S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/27/2016 - 04:21

మచిలీపట్నం, సెప్టెంబర్ 26: బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించేందుకు మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) సిద్ధమైంది. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన 33 వేల 337 ఎకరాల భూములకు సంబంధించి వారం రోజుల క్రితం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసిన మడ అధికారులు మంగళవారం నుండి గ్రామసభల నిర్వహణకు సిద్ధమయ్యారు. మూడురోజుల పాటు నిర్వహించనున్నారు.

09/27/2016 - 04:20

ఏలూరు/ఒంగోలు , సెప్టెంబర్ 26: అప్పులోళ్ల బాధలు భరించలేక కలెక్టరేట్‌ల వద్ద ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయ. ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం ఒక వ్యక్తి చెదల నివారణకు ఉపయోగించే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అతడిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, కోలుకుంటున్నాడు.

,
09/27/2016 - 04:18

కడప, సెప్టెంబర్ 26: కడప నగరంలో సోమవారం జరిగిన మంజునాథ్ కమిటీ విచారణలో రసాభాస చోటుచేసుకుంది. బిసి మహిళా నేత ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాపులను బిసిల్లో చేర్చవద్దంటూ బిసి సంఘాల నాయకులు ఆందోళన చేయడంతో గందరగోళం నెలకొంది.

09/27/2016 - 04:15

గుంటూరు, సెప్టెంబర్ 26: ‘నాది సుదీర్ఘ రాజకీయ జీవితం. నాలుగు దశాబ్దాల కాలంలో నిప్పులా బతికాను. నీతి నిజాయతీగా ఉన్నా. వ్యాపార లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలకు తావివ్వద్దని స్వయానా కుటుంబ సభ్యులకే చెప్పా. నా అనుభవం అంత వయసులేని వాళ్లు అపనిందలు వేస్తున్నారు. ప్రజల కోసం అన్నీ సహిస్తున్నా. నా జీవితంలో భయమంటే ఏమిటో తెలియదు’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

09/27/2016 - 04:14

అనంతపురం, సెప్టెంబర్ 26: ఓవైపు సిపిఐ ఆందోళనలు, విద్యార్థుల నిరసనలు, మరోవైపు కలెక్టరేట్ వద్ద వైద్యులకు మద్దతుగా ఎన్‌జిఒల ధర్నాతో అనంతపురం నగరం సోమవారం అట్టుడికింది. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సిపిఐ నగర శాఖ నాయకుడు లింగమయ్య నేతృత్వంలో నగర పాలకసంస్థ వద్ద ఉదయం నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

09/27/2016 - 04:14

బత్తలపల్లి, సెప్టెంబర్ 26: పాఠశాల తరగతి గది పైకప్పు పెచ్చులూడి తలపై పడడంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లిలో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నయి. బత్తలపల్లి బాలికల ఉన్నత పాఠశాల 8వ తరగతి గదిలో విద్యార్థినులు త్రైమాసిక పరీక్షలు రాస్తుండగా ఒక్కసారిగా గది పైకప్పు పెచ్చులూడి పడ్డాయి.

09/27/2016 - 04:13

బండి ఆత్మకూరు, సెప్టెంబర్ 26: కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పాత మిద్దెకూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం పార్నపల్లెలో సోమవారం మిద్దె కూలడంతో దూదేకుల కాశమ్మ(70), సలీమా బేగం(40) చనిపోయారు. మధ్యాహ్నం వీరిద్దరూ ఇంటి వరండాలో కూర్చుని మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా పైకప్పు దూలం విరిగి బండలు, మట్టి మీద పడడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.

09/27/2016 - 04:13

విశాఖపట్నం, సెప్టెంబర్ 26: విధర్భ నుంచి చత్తీస్‌గడ్ పరిసరాలను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం సోమవారం కూడా కొనసాగుతోంది. దీనికి తోడు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. ఇదే సమయంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

09/27/2016 - 04:12

నెల్లూరు, సెప్టెంబర్ 26: అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే తమను రూ.5కోట్ల నగదు డిమాండ్ చేస్తున్నాడంటూ కృష్ణపట్నం- ఓబులాపల్లి రైల్వే లైను కాంట్రాక్ట్ పనులు చేపట్టిన కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు ఆరోపించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో కంపెనీ ప్రతినిధులతో పాటు రైల్వే సీనియర్ ఇంజనీర్లు కూడా పాల్గొని విఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించారు. కంపెనీ సెక్రటరి కల్పేష్ దేశాయి తెలిపిన వివరాల మేరకు..

09/27/2016 - 03:10

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టుకున్న ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లోగా తొలిదశ నిర్మాణాలు కొన్నయినా పూర్తి చేయాలన్న లక్ష్యంతో అటు కేంద్రం, ఇటు విదేశీ బ్యాంకులపై ఒత్తిడి చేస్తున్న తెదేపా ప్రభుత్వ ప్రయత్నాలు కొంతమేరకు ఫలించాయి.

Pages