S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/15/2017 - 03:03

విజయవాడ, మార్చి 14: నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆఖరి క్షణం వరకు పరితపించిన తన తండ్రి భూమా నాగిరెడ్డి అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరే వరకు ఇక తండ్రిని తలచుకుని ఏడవ కూడదని గట్టిగా నిర్ణయించుకున్నా... అవన్నీ నెరవేరిన తర్వాత మనస్ఫూర్తిగా ఏడుస్తానంటూ ఆయన కుమార్తె అఖిలప్రియ ఎంతో ఉద్వేగంతో చెప్పారు.

03/15/2017 - 03:01

విజయవాడ (పటమట) మార్చి 14: అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తొందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్టి ఈశ్వరి తీవ్రస్థాయిలో టిడిపిపై ధ్వజమెత్తారు.

03/15/2017 - 02:58

విజయవాడ (పటమట) మార్చి 14: శాసనసభలో భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెడితే ప్రతిపక్ష నాయకుడుగా జగన్ రాలేదంటే ఆరు దశాబ్దాల అసెంబ్లీ చరిత్రలో వైకాపా నిర్ణయం మాయనిమచ్చగా మిగిలిపోతుందని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.

03/15/2017 - 02:22

విజయపురిసౌత్, మార్చి 14: నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుండి సాగర్ కుడి కాలువకు మంగళవారం తెల్లవారుజాము నుండి నీటిని ఆకస్మికంగా విడుదల చేశారు. కొద్ది రోజుల కిందట సాగర్ కుడి కాలువకు విడుదల చేసే నీటిలో ఆవిరైన నీటి పేరుతో 1.5 టిఎంసీల నీరు ఇవ్వలేదని కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టు అధికారులు లేఖ రాశారు.

03/15/2017 - 02:20

అమరావతి, మార్చి 14: భూమా నాగిరెడ్డి మృతికి సంతాపం ప్రకటించని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీరు, ఆ తర్వాత ఆయన పార్టీనేతలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. ‘ఇప్పుడే మనవాళ్లు చెబుతున్నారు. సాటిజీవి చనిపోతే పక్షులు, పశువులు కూడా సానుభూతి చూపుతాయి. కానీ జగన్ ఆ మాత్రం సానుభూతి కూడా చూపలేకపోయారా’ అని సభ అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబు ప్రశ్నించారు.

03/15/2017 - 02:18

హైదరాబాద్, మార్చి 14: కోట్ల సంపాదన కంటే సమస్యలవైపే తాను నిలబడతానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మంగళవారం నాడు చెప్పారు. జనసేన పార్టీ ఆవిర్భవించి మూడేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ డాట్ ఆర్గ్ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పిఆర్పీ కోసం తాను చాలా పనిచేశానని, రాజకీయంగా చిరంజీవితో ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు.

03/15/2017 - 02:16

న్యూఢిల్లీ, మార్చి 14: ఆంధ్రప్రదేశ్ వైద్య కళాశాలల్లోని క్లినికల్ కోర్సుల్లో 380 సీట్లను పెంచడానికి కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు ఒక రోజు పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి వచ్చిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి జెపి నడ్డాతో భేటీ అయ్యారు.

03/15/2017 - 02:16

బేస్తవారపేట, మార్చి 14: అభంశుభం తెలియని ఆరు సంవత్సరాల బాలుడిని ఓ మహిళ హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని సింగరపల్లి గ్రామంలో జరిగింది. బేస్తవారపేట ఎస్సై శశికుమార్ కథనం మేరకు సింగరపల్లి గ్రామానికి చెందిన మిరియంపల్లి బాలచంద్రుడు, గురవమ్మలకు రాంచరణ్ (6) అనే కుమారుడు ఉన్నాడు.

03/15/2017 - 02:15

విశాఖపట్నం (జగదాంబ), మార్చి 14: ప్రకృతి వైపరీత్యాల వలన పక్షి సంతతి నశించిపోతోందని పదో తరగతి విద్యార్థి పి.షన్ముఖ్ మాధవ్ తన యానిమేషన్ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్టు తెలిపాడు. దీంతో హర్యానాలోని వరల్డ్ రికార్డ్ యూనివర్సిటీ వైస్-్ఛన్సలర్ డాక్టర్ థామస్ రిచర్డ్ విలియమ్ అతడిని అభినందించడంతో పాటు డాక్టరేట్‌ను ప్రదానం చేశారని భాష్యం విద్యాసంస్థ యాజమాన్యం పేర్కొంది.

03/15/2017 - 02:13

హైదరాబాద్, మార్చి 14: హరిద్వార్ లేదా రుషీకేష్‌లో త్వరలో సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, రామ్‌దేవ్‌బాబా సూత్రప్రాయంగా నిర్ణయించారు. స్వరూపానందేంద్ర, రామ్‌దేవ్‌బాబా రుషీకేష్‌లో మంగళవారం కలిసి ధార్మిక అంశాలపై చర్చించారు. సాధువుల సమావేశంపై అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

Pages