S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/29/2017 - 03:32

గుంటూరు, జనవరి 28: ప్రతిపక్షనేత వైఎస్ జగన్ లక్ష కోట్ల ఆస్తిలో ఆయన రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా వాటా ఉందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. సజ్జల కార్యదర్శిగా ఉన్నందునే జగన్ తప్పుడు, దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్నారని శనివారం ఒక ప్రకటనలో పల్లె విమర్శించారు.

01/29/2017 - 03:31

నకరికల్లు, జనవరి 28: సాక్షాత్తు కన్నకొడుకే తండ్రిని హతమార్చిన సంఘటన గుంటూరు జిల్లా నకరికల్లులో శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. ఇక్కడకు అందిన సమాచారం ప్రకారం గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన భవనగిరి గురవయ్య(50) తన కొడుకు ఆంజనేయులు చేతిలో హత్యకు గురయ్యాడు. తాగిన మైకంలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో గురవయ్యకు బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘర్షణకు కారణాలు తెలియరాలేదు.

01/29/2017 - 03:29

జమ్మలమడుగు, జనవరి 28: కడప జిల్లాలోని ఖనిజ నిక్షేపాలు వివరాల సేకరణకై హెలికాప్టర్‌తో సర్వే ముమ్మరం చేశారు. జిల్లాలో అపార ఖనిజ నిల్వలు ఉన్నట్లు ఇప్పటికే నిపుణులు తేల్చారు. దీంతో ప్రభుత్వం ఈ ఖనిజ నిక్షేపాలపై దృష్టి సారించింది. వీటిలో ప్రధానంగా అత్యధిక ప్రాధాన్యత, విలువ కలిగిన యురేనియం ఖనిజంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

01/29/2017 - 03:29

విజయవాడ, జనవరి 28: ఆంధ్ర ప్రాంత అర్చకుల సమస్యలను స్నేహ పూర్వక విధానంలో పరిష్కరిస్తామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. విజయవాడలోని కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం అర్చక ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సమస్యలకు ఒక్క నెలలోనే సానుకూల పరిష్కారాన్ని చూపిస్తామన్నారు.

01/29/2017 - 02:24

అమరావతి, జనవరి 28: అందివచ్చిన రాజకీయ ప్రయోజనాన్ని తన వ్యాఖ్యలతో కాలదన్నుకున్న తమ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీరుపై వైకాపా నేతలు తలపట్టుకుంటున్నారు.

01/29/2017 - 02:23

హైదరాబాద్, జనవరి 28: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అల్లరి చేసిన 12 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేద్దామా? లేక భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరిక చేసి వదిలి వేద్దామా? అనే అంశంపై ఎపి ప్రివిల్లేజస్ కమిటీ తర్జన-్భర్జన పడి చివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది.

01/29/2017 - 02:22

విశాఖపట్నం, జనవరి 28: జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలనుకోవడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసిన తరువాత శనివారం రాత్రి ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జల్లికట్టు ఒక సంప్రదాయ క్రీడ. దానికి హోదాకు ముడిపెట్టడం సరికాదని ఆయన అన్నారు.

01/29/2017 - 02:21

విశాఖపట్నం, జనవరి 28: విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్‌పై ఆశలు చిగురింప చేసే విధంగా చేసింది. ప్రత్యేక హోదా రాకపోతే, రాయితీలు రావని, అందువల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని విపక్షాలు అంటున్నాయి. హోదా వలన రాయితీలు రావని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు.

01/28/2017 - 05:26

పోలవరం, జనవరి 27: పోలవరం పనుల మట్టి డంపింగ్ చేయడానికి సేకరించిన తమ భూముల పరిహారం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన మూలలంక రైతులు శుక్రవారం నుంచి ఆమరణ దీక్షకు దిగారు. పోలవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తాడి మంగారాం, నంగినీడి వెంకట కృష్ణారావు దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా కుటుంబ సభ్యులు, రైతులు, గ్రామస్థులు దీక్షాస్థలం వద్ద బైఠాయించారు.

01/28/2017 - 05:24

కడప, జనవరి 27: ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెక్కులు అరకొరగా పంపిణీ చేస్తున్నారంటూ కడప జిల్లా గండికోట రిజర్వాయర్ ముంపువాసులు కొండాపురంలో ఆర్డీవో వినాయకం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ముంపువాసులు మాట్లాడుతూ ముంపుగ్రామాల ప్రజలందరికీ పరిహారం చెక్కులు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించినా విడతల వారీగా అదీ అరకొరగా పంపిణీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

Pages