S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/15/2017 - 02:12

అనంతపురం, మార్చి 14 : అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తి కొత్తకోట గ్రామంలో మంగళవారం కురిసిన వర్షానికి పిడుగుపడి జయచంద్ర (21) మృతి చెందాడు. ఆదిలక్ష్మి, నారాయణ, నర్సమ్మకు గాయాలయ్యాయి. వీరంతా కలిసి మంగళవారం చింతకాయలు తెంపేందుకు వెళ్లారు. ఆ సమయంలో వర్షం కురవడంతో చెట్టుకింద తలదాచుకున్నారు. ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడడంతో జయచంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా వారు గాయపడ్డారు.

03/15/2017 - 02:12

విజయనగరం, మార్చి 14: దేశంలోనే తొలిసారిగా వంద గంటల్లో 10,449 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయి. ఈ ఘనత విజయనగరం జిల్లాలోని సుంకరిపేటలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల పదోతేదీ ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి, మంగళవారం ఉదయం పది గంటలకు విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా గ్రామంలో మంగళవారం విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడారు.

03/15/2017 - 00:48

విజయవాడ, మార్చి 14: ఒక కాకి చనిపోతే.. జాతిలో కాకులన్నీ వాలి రొద పెడుతుంటాయి.. శత్రువు చనిపోయినా ఇంటికెళ్లి కుటుంబాన్ని ఓదార్చి నాలుగు మంచి మాటలు చెప్పి సానుభూతి చూపటమనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం.. సహచర శాసనసభ్యుడు..

03/15/2017 - 00:47

విజయవాడ, మార్చి 14: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నట్లుగా రిజిస్టర్‌లో సంతకాలు చేసినప్పటికీ, కొందరు వైకాపా సభ్యులు మంగళవారం సమావేశానికి హాజరు కాకపోడవం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ రిజిస్టర్‌లో సంతకాలు చేసిన 14 మంది వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనికి రాకుండా ప్రతిపక్ష నేత జగన్ చాంబర్‌లో సమావేశమయ్యారు.

03/15/2017 - 00:46

అమరావతి, మార్చి 14: భవిష్యత్తులో కూడా తమ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలసి పనిచేస్తుందన్న సంకేతాలు ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి వరకూ కొనసాగిన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల సమావేశంలో బాబు ఈ మేరకు తన మనసులో మాట వెల్లడించారు.

03/15/2017 - 00:46

విజయవాడ, మార్చి 14: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాము మాట్లాడుతుండగా, వివరణ అంటూ మంత్రులు ఎదురుదాడికి దిగటంతో ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన సమయంలో మంత్రులు మాట్లాడుతున్నా, చైర్మన్ నియంత్రించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాష్ట్ర శాసన మండలిలో మంగళవారం చర్చ జరిగింది.

03/15/2017 - 00:45

గుంటూరు కల్చరల్, మార్చి 14: తెలుగువారికే సొంతమైన అవధాన విద్యలో తమకు తామే సాటనిపించుకుని, తెలుగునాట అవధాన కవితా ప్రవాహాన్ని అనంతంగా ప్రవహింపచేసిన కొప్పరపు కవులను స్మరించుకుంటూ వారి అవధాన వైభవంపై ఈనెల 18వ తేదీన గుంటూరు నగరంలో సాహిత్యగోష్టిని సంస్కృతి సంగీత సాహిత్య నృత్యనాటక సంస్థ ఏర్పాటు చేయనుంది.

03/15/2017 - 00:44

విశాఖపట్నం, మార్చి 14: రావూరి అర్జునరావు, మనోరమ దంపతుల జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శమని మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. రావూరి అర్జునరావు శత వసంతాల జన్మదినోత్సవం మంగళవారం ఆంధ్రవిశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాలు వేదికగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోసయ్య మాట్లాడారు.

03/15/2017 - 00:43

అమరావతి, మార్చి 14: సభలో సభ్యుడు మృతి చెందిన సందర్భంలో పార్టీలకు అతీతంగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టే సంప్రదాయానికి ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దూరంగా ఉండటం ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలకు దారితీసింది. తీర్మానానికి దూరంగా ఉండాలంటూ వైసీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

03/15/2017 - 00:41

విశాఖపట్నం, మార్చి 14: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డిసిఐ) ప్రైవేటుపరం చేయద్దంటూ ఆ సంస్థ ఉద్యోగులు మంగళవారం డిసిఐ చైర్మన్ రాజేష్ త్రిపాఠిని కలిశారు. దీనిపై చైర్మన్ త్రిపాఠి మాట్లాడుతూ డిసిఐ షేర్ల అమ్మకంపై అధికారికంగా తనకు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. షేర్ల విక్రయాన్ని నిరసిస్తూ డిసిఐ ఉద్యోగులు నాలుగు రోజులుగా చేస్తున్న నిరసన ప్రదర్శనలను ఇకపై కూడా కొనసాగించాలని నిర్ణయించారు.

Pages