S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/15/2019 - 04:40

విశాఖపట్నం (కల్చరల్), ఏప్రిల్ 14: విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలోని అంకోసా ఆడిటోరియంలో గొల్లపూడి 80 ఏళ్ళ జన్మదిన వేడుకుల్ని అశేష సాహితీప్రియుల నడుమ ఘనంగా నిర్వహించారు.

04/15/2019 - 04:38

అమరావతి, ఏప్రిల్ 14: రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం పరిశీలించింది. అరకు పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను శ్రీకాకుళం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరంలోని ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో లెక్కిస్తారు.

04/14/2019 - 06:08

అమరావతి, ఏప్రిల్ 13: ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. స్ట్రాంగ్‌రూముల పర్యవేక్షణ, భద్రత తదితర అంశాలపై శనివారం ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

04/14/2019 - 06:08

అమరావతి, ఏప్రిల్ 13: ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ హక్కు అయిన పౌరుల ఓట్లకు వైఎస్సార్ కాంగ్రెస్ తూట్లు పొడిచిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయటం ద్వారా పోలింగ్‌శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ పడరాని పాట్లు పడిందన్నారు.

04/14/2019 - 06:07

విజయవాడ, ఏప్రిల్ 13: ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌క వచ్చిన ఓటర్లు తిరిగి తమతమ గమ్యస్థానాలకు వెళ్లేందుకుగాను ఏపీఎస్ ఆర్టీసీ ఆదివారం 500 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల నుంచి ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపనున్నారు.

04/14/2019 - 05:43

జిల్లా మొత్తం పోలైన పోలింగ్
*
ఓట్లు ఓట్లు శాతం
శ్రీకాకుళం 2175176 1634399 75.14
విజయనగరం 1818113 1466775 80.68
విశాఖపట్నం 3578458 2569625 71.81
తూర్పుగోదావరి 4204436 3366754 80.08
పశ్చిమగోదావరి 3218407 2645336 82.19
కృష్ణా 3551938 2881274 81.12
గుంటూరు 3974491 3273928 82.37

04/13/2019 - 23:29

రాజంపేట, ఏప్రిల్ 13: పద్యం ద్వారా పరమార్థాన్ని చాటిచెప్పిన దిట్ట బమ్మెర పోతనామాత్యులు అని పలువురు వక్తలు అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాభాగవతాన్ని రచించిన బమ్మెర పోతన జయంత్యుత్సవాలు శనివారం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి.

04/13/2019 - 23:25

విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏప్రిల్ 15 నుండి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధం విధించినందున ఈ నిషేధ కాలంలో మత్స్యకారులకు పరిహారంగా రూ. 10వేలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లతో చేపల వేట చేసే వారికి పరిహారంగా ఒక్కొక్కరికి రూ.

04/13/2019 - 23:24

ఒంగోలు, ఏప్రిల్ 13 : ఈనెల 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశంలో తూర్పు తీరంలోని బంగాళాఖాతంలో చేపలవేట నిషేధంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేట నిషేధ ఉత్తర్వులు జీవో ఆర్‌టి నెంబరు 86 పశుసంవర్థక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్య్సశాఖ ద్వారా జీవోను విడుదల చేసింది.

04/13/2019 - 23:23

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 13: గోదావరి జిల్లాల్లో వర్జీనియా పొగాకు వేలం ప్రక్రియకు ఈ నెల 15వ తేదీ నుంచి మొదలు కానుంది. రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడులోని కేంద్ర పొగాకు వేలం కేంద్రం, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కేంద్ర పొగాకు వేలం కేంద్రంలోనూ వేలం ప్రక్రియ సాగనుంది.

Pages