S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/22/2016 - 03:35

విజయనగరం, నవంబర్ 21: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలతో సహకార బ్యాంకులు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లు ఇతర బ్యాంకులలో చెల్లుబాటు అవుతున్నప్పటికీ సహకార బ్యాంకులలో చెల్లుబాటుకాకపోవడం వల్ల అటు రైతులు, ఇటు బ్యాంకులు విలవిల్లాడుతున్నాయి.

11/22/2016 - 03:35

తిరుపతి, నవంబర్ 21: తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి కనుమమార్గంలో 25వ మార్గం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోపల సోమవారం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. తిరుమల నుంచి వాహనాలలో తిరుపతికి వస్తున్న భక్తులు ఈ మంటలను గుర్తించి అలిపిరి టోల్‌గేట్ వద్ద భద్రతా సిబ్బందికి తెలియజేశారు. వారు వెంటనే అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

11/22/2016 - 03:34

తాడేపల్లి, నవంబర్ 21: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో బకింగ్‌హామ్ కెనాల్‌లో సోమవారం ప్రమాదవశాత్తూ ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. విజయవాడలోని శాంతినగర్, రాజీవ్‌నగర్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు సోమవారం సీతానగరంలోని బకింగ్‌హామ్ కాలువ హెడ్ స్లూయిజ్ సమీపంలో కాలువలోకి దిగి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తుండగా అంజి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

11/21/2016 - 03:58

మదనపల్లె, నవంబర్ 20: గ్రామాధికారుల పాలన రద్దు చేయడంతో బ్రాహ్మణులు వెనుకబాటుతనంలో నిలిచిపోయారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. బ్రాహ్మణోత్తముల సహకారంతో ఏర్పాటైన రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా కల్పిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు ఆదివారం చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణంలో నిర్వహించారు.

11/21/2016 - 03:58

విజయనగరం, నవంబర్ 20: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సిపిఎస్) రద్దుకు ఉద్యమం తప్పదని ఎపి ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు హెచ్చరించారు. ఇక్కడ ఆదివారం జరిగిన ఎపిఎన్జీవో సంఘం కౌన్సిల్ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు.

11/21/2016 - 03:57

విశాఖపట్నం, నవంబర్ 20: అంతరిక్షంలో ప్రైవేట్ సంస్థలను అనుమతించడం, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అంతరిక్ష కార్యకలాపాలు చేపట్టే సందర్భంలో వాటిని చట్టపరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ న్యాయ కోవిదుడు, ఎపి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.్భవానీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

11/21/2016 - 03:57

హైదరాబాద్, నవంబర్ 20: కేంద్రం రద్దుచేసిన పెద్ద నోట్ల వల్ల ఆంధ్రలో రైతులు దెబ్బతిన్నారని, చిల్లర వ్యాపారం ధ్వంసమైందని, దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలు అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉన్నాయని పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

11/21/2016 - 03:55

విజయవాడ, నవంబర్ 20 : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న సంక్షోభం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే బ్యాంకర్లు, అధికారుల ముందున్న తక్షణ కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నోట్ల మార్పిడిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

11/21/2016 - 03:05

ఆదోని, నవంబర్ 20 : ప్రభుత్వాలు గతంలో, ప్రస్తుతం నోట్లు రద్దు చేసిన సందర్భాల్లో ఎక్కువగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ నల్లధనం పూర్తిస్థాయిలో బయటకు రాలేదనే చెప్పవచ్చు. ఈ విషయాన్ని చరిత్ర కూడా స్పష్టం చేస్తుంది. మన దేశంలో నోట్ల రద్దు అనే విషయం కొత్తేమీ కాదు. గతంలో నోట్లు రద్దు చేసినప్పుడు, ఇప్పుడు నల్లకుబేరుల కంటే ప్రజలే ఎక్కువగా ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

11/21/2016 - 02:57

జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 20: హైదరాబాదు నుండి తెనాలికి అక్రమంగా తరలిస్తున్న సుమారు పది లక్షల విలువైన వెండి, నగదును సర్కిల్ పోలీసులు అదివారం తెల్లవారుజామున కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. దీనికి సంబంధించి చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సిఐ లచ్చునాయుడు వివరాలు తెలిపారు.

Pages