S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/28/2016 - 02:41

గుంటూరు, సెప్టెంబర్ 27: రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పోలీసు స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు డిజిపి నండూరి సాంబశివరావు తెలిపారు. తొలివిడతగా గుంటూరు, విజయవాడలో మోడల్ పోలీసుస్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం గుంటూరులో స్థల పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు.

09/28/2016 - 02:41

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 27: గోదావరి పుష్కరాల తొలిరోజున రాజమహేంద్రవరం పుష్కరాలరేవులో జరిగిన తొక్కిసలాటపై విచారణ ఇంకా పూర్తికాలేదు. తొక్కిసలాట జరిగి ఏడాదికి పైగా గడిచింది. తొక్కిసలాటకు బాధ్యులను తేల్చేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేసి ఈ నెల 29వ తేదీకి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పటివరకు కమిషన్ విచారణ ఒక కొలిక్కిరాలేదు.

09/28/2016 - 02:40

చిత్తూరు, సెప్టెంబర్ 27: ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని లాటరీ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ అయన దినేష్‌కుమార్‌తోపాటు మరో 10 మంది ముఠా సభ్యులను ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4.02 లక్షల నగదు, ఐదు ద్విచక్రవాహనాలు, ప్రింటర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

09/28/2016 - 02:39

విజయవాడ, సెప్టెంబర్ 27: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొద్ది రోజులుగా ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద ప్రభావం ప్రస్తుతం తగ్గినట్టే తగ్గుతూ మళ్లీ పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మంగళవారం రాత్రి పులిచింతల గేట్లను తెరచి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బుధవారం సాయంత్రానికి ఈ నీరు బ్యారేజీకి చేరనుంది.

09/28/2016 - 02:39

విజయవాడ, సెప్టెంబర్ 27: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధ, గురువారాల్లో రెండురోజుల పాటు స్థానిక వెన్యూ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ల సమావేశాలు జరుగనున్నాయి. రాష్టవ్య్రాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదలు ఈ సందర్భంగా జరిగిన భారీ నష్టంపై చర్చ జరగనుంది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వపరంగా జరగాల్సిన కార్యక్రమాలపై చర్చ జరుగనుంది.

09/28/2016 - 02:38

విశాఖపట్నం, సెప్టెంబర్ 27: విధర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణల మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. విదర్భ, చత్తీస్‌గడ్‌లను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల వర్షం కురుస్తుంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురియవచ్చు.

09/28/2016 - 02:38

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రాంత నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో టెండర్లు ఆహ్వానించడంపై హైకోర్టులో మంగళవారం వాదనలు కొనసాగాయి. గత వారం హైకోర్టు న్యాయమూర్తి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో టెండర్లను పిలవడంపై స్టే ఇవ్వడంతోపాటు తదుపరి ప్రక్రియను సైతం నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

09/28/2016 - 02:37

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27:ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను అక్టోబరు 31కి వాయిదా వేసింది. మాజీ ఐఎఎస్ అధికారి ఇఏఏస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. పర్యావరణ అనుమతులకు సంబంధించిన వివరాలను ట్రిబ్యునల్‌కు సమర్పించేందుకు సమయం కావాలని ట్రిబ్యునల్ కోరారు.

09/27/2016 - 04:25

గుంటూరు, సెప్టెంబర్ 26: ‘వ్యవసాయ రంగంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం. జాతీయ స్థాయిలో వృద్ధిరేటు గణనీయంగా తగ్గింది. విశ్వవిద్యాలయాలు స్వయం పోషకత్వంతో నిత్యనూతన పరిశోధనలను ఆవిష్క రించాలి. నాణ్యమైన విత్తనోత్పత్తితోనే లాభసాటి వ్యవసాయం చేయగలం. ఆ దిశగా అవసరమైన శాస్త్ర, సాంకేతికతలను జోడించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు కృషి జరగాలి’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.

09/27/2016 - 04:23

గురజాల, సెప్టెంబర్ 26: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో భారీ వర్షాలతో వచ్చిన వరదలకు పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, ప్రభుత్వం మాత్రం రైతులను పూర్తిగా విస్మరించిందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శించారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సోమవారం గురజాల వచ్చిన ఆయన పట్టణంలోని బ్రహ్మనాయుడు విగ్రహం సెంటర్‌లో మాట్లాడారు.

Pages