S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/26/2016 - 07:15

విశాఖపట్నం, నవంబర్ 25: దేశంలో రానున్న రోజుల్లో నీటి కొరత రాబోతోందని, అందువల్ల వర్షపు నీటిని తప్పనిసరిగా నిల్వ చేసుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనానాయుడు అన్నారు. సన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ పాత నగరం క్వీన్‌మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామంతో ఏర్పాటు చేసిన సుజలధార, హరిత జీవన మరుగుదొడ్లను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు.

11/26/2016 - 06:55

విజయవాడ, నవంబర్ 25:‘కాపులకు బిసి రిజర్వేషన్ల వర్తింపుపై కాంగ్రెస్ పార్టీ ఎన్నోమార్లు తమ ఎన్నికల ప్రణాళికలలో హామీ ఇవ్వడమేగాని అమలుకు నోచుకోలేదు. అయితే టిడిపి దీనికి కట్టుబడి ఉంద’ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విద్యా, ఉపాధి రంగాల్లో కాపులు వెనుకబడి ఉన్నందునే రిజర్వేషన్లు కల్పించదలిచామనీ, దీనివల్ల బిసిల రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదంటూ హర్షధ్వానాల మధ్య భరోసా ఇచ్చారు.

11/26/2016 - 06:23

ఏలూరు, నవంబర్ 25: కేంద్రంలో అధికారం చేపట్టిన తమది రైతు అనుకూల ప్రభుత్వమని చాటిచెప్పడంలో భాగంగా బిజెపి శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రైతు మహాసభను నిర్వహిస్తోంది. సుమారు లక్షమంది రైతులు తరలివస్తారని అంచనావేస్తున్న ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరువుతున్నారు.

11/26/2016 - 06:14

విజయవాడ (క్రైం), నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ నూతన సచివాలయంలో అవినీతి బోణి చేసింది. ఓ పేరు మోసిన సెక్యూరిటీ కంపెనీకి అనుమతి జారీ చేసేందుకు రూ.50వేలు లంచం తీసుకుంటూ సెక్షన్ ఆఫీసర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. ఈ సంఘటన సచివాలయంలో కలకలం రేకెత్తించింది.

11/25/2016 - 07:42

విజయవాడ, నవంబర్ 24: తిరుపతి, కృష్ణపట్నం, శ్రీ సిటీలను ట్రైసిటీగా అభివృద్ధి చేసి మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం రాత్రి సిఎంఓలో తనను కలిసిన ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ బృందంతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి యూనిట్లను తెరిచే సెల్యులర్ కంపెనీలకు తగిన ప్రోత్సాహకాలిస్తామని అన్నారు.

11/25/2016 - 07:31

విజయవాడ, నవంబర్ 24: పెద్దనోట్ల రద్దుతో ఈ వారం పది రోజుల్లోనే రూ.17కోట్ల నష్టం వచ్చిన నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం, చిల్లర సమస్యను అధిగమించేందుకు దశల వారీగా అన్ని బస్ స్టేషన్‌లలో స్వైపింగ్ మిషన్లను ప్రవేశపెట్టనున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. స్థానిక పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో గురువారం ఆయన లాంఛనంగా ఈ స్వైపింగ్ మిషన్‌ను ప్రారంభించారు.

11/25/2016 - 07:29

విజయవాడ, నవంబర్ 24: సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకోవాలని, లేకపోతే అది పెరుగుతుందే తప్ప తగ్గదని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుంటే పరిష్కారం సులువు అవుతుందని స్పష్టం చేశారు. ‘‘మన రాష్ట్ర మహిళా శక్తిని రుజువు చేసే సమయం, అవకాశం వచ్చాయి...

11/25/2016 - 06:57

అమరావతి, నవంబర్ 24: రాష్ట్రంలో మొబైల్ ఫోన్లు లేని పేదలందరికీ ఫోన్లు సమకూర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. డిజిటల్ లావాదేవీలు జరపడానికి వీలుగా అందరికీ ఫోన్లు ఉండాలని, అందుకే ఈ ఆలోచన అమలు చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుండి బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు.

11/25/2016 - 06:45

విజయవాడ, నవంబర్ 24: ఆటోమొబైల్ ఇంటీరియర్స్‌కు ప్రఖ్యాతిగాంచిన అంటోలిన్ ఇంజనీరింగ్ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో గురువారం సమావేశమయ్యారు. ఆడి, మెర్సిడిస్ వంటి దిగ్గజ కార్లకు ఈ సంస్థ తయారు చేసిన ఇంటీరియర్ పరికరాలు వినియోగిస్తున్నారు. పుణె, చెన్నైలలో ప్రస్తుతం ఆంటోలిన్ సంస్థకు తయారీ కేంద్రాలు ఉన్నాయి.

11/24/2016 - 07:51

విశాఖపట్నం, నవంబర్ 23: రైల్వే కార్మికుల సమస్యలపై కేంద్రం స్పందించకపోవడంతో అమీతుమీ తేల్చుకునేందుకు రైల్వే కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుతో అనేకసార్లు చర్చలు జరిపినా అవి ఫలించలేదు. మరోసారి ఇచ్చిన గడువు సైతం ముగుస్తున్నా కేంద్రం స్పందించకపోవడంతో భారతీయరైల్వే ఉద్యోగుల జాతీయ సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐఆర్) ఇపుడు అమీతుమీకి సన్నద్ధమవుతుంది.

Pages