S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/20/2017 - 03:03

అమరావతి, మార్చి 19: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రతిష్ఠాత్మకంగా పరిణమించిన నియోజకవర్గాల పునర్విభజనపై సందేహాలు కొనసాగుతున్నాయి. వలస వచ్చిన వారికి కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలను ఆశగా చూపించిన ఏపి, తెలంగాణ ముఖ్యమంత్రుల ఆశలకు.. అవే తెలుగు రాష్ట్రాల బిజెపి నాయకత్వాలు కళ్లెం వేస్తున్నాయి. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా ఇద్దరు సీఎంలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.

03/20/2017 - 02:57

విజయవాడ, మార్చి 19: హిందూ ధార్మిక సంస్థలపై ప్రభుత్వాల పెత్తనం వల్ల హిందూ ధర్మానికి హాని జరుగుతోందని పలువురు హిందూ పీఠాధిపతులు, స్వామీజీలు, హిందూ సేవాసంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం గాంధీనగర్‌లో ‘హిందూ ధర్మం- సవాళ్లు- భవిష్యత్’ అనే అంశంపై రాష్టస్థ్రాయి సదస్సు జరిగింది.

03/20/2017 - 02:54

నరసరావుపేట, మార్చి 19: తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో గుంటూరు జిల్లా కోటప్పకొండపై రూ.5కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల, మరో రూ.5కోట్లతో నిర్మించిన భక్తుల వసతి సముదాయాలను శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో కలిసి ఆదివారం ప్రారంభించారు.

03/20/2017 - 02:52

తెనాలి, మార్చి 19: రాష్ట్ర విభజన సమయంలో నాటి ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారమే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిందని తమిళనాడు మాజీ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విభజన వాస్తవాలను ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారని రోశయ్య వ్యాఖ్యానించారు. ఆ నమ్మకం తమకుందని చెప్పారు.

03/20/2017 - 02:17

రాజమహేంద్రవరం, మార్చి 19: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ చెప్పారు. రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆదివారం జరిగిన విలేఖర్లతో మాట్లాడారు. రెండు దశాబ్దాల ఉద్యమ స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఛైర్మన్‌గా నియమించిందని, కొన్ని సాంకేతిక కారణాలవల్ల సమస్య ఎదురైనప్పటికీ మళ్ళీ తన నియామకం జరిగిందన్నారు.

03/20/2017 - 02:15

విజయవాడ, మార్చి 19: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం హాజరయ్యారు. బిజెపి అగ్ర నాయకత్వం ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకారోత్సవ సభకు హాజరయ్యేందుకు చంద్రబాబు వెళ్లారు. లక్నోలో జరిగిన కార్యక్రమంలో ఈసందర్భంగా ఆదిత్యనాథ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.

03/20/2017 - 02:13

యాదమరి, మార్చి 19: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు టెంపో ట్రావెలర్‌లో ఏడుగురు కర్నాటక రాష్ట్రం నుంచి తిరుమలకు వెళ్తున్నారు. ఈక్రమంలో మండలంలోని లక్ష్మయ్యకండ్రిగ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఆ వాహనాన్ని తప్పించబోయి ఢీకొంది.

03/20/2017 - 02:12

తిరుపతి, మార్చి 19: వచ్చే ఏడాది నాటికి దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది కార్మికులకు ఇఎస్‌ఐ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర కార్మిక ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం స్థానిక నూతన ఇఎస్‌ఐ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు.

03/20/2017 - 02:10

విశాఖపట్నం, మార్చి 19: తెలుగుదేశం పార్టీ మహానాడును ఈ ఏడాది విశాఖలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు, గత ఏడాది మహానాడును తిరుపతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గత ఏడాది గుంటూరులో జరపాలని పార్టీ వర్గాలు భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. రాష్ట్ర పార్టీ సమావేశాలు, అసెంబ్లీ తదితర కార్యకలాపాలన్నీ విజయవాడ, గుంటూరు జిల్లాల్లోనే జరుగుతున్నాయి.

03/20/2017 - 02:10

విశాఖపట్నం, మార్చి 19: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఆదివారం రాత్రి వెల్లడించింది. దీని ప్రభావం వలన తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉందని, అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిస్తాయని పేర్కొంది. అలాగే ఏపిలో కూడా ఆదివారం చెదురుమదురు వర్షాలు కురిశాయి. తునిలో అత్యధికంగా మూడు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Pages