S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/16/2016 - 05:10

విజయవాడ, ఏప్రిల్ 15: ఉచిత ఇసుక ప్రయోజనాలను ఎవరు దెబ్బతీసినా కఠిన చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శుక్రవారం తన నివాసం నుంచి జలవనరులు, భూగర్భ జలాలు, వ్యవసాయ, వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉచిత ఇసుక ప్రతి పేద కుటుంబానికి అందాలని అన్నారు. మండల, జిల్లా స్థాయిలో ఇసుక తవ్వకాలపై కమిటీలు వేయాలని ఆయన ఆదేశించారు.

04/15/2016 - 18:04

విశాఖ: ఓ గుమస్తాకు, అర్చకుల మధ్య వివాదం ఫలితంగా శ్రీరామనవమి పర్వదినాన విశాఖ నగరంలో ఓ రామాలయం మూతపడింది. తనపై అర్చకులు దాడి చేశారంటూ ఇక్కడి చెంగల్రావుపేటలోని రామాయలంలో పనిచేస్తున్న గుమస్తా నాగేశ్వరరావు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తమపై తప్పుడు కేసు పెట్టారంటూ అర్చకులు ఆందోళనకు దిగారు. ఆలయానికి తాళాలు వేసి అర్చకులు నిరసనకు దిగడంతో భక్తులు వెనుదిరిగారు.

04/15/2016 - 18:03

గుంటూరు: బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో శుక్రవారం స్నానం చేసేందుకు దిగిన ఇద్దరు యువకులు నీటమునిగి మరణించారు. శ్రీరామనవమి పండగ నాడు సరదాగా గడుపుదామని అప్పికట్ల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సూర్యలంక బీచ్‌కి వచ్చి సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

04/15/2016 - 18:02

కర్నూలు: ప్రేమించిన యువతితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిరాకరించడంతో తిరుపతికి చెందిన సాయి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నంద్యాలలోని ఓ లాడ్జిలో శుక్రవారం ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయమై ప్రియురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్చారు. సాయికి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు.

04/15/2016 - 14:52

గుంటూరు: నరసరావుపేట మండలం పమిడిపాడు వద్ద ఓ దిబ్బలో శుక్రవారం ఉదయం నాటు బాంబు పేలింది. రాజకీయ కక్షలకు నిలయమైన ఈ ప్రాంతంలో గతంలోనూ పలుసార్లు నాటు బాంబులు కలకలం సృష్టించాయి. విధ్వంసానికి పాల్పడే వ్యక్తులే నాటుబాంబులను పొదల్లో, దిబ్బల్లో దాచి ఉంచారని, అవి అప్పుడప్పుడు ఇలా పేలుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

04/15/2016 - 13:05

చిత్తూరు: వేగంగా వస్తున్న ఓ లారీ కారును ఢీకొనడంతో ఇద్దరు మరణించిన ఘటన శుక్రవారం ఉదయం బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి వద్ద జరిగింది. మృతులను కర్నాటక వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు.

04/15/2016 - 13:05

విజయనగరం: ఉత్తరాంధ్రలో అత్యంత ప్రాచీనమైన రామతీర్థం ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం సీతారామకల్యాణం వేడుకగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు, టిటిడి తరఫున జిల్లా మంత్రి డాక్టర్ మృణాళిని పట్టువస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు.

04/15/2016 - 13:04

కడప: ప్రైవేటు విద్యాసంస్థల పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడతామని ఎపి మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన రాజంపేటలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, పిల్లల తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లనే ఆశ్రయిస్తున్నందున సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు.

04/15/2016 - 13:03

విశాఖ: విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వైకాపా నాయకుడు గుడివాడ అమర్‌నాథ్ ఇక్కడ చేస్తున్న ఆమరణ దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. వివిధ ప్రజాసంఘాల నాయకులు దీక్షకు మద్దతు ప్రకటించారు.

04/15/2016 - 11:55

గుంటూరు: బాపట్లలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఆపరేషన్ థియేటర్‌లో విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా ఏసీ యంత్రం దగ్ధమైందని సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

Pages