S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/28/2016 - 07:52

రాజమహేంద్రవరం, నవంబర్ 27: పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి చేసి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు, అటు కృష్ణా డెల్టాలకు గోదావరి జలాలను అందించడం వల్ల రూ.250 కోట్ల విలువైన పంట దక్కిందని, అటువంటి ప్రాజెక్టయిన వట్టిసీమను విమర్శించిన నాయకులు ఇపుడు ఏమంటారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని అన్నారు.

11/28/2016 - 07:51

విజయవాడ, నవంబర్ 27: అబద్దాల అమిత్‌షా.. మోసకారి మోదీ... మధ్య వారధిలా వెంకయ్య అంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌ను ముంచుతున్నారని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. పిసిసి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడెం సభ గురించి ప్రస్తావిస్తూ అబద్ధాలు చెప్పిపోవడానికే అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారని అన్నారు.

11/28/2016 - 07:26

మచిలీపట్నం, నవంబర్ 27: కృష్ణాజిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద సమీపంలోని సముద్రంలో ఆదివారం సాయంత్రం నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన 15మంది యువకులు ఆదివారం విహారయాత్రగా నాగాయలంక లైట్‌హౌస్‌కు వచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో సరదాగా గడిపిన వారంతా మధ్యాహ్నం 4గంటల సమయంలో సముద్ర స్నానాలకు వెళ్ళారు.

11/28/2016 - 07:22

కాకినాడ, నవంబర్ 27: వంట గ్యాస్ సిలెండర్లను ఇక నుండి నగదు రహిత బదిలీ ప్రక్రియ ద్వారానే సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తూర్పు గోదావరి జిల్లాలో చకచగా జరుగుతున్నాయి. గ్యాస్ సిలెండర్లు సరఫరా చేసే ఎల్‌పిజి డీలర్లు విధిగా నగదు రహిత బదిలీని పాటించేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

11/28/2016 - 07:09

తిరుపతి, నవంబర్ 27: లోక రక్షణి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ఉదయం అమ్మవారు పెద్దశేష వాహనంపై వైకుంఠ నాథుడు శ్రీలక్ష్మీనారాయణుడి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క్భజనల నడుమ అమ్మవారు నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

11/28/2016 - 07:05

రాజమహేంద్రవరం, నవంబర్ 27: ప్రధాని మోదీ సర్కార్ కార్పొరేట్ల లబ్ధి కోసమే పని చేస్తోందని, ప్రత్యామ్నాయం చూపించకుండా నోట్లను రద్దు చేయడం అత్యంత క్రూరమైన చర్యని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీని నూటొక్కసారి కాల్చిపారేసినా పాపం లేదని నారాయణ అన్నారు. వెంకయ్య నాయుడు మోదీ భజన మానుకుని కళ్లు తెరవాలన్నారు.

11/27/2016 - 06:53

రాజమహేంద్రవరం, నవంబర్ 26: చెన్నైనుంచి రూ.అర కోటి విలువైన వెయ్యి రూపాయల నోట్లను మార్చేందుకు రాజమహేంద్రవరానికి వచ్చిన ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, నగదును స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

11/27/2016 - 06:17

కడప, నవంబర్ 26: పెద్దనోట్ల రద్దుతో ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డికి వణుకుపుట్టిందని, దాచుకున్న డబ్బంతా ఏం చేయాలో తెలియక పిచ్చిపట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం కడప నగరం, రాజంపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న జగన్ అధికారంలోకి రావడం కలేనన్నారు.

11/26/2016 - 07:53

విజయవాడ, నవంబర్ 25: అర్చకులు, దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది.

11/26/2016 - 07:40

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను విడదీయడంతో ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల విభజన అంశాన్ని ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ సమస్యను డిసెంబర్ 7వ తేదీలోగా పరిష్కరించుకోవాలని కూడా హైకోర్టు గడువు విధించింది.

Pages