మీద కమిషన్‌లోని ముగ్గురు సభ్యుల విడివిడి ‘నివేదిక’లు ఆయా సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు అవుతాయే తప్ప అవి బీసీ కమిషన్ నివేదిక అర్హతని పొందజాలవని, వాటికి చట్టబద్ధత లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు స్పష్టం చేశారు. కమిషన్ చైర్మన్, సభ్యుల అభిప్రాయాలను క్రోడీకరించుకుని ఒక నిర్ణయానికి రావలసి ఉంటుందన్నారు.

Pages