S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/11/2019 - 04:46

పాడేరు, ఫిబ్రవరి 10: అన్ని రకాలు వైద్య పరికరాలు, విభాగాల కల్పన ద్వారా జిల్లా స్థాయి ఆసుపత్రిగా పాడేరు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రాథమిక ఆరోగ్య శాఖామంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ వెల్లడించారు.

02/11/2019 - 04:44

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 10: పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జూన్ నాటికి గ్రావిటీపై నీరిస్తామని చెబుతున్న ప్రభుత్వం హెడ్‌వర్స్ పనులతో పాటు ఎడమ ప్రధాన కాలువ (ఎల్‌ఎంసీ) పనులపై కూడా దృష్టిసారించాల్సివుంది. ఈ కాలువ పనులు కూడా పూర్తయితేనే నీరు అందించే వీలుంటుంది.

02/11/2019 - 04:32

తిరుపతి /ఒంగోలు / నెల్లూరు, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గో బ్యాక్, మోదీ కేడీ అంటూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన నినాదాలతో చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు హోరెత్తాయి.

02/11/2019 - 04:30

విజయవాడ, ఫిబ్రవరి 10: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. వామపక్షాలతో పాటు అధికార తెలుగుదేశం, యువజన, విద్యార్థి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విభిన్న రీతిలో నిరసనలు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వరకు జాతీయ రహదారి పొడవునా మోదీకి వ్యతిరేక ఫ్లెక్సీలు పెద్దఎత్తున వెలిశాయి. నల్లబెలూన్‌లు గాలిలో ఎగిరాయి.

02/11/2019 - 04:27

విజయవాడ (సిటీ), జనవరి 10: నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలుచేయాలని కోరుతూ మోదీ పర్యటన సందర్భంగా జనం రోడ్డెక్కి రోదిస్తుంటే ప్రతిపక్ష నేత జగన్‌మోదీరెడ్డి మాత్రం ఎక్కడా కనిపించడం లేదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. 26 కేసులకు భయపడి, దాక్కున్నారా?

02/11/2019 - 04:26

శ్రీకాకుళం, ఫిబ్రవరి 10: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా కళింగాంధ్ర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రెండో రోజు తన హాస్యంతో అలరించేందుకు వచ్చిన జబర్దస్త్ కమేడియన్ పొట్టి నరేష్ బృందంపై కొంతమంది ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించినమే కాకుండా, వారిని జాతీయ రహదారిపై దారికాసి దాడి చేసిన సంఘటన ఉత్సవాలే సిగ్గుపడేలా చేసింది!

02/11/2019 - 04:25

విజయవాడ, ఫిబ్రవరి 10: రానున్న పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధతపై సమీక్షించడానికి భారత ఎన్నికల సంఘం ప్రతినిధులు సోమ, మంగళవారాల్లో విజయవాడలో పర్యటించనున్నారు.

02/11/2019 - 04:25

విజయవాడ (గుణదల) ఫిబ్రవరి 10: విజయవాడలో జరుగుతున్న గుణదలమాత మహోత్సవాలకు రెండోరోజు ఆదివారం భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి లక్షలాదిగా గుణదల మేరీమాతను దర్శించుకోటానికి భక్తులు తరలిరావటంతో కొండ మార్గాలు, అన్ని ప్రాంగణాలు, పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. విజయవాడ రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు ఉత్సవాలకు వచ్చే యాత్రికులతో కిటకిలాడాయి.

02/10/2019 - 05:00

అమరావతి, ఫిబ్రవరి 9: క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగుజాతి గుండెల్లో చెరగని ముద్రవేసిన దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ఓ దార్శనికుడని, భావితరాలకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్బోధించారు.

02/10/2019 - 04:57

అమరావతి, ఫిబ్రవరి 9: రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక ఓ దుర్దినం..చీకటి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన అడుగులతో ఏపీ అపవిత్రమవుతుందని విమర్శించారు. విభజన గాయాలపై కారం చల్లేందుకే ప్రధాని వస్తున్నారని మండిపడ్డారు. మోదీ రాకను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా రాష్టవ్య్రాప్తంగా నల్ల బ్యాడ్జీలు, నల్లచొక్కాలు ధరించి నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Pages