S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/28/2016 - 07:02

చేబ్రోలు, సెప్టెంబర్ 27: విద్యాలయాలు రాజకీయ కేంద్రాలు కాకూడదని, దేవాలయాల్లా పవిత్రంగా ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎన్ వెంకయ్యనాయుడు హితవుపలికారు. గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన దక్షిణ భారత విశ్వవిద్యాలయాల వైస్‌చాన్సలర్ల మీట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నాగార్జున భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

09/28/2016 - 07:01

ధవళేశ్వరం, సెప్టెంబర్ 27: ఎగువ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఎప్పటికప్పుడు వరద నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి కాటన్ బ్యారేజీవద్ద 6.5 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తున్నారు.

09/28/2016 - 08:36

విశాఖపట్నం, సెప్టెంబరు 27: భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలమవుతోంది. వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దువ్వాడ నుంచి తుని వరకూ ఉన్న రైల్వే లైన్‌పై అనేక చోట్ల వరద నీరు వచ్చి చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

09/28/2016 - 06:36

విజయవాడ, సెప్టెంబర్ 27: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆ రంగం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భవానీ ద్వీపంలో మంగళవారం రాత్రి ఆడంబరంగా జరిగిన వేడుకల్లో చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

09/28/2016 - 02:55

రాజుపాలెం, సెప్టెంబర్ 27: పిల్లనిచ్చిన మామ ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబునాయుడుదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. మంగళవారం జగన్ గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని కొండమోడు, అనుపాలెం, బెల్లంకొండ, రాజుపాలెం, రెడ్డిగూడెం గ్రామాల్లో వరద ముంపునకు గురైన పొలాలు, బ్రిడ్జిలు, నర్సరీలు, గృహాలను పరిశీలించారు.

09/28/2016 - 02:54

మచిలీపట్నం, సెప్టెంబర్ 27: మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) అధికారులపై రైతులు తిరగబడ్డారు. బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ నిర్మాణానికి అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు సిద్ధమైన మడ అధికారులు మంగళవారం గ్రామసభల ద్వారా రైతుల ముందుకెళ్లారు. హుస్సేన్‌పాలెం, బుద్ధాలపాలెం, మేకావానిపాలెం, కోన, పోలాటితిప్ప, చిలకలపూడి రెవెన్యూ గ్రామాల పరిధిలో గ్రామసభలు నిర్వహించారు.

09/28/2016 - 02:51

తిరుమల, సెప్టెంబర్ 27: అక్టోబర్ 3నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల మందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. మంగళవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.

09/28/2016 - 02:49

గుంటూరు, సెప్టెంబర్ 27: రాజధాని నగర పరిధిలోని పిచ్చుకలపాలెం, దొండపాడు గ్రామాల్లో భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు మంగళవారం ప్లాట్లు పంపిణీ చేశారు. తుళ్లూరు ఎపి సిఆర్‌డిఎ కార్యాలయంలో కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు జరిపారు. కొత్త లే అవుట్‌లో సుహృద్భావ వాతావరణం ఉండేవిధంగా డిజైన్ చేశామన్నారు.

09/28/2016 - 02:47

చిలకలూరిపేట, సెప్టెంబర్ 27: వరదలకు దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా డ్రోన్‌లను ఉపయోగిస్తున్నామని ఎపి స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఇడి బొజ్జా కృష్ణ మంగళవారం తెలిపారు. గుంటూరు జిల్లా గంగన్నపాలెం వద్ద సుమారు 5 కిలోమీటర్ల మేర డ్రోన్‌ల ద్వారా పంటనష్టం అంచనా వేశారు.

09/28/2016 - 02:43

శ్రీశైలం, సెప్టెంబర్ 27:ప్రముఖ శైవక్షేత్రం, శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 నుంచి 11 వరకు నిర్వహించే ఉత్సవాలకు దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Pages